చిల్కూరు
వికీపీడియా నుండి
చిల్కూరు హైదరాబాదు సమిపంలొ వున్న ఒక గ్రామం. హైదరాబాదులోని మెహిదీపట్నం నుండి చిల్కూరుకు 33 కి.మీ. దూరం ఉంటుంది. ఈ గ్రామం ఇక్కడ వెలసిన బాలాజీ (వెంకటేశ్వర స్వామి) ఆలయం వలన ప్రసిద్ధి చెందినది. ఈ స్వామిని "వీసా వెంకటేశ్వర స్వామి" అని ఇటీవల తరచు చెబుతూ ఉంటారు.
తెలంగాణాలో బాగా పురాతనమైన దేవాలయాలలో ఇది ఒకటి. భక్త రామదాసు మేనమామలైన అక్కన్న, మాదన్నల కాలంలో దీనిని కట్టించారు.
[మార్చు] స్థల గాధ
ఒకప్పుడు శ్రీనివాసుని భక్తుడొకాయన ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళి ఏడుకొండల స్వామిని దర్శించుకొనేవాడు. ఒకమారు అనారోగ్యకారణంగా ఆయన తిరుపతి యాత్ర చేయలేకపోయాడు. ఆయనకు కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి, "చింతించ వద్దు. నీ సమీపంలోని అడవిలోనే నేనున్నాను" అని సెలవిచ్చాడు. కలలో కనిపించిన స్థలానికి వెళ్ళి, ఆ భక్తుడు అక్కడి పుట్టను త్రవ్వుతుండగా పలుగుకు రాతి విగ్రహం తగిలి రక్తం కారసాగింది. అపచారానికి దుఃఖిస్తున్న భక్తునికి "పాలతో కడగ"మని వాణి వినిపించింది. అలా చేయగా పుట్టనుండి శ్రీదేవీభూదేవీ సమేతుడైన శ్రీవేంకటేశ్వరుని విగ్రహం బయల్పడింది. (ఇలా మూడు మూర్తులు ఒకే విగ్రహంలో ఉండడం అరుదు). ఆ విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్టించి, మందిరాన్ని నిర్మించారు.
ఇలా స్వయంభూమూర్తిగా ఉభయ నాంచారులతో వెలసిన శ్రీవేంకటేశ్వరుని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అర్చిస్తారు.
1963లో రాజ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్టించారు. అమ్మవారు మూడు చేతులలో పద్మాలు ధరించి ఉంటారు. నాలుగవ చేయి భక్తులను శరణాగతులను కమ్మని చూపుతూ ఉంటుంది.
ఆనేక మంది భక్తులు ఇక్కడికి మొక్కులు కొరుకొవడానికి మరియు తీర్చుకోవడానికి వస్తారు.
ప్రధాన ఆలయం ప్రక్కనే శివాలయం ఉన్నది. శివలింగం ఒక చెట్టు క్రింద ఉంటుంది.
[మార్చు] విశేషాలు
- ఈ ఆలయం లో హుండి లేదు. దేవాలయాల నిర్వహణను వ్యాపారీకరించడాన్ని ఈ ఆలయం అర్చకులు దృఢంగా వ్యతిరేకిస్తున్నారు.
- ఇక్కడ దర్శనానికి ధనిక, పేద, అధికార తారతమ్యాలు లేవు. అందరూ ఒకే వరుసలో వేచి ఉండి భగవంతుని దర్శించుకోవాలి.
- ఇక్కడ ప్రదక్షిణలు చేయడం ఒక ముఖ్య ఆచారం. భక్తులు మొదటిసారి వచ్చినప్పుడు పదకొండు సార్లు ప్రదక్షినలు చేస్తారు. తమ కొరికలు తీరిన తరువాత ఇంకోసారి వచ్చి 108 సార్లు ప్రదక్షినలు చేసి, తమ మొక్కు తీర్చుకొంటారు.
- దేవుని విగ్రహాన్ని కనులు మూసుకొకుండా చూడాలి. అని చెబుతారు.
- ఇక్కడ మొక్కుకుంటే వీసా తొందరగా వస్తుందని చాలామంది నమ్మకం. అందుకే ఇక్కడి బాలాజిని వీసా బాలాజి అని పిలుస్తారు. అంతే కాదు తెలంగాణ బాలాజి అని కూడా పిలుస్తారు.
- దేవాలయం అర్చకులు "వాక్" అనే ధార్మిక మాసపత్రికను ప్రచురిస్తున్నారు.