ఎస్వీ రంగారావు
వికీపీడియా నుండి
![]() |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడుఎస్వీ రంగారావు పూర్తి పేరు సామర్లకోట వెంకట రంగారావు (S.V.RangaRao, Samarlakota Venkata Rangarao). 'నట యశస్వి'గా పేరు పొదిన ఈ నటుడు మూడు దశాబ్దాలపాటు మూడొందల చిత్రాలకు పైగా అద్భుతంగా నటించి ఘటోత్కచుడిగా, కీచకుడిగా, రావణాసురుడిగా తనకు తానే సాటిగా వేరొకరు ఆ పాత్రలలో ఇమడ లేరన్నట్లు ఖ్యాతి గడించాడు.
[మార్చు] తొలి జీవితం
కృష్ణా జిల్లా లోని నూజివీడు లో 1918 జూలై 3 వ తేదీన ఎస్వీ రంగారావు జన్మించాడు. డిగ్రీ వరకూ చదివి, అగ్నిమాపక దళంలో ఉన్నతోద్యోగిగా పన్జేస్తూ, చలనచిత్ర రంగానికి ప్రవేశించక పూర్వం షేక్సిపియర్ ఆంగ్ల నాటకాలలో ఒథెల్లో, షైలాక్ తదితర పాత్రలు పోషించి ప్రముఖ రంగస్థల కళాకారుడిగా విశేష ఖ్యాతి గడించాడాయన. ఆ తర్వాత బి.వి.రామానందం దర్శకత్వంలో నిర్మించిన వరూధిని చిత్రంలో ప్రవరాఖ్యుడిగా తెలుగు చలనచిత్ర రంగాన తొలిసారిగా పరిచయమయ్యాడు.
[మార్చు] నటనా చాతుర్యం
ఆ తర్వాత మనదేశం, పల్లెటూరి పిల్ల , షావుకారు, పాతాళభైరవి, పెళ్లిచేసిచూడు, బంగారుపాప, బాల నాగమ్మ, గృహలక్ష్మి, బాల భారతం, తాత-మనవడు ఇలా అనేక చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి తన అద్భుతనటనా చాతుర్యంతో సగటు తెలుగు సినీ ప్రేక్షకుని మదిలో సయితం చెరగని ముద్రవేశాడు.
నటసామ్రాట్ , విశ్వనట చక్రవర్తి మొదలగు బిరుదులతో తెలుగు ప్రేక్షకులు అతన్ని గౌరవించారు. ఎస్వీఆర్ నటించిన నర్తనశాల ఇండోనేషియాలోని జకార్తాలో - ఆసియా ఫిల్మ్ ఫెస్టివల్‍లో ప్రదర్శించడమే కాకుండా ఎస్వీఆర్ పోషించిన కీచక పాత్రకు ప్రత్యేక బహుమతి పొందాడు. కొన్ని చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించాడు. ముఖ్యంగా ఆయన దర్శకత్వం వహించిన చదరంగం చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం బహుమతి, నగదు పారితోషికం లభించాయి.
అద్భుత నటనకు ప్రతీకగా నిల్చిన ఎస్వీ రంగారావు 1974 జూలై 18వ తేదీన మద్రాసు లో శాశ్వతంగా కన్నుమూశాడు.