ఎం కె వెల్లోడి
వికీపీడియా నుండి
ఎం.కె.వెల్లోడి హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రి, దౌత్యవేత్త మరియు ప్రముఖ ఇండియన్ సివిల్ సర్వీస్ (ICS) అధికారి.
కేరళీయుడైన వెల్లోడి 1896 లో కేరళ రాష్ట్రములోని మలప్పురముకు 12 కిలోమీటర్ల దూరములో ఉన్న కొట్టక్కళ్ పట్టణములో జన్మించాడు.
1950 జనవరి 26 నుండి 1952 మార్చి 6 వరకు హైదరాబాదు రాష్ట్ర ముఖ్య మంత్రిగా పనిచేశాడు. ఈయన భారత ప్రభుత్వముచే నియమిచబడిన ముఖ్యమంత్రి
[మార్చు] నిర్వహించిన పదవులు
- 1928 - తూర్పు గోదావరి జిల్లా కలెక్టరు
- 1937 మార్చి 18 నుండి 1937 నవంబర్ 26 - గంజాం జిల్లా కలెక్టరు
- 1950 జనవరి 26 నుండి 1952 మార్చి 6 - హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రి
- 1954,55 భారతదేశ రక్షణ కార్యదర్శి
- స్విట్జర్లాండ్లో భారత రాయబారి
- 1957 ఆగష్టు 1 నుండి 1958 జూన్ 4 - భారతదేశ కేబినెట్ కార్యదర్శి
- 1958 - 1958 అక్టోబర్ - ప్రణాళికా సంఘ కార్యదర్శి
- 1958 - 1959 ఆస్ట్రియాలో భారత రాయబారి
- 1958 - 1961 జర్మనీలో భారత రాయబారి