అంకాపూర్ (ఆర్మూరు)
వికీపీడియా నుండి
అంకాపూర్, నిజామాబాదు జిల్లా, ఆర్మూరు మండలానికి చెందిన గ్రామము. అంకాపూర్ గ్రామము అదర్శగ్రామముగా పేరు పొందినది. ఈ గ్రామము వ్యవసాయపరంగా అభివృద్ధి చెందినది. ఇక్కడ ముఖ్యంగా మొక్కజొన్న, పసుపు మరియు వివిధరకాల కూరగాయలు విరివిగా పండిస్తారు. ఈ గ్రామములోకి అడుగుపెడితే ఒక పట్టణములోకి వచ్చినట్టుగా ఉంటుంది.