కె. రాఘవేంద్ర రావు
వికీపీడియా నుండి
అందరి చేతా దర్శకరత్న అని పిలువబడే శతాధిక చిత్రాల తెలుగు సినిమా దర్శకుడు కె. రాఘవేంద్ర రావు. ఆయన మే 23, 1942 తేదీన కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన కొలవేను గ్రామంలో జన్మించారు. శ్రీదేవి, విజయశాంతి, రాధా, రమ్యకృష్ణ, రవళి లాంటి కథానాయికలకు ఎందరికో మంచి సినీ జీవితాన్ని ప్రసాదించిన ఈ దర్శకరత్న తన సినీజీవితాన్ని శోభన్ బాబు నటించిన బాబు అనే విజయవంతమైన చ్రిత్రంతో ప్రారంభించారు. ఆ తర్వాత ఎంతో మంది కథానాయకులతో ఎన్నో విజయవంతమైన చ్రిత్రాలు తీశారు. "హిమ్మత్-వాలా", "తోఫా" లాంటి విజవంతమైన హిందీ సినిమాలకు దర్శకత్వం వహించి బాలీవుడ్ లో తన సత్తా చాటారు. ష్త్రీ పాత్రలే ప్రధానంగా జ్యోతి, ఆమె కథ, కల్పన లాంటి చ్రిత్రాలు తీశారు.