బ్రహ్మానందం
వికీపీడియా నుండి
బ్రహ్మానందం ప్రముఖ తెలుగు హాస్య నటుడు. ఈయన పూర్తి పేరు కన్నెగంటి బ్రహ్మానందం. తండ్రి తండ్రి కన్నెగంటి నాగలింగాచారి మరియు తల్లి పేరు కన్నెగంటి లక్ష్మీనరసమ్మ. అరగుండుగా, ఖాన్ దాదాగా, కత్తి రాందాసుగా, శంకర్‌దాదా ఆర్.ఎమ్.పి.గా... వెవిద్యమైన పాత్రల పేర్లతో పేరుగాంచిన నటుడు.
విషయ సూచిక |
[మార్చు] బాల్యం
తెలుగు సినిమా |
||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
బ్రహ్మానందం ఫి బవరి 1, 1956 సంవత్సరంలో గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా ముప్పాళ్ల గ్రామంలో జన్మించారు. తను పుట్టగానే తలికి గుర్రపువాతం వచ్చి అందరి దృష్టిలో అపరాధిలా నిలిచాడు. అప్పటికే ఆరుగురు పిలలకి జన్మనిచ్చిన తల్లి ఇతని ప్రసవంతో చనిపోతుందని భావించారు. కానీ అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలు నిలిచాయి. తల్లి ప్రాణాలు దక్కినా బ్రహ్మానందం అనే పసవాడిపై మాత్రం అందరిదీ శీతకన్నే.
[మార్చు] చదువు
సత్తెనపల్లి శరభయ్య హైస్కూలులో విద్యార్థిగా చేరి పాఠాలు నేర్చారు. తండ్రి కన్నెగంటి నాగలింగాచారి సన్నిహతులెన సున్నం ఆంజనయులు ప్రోద్బలంతో భీమివరం డి.ఎన్.ఆర్. కాలేజీలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసారు. గుంటూరు పీజీ సెంటర్లో తెలుగు సాహిత్యంలో ఎమ్మే పట్టా పుచ్చుకొన్నారు. బ్రహ్మానందం అత్తిలిలో తొమ్మిది సంవత్సరాలు లెక్చరర్‌గా పనిచేశాక సినీరంగంలోకి అడుగుపెట్టారు.
[మార్చు] సినీరంగ ప్రవేశం
ఇప్పట్లోలా ఇలా వెళ్లి అలా సినిమాలు చూసే అవకాశం ఆయనకు ఉండేది కాదు. ఉమ్మడి కుటుంబంలో మధ్యతరగతి జీవితాన్ని సాగి స్తున్న ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలతో పాటూ జనాభా కూడా ఎక్కువే! అమ్మ అప్పుడప్పుడూ ఇరుగు పొరుగుల్ని అనుకరిస్తూ మాట్లాడే హాస్యోక్తులే రిక్రియేషన్! తండ్రి రంగస్థల నటుడే అయినా సీరియస్ ప్రొఫెషనమీ కాదు. తలిదండ్రులకున్న కొద్దో గొప్పో కళాభిరుచి తనకీ అబ్బిందమోనని బ్రహ్మానందం భావిస్తారు. బాల్యంలో మారాం చేయకుండా బడికి బుద్దిగానే వెళినా, ఎస్.ఎస్.ఎల్.సి. లో గట్టిగానే పాసైనా చిన్న తప్పులు చేసనా తండ్రి నుంచి బుద్దితక్కువ వాడంటూ చివాట్లు తప్పేవి కావు. అయితే తెలివితక్కువ వాడని మాత్రం ఆయన ఎన్నడూ అనలేదంటారు. చదువుతున్నప్పుడే స్వర అనుకరణలు(మిమి క్రీ) చేయడం, సాంస్కృతిక బృందాలలో (కల్చరల్ ఆర్గనైజషన్) చురుకుగా పాల్గొనడం ఈయన కు అలవడింది. అత్తిలిలో లెక్చరర్‌గా ఉంటూనే పలు నిజజీవితంలోని వ్యక్తులను అనుకరిస్తూ చేస్తూ అందరి ప్రశంసలూ పొందిన బ్రహ్మానందం 1985లో దూరదర్శన్‌లో వచ్చిన 'పకపకలు' కార్యక్రమాన్ని సమర్ధంగా నిర్వహించగా మంచి స్పందన వచ్చింది. దూరదర్శన్ తప్ప ఇతర ఛానెళ్ళేవీ లేని ఆ రోజుల్లో ఎక్కడి కళిన్ల్లా అందరూ బ్రహ్మానందాన్ని ఇట్టే గుర్తు పట్టే సవాళ్ళు.
[మార్చు] తొలి సినిమా
బ్రహ్మానందంను మొట్టమొదటి సారిగా మూవీ కెమెరా ముందు మేకప్ వేసి నిలబెట్టినవారు దర్శకులు శ్రీ వేజళ్ల సత్యనారాయణ గారు. నరేశ్ హీరోగా నటించిన 'శ్రీ తాతావతారం' అనే చిత్రంలో హీరో నలుగురు స్నేహితు లలో ఒకడగా నటించారు. విశేషంఏమిటంటే తన పుట్టినరోజు ఫిబ్రవరి ఒకటనాడే ఆ సినిమాలో తొలి వేషం వేశాను. 1985లో హైదరాబాద్ వెస్లీ కాలేజ్‌లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు హీరో నరేశ్‌తో తీసిన తొలి షాట్ బ్రహ్మానందం నటజీవితానికి శ్రీకారం చుట్టింది. ఈ చిత్రంతో నటించడం ప్రారంభించినా తొలిసారి విడుదలన చిత్రం మాత్రం జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన "సత్యాగ్రహం".
[మార్చు] పేరు తెచ్చిన పాత్ర
"...పాడె మీద పైసలు ఏరుకొనే పింజారి వెదవా... పోతావ్‌రా రేయ్... నాశనమై పోతావ్..." అంటూ యజమాని పీనాసతనాన్ని బాహాటంగా కక్కలేక తనలోనే అగ్గిబుగ్గైపోతూ ఆక్రోశాన్ని దిగమింగుకొనే "అహా నా పెళ్లంట" లోని అరగుండు పాత్రతో తెలుగు ప్రేక్షకుల దృష్టి అతనిపై పడింది. "అరగుండు వెధవా" అని కోట తో తిట్టించుకొన్న ఆ అరగుండు పాత్రే బ్రహ్మానందం తన హాస్యనట విశ్వరూపాన్ని ప్రదర్శించలా చేసింది. జంధ్యాలగారు "చంటబ్బాయ్" సినిమా సమయంలో చిరంజీవి గారికి పరిచయం చేయడం, తర్వాత "పసివాడిప్రాణం" లో ఓ చిన్న పాత్ర వేయడం. ఇలా నలుగుతున్న రోజుల్లో ఆయన ఇచ్చిన అవకాశం "అహ నా పెళంట" లో అరగుండు పాత్ర. ఈ పాత్రతో బ్రహ్మానందం నటజీవితాన్ని మలుపు తిప్పేలా చేసన దర్శకులు జంధ్యాలగారిని, అలాగే ఆ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చి న ఆ చిత్ర నిర్మాత డాకర్ రామానాయుడు గారినీ, ఆ రోజుల్లో అన్ని విధాలా ప్రోత్సహంచిన చిరంజీవిగారినీ ఎప్పటికీ మరువలేను అంటారు . ఈ చిత్రంలో వేసన పాత్ర ఆనాటి నుంచీ బ్రహ్మానందం నట జీవితంలో యేడాదికి 35 చిత్రాలకు తగ్గకుండా నటించేందుకు పాదులు తీయడం గమనార్హం.
[మార్చు] అవారులూ సత్కారాలూ
- నటుడిగా బ్రేక్‌నిచ్చిన 'అహ నా పెళ్లంట' చిత్రమే 1987లో ఈయనకి తొలి నంది అవారును కూడా సాధించిపెట్టింది. మనీ, అనగనగా ఒకరోజు, అన్న, వినోదం చిత్రాలకు సైతం నంది అవారుల్ని పొందారు.
- ఐదు కళాసాగర్ అవార్డులు
- తొమ్మిది వంశీ బర్కిలీ అవార్డులు
- పది సినీగోయర్స్ అవార్డులు
- ఎనిమిది భరతముని అవారుల్నీ అవార్డులు
- ఒక్క ఫలిమ్ ఫేర్ అవార్డు.
- రాజీవ్‌గాంధీ సద్భావనా పురస్కారం
- ఆటా (అమెరికా), సింగపూర్, లండన్ డాకర్స్, అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్స్ వారి సత్కారాలు, షోలాపూర్, ఢల్లీ తెలుగు అకాడమీల్నించి సన్మానాలు అందుకున్నారు
- విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం వారు స్వర్ణ గండపెండరాన్ని తొడిగి సత్కరించారు
- సాంస్కృతిక సంస్థ స్వరకరీటాన్ని బహూకరించింది
- మాచర్ల సంఘం వారు వెండి కిరీటాన్ని బహూకరించారు
- పద్మవూహన సంస్థ బంగారు పతకాన్ని బహూకరించింది
- సత్తెనపల్లి ఫ్రెండ్స్ కబ్‌వారు స్వరహస్తకంకణాన్ని బహూకరించారు.
- అచార్య నాగార్జున యూనివర్సిటీ నుండి డాక్టరేటు ను అందుకున్నారు
- విఖ్యాత కమెడయన్లు రేలంగి, రాజబాబు, చలం, రాజబాబు, అల్లు, సుత్తి వీరభద్రరావు పేరిట నెలకొల్పిన పురస్కారాలన్నీ బ్రహ్మానందం కెవసం చేసుకోవడం అరుదన ఘటన!
[మార్చు] ఇతర విశేషాలు
- 'రేలంగి తన ప్యాంటూ షర్టూ మార్చుకొని బ్రహ్మానందం రూపంలో మళ్లీ తెరమీదికొ చ్చాడ' ని కితాబులందు కొన్న నటుడు బ్రహ్మానందం
- రెండు దశాబ్దాలుగా తన హాస్యనటనతో ఎన్నో మైలురాళన్లి అధిగమించి దాదాపు 654 చిత్రాల్లో నటించిన ఘనత వహించారు.
- తక్కువ వ్యవదిలో అత్యదిక చిత్రాల్లో నటించిన ఆర్టిసుగా ఆయన తిరుగులేని రికార్డు నెలకొల్పడం విశేషం.