మా తెలుగు తల్లికి మల్లె పూదండ
వికీపీడియా నుండి
[మార్చు] మా తెలుగు తల్లికి మల్లె పూదండ
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ గీతాన్ని రాష్ట్ర గీతం గా అధికారికం గా స్వీకరించింది.
రచన: శంకరంబాడి సుందరాచారి
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కను చూపులో కరుణ
చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి
-
-
- గల గలా గోదారి కదలి పోతుంటేను
- బిర బిరా కృష్ణమ్మ పరులిడుతుంటేను
- బంగారు పంటలే పండుతాయి
- మురిపాల ముత్యాలు దొరలు తాయి
- గల గలా గోదారి కదలి పోతుంటేను
-
అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక
-
-
- రుద్రమ్మ భుజ శక్తి
- మల్లమ్మ పతిభక్తి
- తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
- మా చెవుల రింగుమని మరు మ్రోగే దాక
- రుద్రమ్మ భుజ శక్తి
-
నీ ఆటలే ఆడుతాం
నీ పాటలే పాడుతాం
జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!
[మార్చు] బయటి లింకులు
- మా తెలుగు తల్లికి మల్లె పూదండ..రూపాంతరము ఒక చిన్న ప్రయత్నము
- ఇక్కడ వినండి...http://www.oldtelugusongs.com/search2/index.html
వెతికే పెట్టెలో ఇలా టైపు చేయండి... mA tenugu talliki ఆస్వాదించండి!