తిరుపతి
వికీపీడియా నుండి
తిరుపతి మండలం | |
![]() |
|
జిల్లా: | చిత్తూరు |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | తిరుపతి |
గ్రామాలు: | 3 |
జనాభా (2001 లెక్కలు) | |
---|---|
మొత్తము: | 309.435 వేలు |
పురుషులు: | 158.717 వేలు |
స్త్రీలు: | 150.718 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 82.19 % |
పురుషులు: | 89.54 % |
స్త్రీలు: | 74.46 % |
చూడండి: చిత్తూరు జిల్లా మండలాలు |
తిరుపతి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఒక పట్టణం, అదే జిల్లాకు చెందిన ఒక మండలం.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ప్రాచీనతకు చాలా సాహిత్యపరమైన ఆధారాలు, శాసనాధారాలు ఉన్నాయి.
విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు తిరుపతి వేంకటేశ్వరస్వామిని చాలా మార్లు దర్శించుకొని కానుకలు సమర్పించాడు. 9వ శతాబ్దంలో కాంచీపురాన్ని పరిపాలించిన పల్లవులు, ఆ తరువాతి శతాబ్దపు తంజావూరు చోళులు, మదురైని పరిపాలించిన పాండ్యులు, విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు, సామంతులు ఈ వేంకటేశ్వరస్వామి భక్తులై కొలిచారు. ఒకరిని మించి మరొకరు పోటీపడి ఆలయనిర్వహణకు, సేవలకు దానధర్మాలు చేశారు.
విజయనగర సామ్రాజ్య పరిపాలనలో ఆలయానికి చాలా సంపద చేకూరింది. శ్రీ కృష్ణదేవరాయలు తన ఇద్దరు భార్యల విగ్రహాలను, తన విగ్రహాన్ని, ఆలయ మండపం పై ప్రతిష్టింపజేశాడు. ప్రధాన ఆలయంలో వేంకటపతి రాయల విగ్రహం కూడా ఉంది.
విజయనగర సామ్రాజ్య పతనం తరువాత, దేశం నలుమూలల ఉన్న చాలామంది చిన్న నాయకులు, ధనవంతులు దేవాలయాన్ని పోషించి కానుకలు బహూకరించడం కొనసాగించారు. మరాఠీ సేనాని, రాఘోజీ భోంస్లే ఆలయాన్ని సందర్శించి గుడిలో నిత్య పూజా నిర్వహణకై శాశ్వత దాన పథకాన్ని స్థాపించాడు. ఈయన వేంకటేశ్వర స్వామికి ఒక పెద్ద మరకతాన్ని, విలువైన వజ్రవైఢూర్యాలను బహూకరించాడు. ఆ మరకతం ఇప్పటికీ రాఘోజీ పేరుతో ఉన్న ఒక పెట్టెలో భద్రంగా ఉంది. ఆ తరువాతి కాలంలో పెద్ద పెద్ద దానాలు చేసిన వారిలో మైసూరు మరియు గద్వాల పాలకులు చెప్పుకోదగినవారు.
హిందూ సామ్రాజ్యాల తరువాత, పాలన కర్ణాటక ముస్లిం పాలకుల చేతిలోకి, ఆ తరువాత బ్రిటీషు వారికి వెళ్లింది. తిరుపతి గుడి కూడా వారి పర్యవేక్షణ కిందికి వచ్చింది.
1843 లో ఈస్టిండియా కంపెనీ క్రైస్తవేతర, స్థానికుల ప్రార్ధనా స్థలాల యాజమాన్యాన్ని విడిచిపెట్టింది. వేంకటేశ్వరస్వామి ఆలయం, జాగీర్ల నిర్వహణ తిరుమలలోని హాథీరాంజీ మఠానికి చెందిన సేవదాస్‌జీకి అప్పగించారు. 1933 వరకు ఒక శతాబ్దం పాటు ఆలయ నిర్వహణ మహంతుల చేతిలో ఉంది.
1933 లో, మద్రాసు శాసన సభ ఆలయనిర్వహణ, నియంత్రణ బాధ్యతలను "తిరుమల తిరుపతి దేవస్థానములు" (టి.టి.డి) అనే సంస్థకి అప్పగిస్తూ ఒక ప్రత్యేక చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ సంస్థ అధ్యక్షుడిని మద్రాసు ప్రభుత్వం నియమించేది. 1951లో ఈ చట్టాన్ని మార్చి టి.టి.డి నిర్వహణను ఒక ధర్మకర్తల సంఘానికి అప్పగించి, నిర్వహణాధికారిని ప్రభుత్వం నియమించేలా ఇంకొక చట్టం చేసింది.
[మార్చు] ముఖ్యమైన ప్రదేశాలు
- శ్రీ వెంకటెశ్వర విశ్వవిద్యాలయం
- కపిలతీర్థం
- తిరుచానూరు
- గొవిందరాజ స్వామి ఆలయం
- శ్రీనివసమంగపురం
- జూ పార్క్
[మార్చు] మండలంలోని పట్టణాలు
- తిరుమల (ct)
- తిరుపతి (nma) (ct)
- అక్కరంపల్లె (ct)
- తిరుపతి (m+og) (part)
- తిరుపతి (m)
[మార్చు] మండలంలోని గ్రామాలు
[మార్చు] బయటి లింకులు
[మార్చు] చిత్తూరు జిల్లా మండలాలు
పెద్దమండ్యం | తంబళ్లపల్లె | ములకలచెరువు | పెద్దతిప్ప సముద్రం | బీ.కొత్తకోట | కురబలకోట | గుర్రంకొండ | కలకడ | కంభంవారిపల్లె | యెర్రావారిపాలెం | తిరుపతి పట్టణం | రేణిగుంట | యేర్పేడు | శ్రీకాళహస్తి | తొట్టంబేడు | బుచ్చినాయుడు ఖండ్రిగ | వరదయ్యపాలెం | సత్యవీడు | నాగలాపురం | పిచ్చాటూరు | విజయపురం | నింద్ర | కె.వీ.పీ.పురం | నారాయణవనం | వడమలపేట | తిరుపతి గ్రామీణ | రామచంద్రాపురం | చంద్రగిరి | చిన్నగొట్టిగల్లు | రొంపిచెర్ల | పీలేరు | కలికిరి | వాయల్పాడు | నిమ్మన్నపల్లె | మదనపల్లె | రామసముద్రం | పుంగనూరు | చౌడేపల్లె | సోమల | సోదం | పులిచెర్ల | పాకాల | వెదురుకుప్పం | పుత్తూరు | నగరి | కార్వేటినగర్ | శ్రీరంగరాజపురం | పాలసముద్రం | గంగాధర నెల్లూరు | పెనుమూరు | పూతలపట్టు | ఐరాల | తవనంపల్లె | చిత్తూరు | గుడిపాల | యడమరి | బంగారుపాలెం | పలమనేరు | గంగవరం | పెద్దపంజని | బైరెడ్డిపల్లె | వెంకటగిరి కోట | రామకుప్పం | శాంతిపురం | గుడుపల్లె | కుప్పం
తిరుపతి (1974) | |
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
---|---|
తారాగణం | రాజబాబు |
నిర్మాణ సంస్థ | శ్రీ సారధీ & చలం కంబైన్స్ |
భాష | తెలుగు |