మేడేపల్లి (ముదిగొండ)
వికీపీడియా నుండి
మేడేపల్లి అనేది ఖమ్మం జిల్లా లోని ముదిగొండ మండలంలోని ఒక గ్రామము. ఇది ఆ మండలంలోకెల్లా పెద్దఊరు. ముదిగొండ నుండి 3 కి.మీ. మరియు ఖమ్మం నుండి 14 కి.మీ. దూరంలోనూ ఉంది. వ్యవసాయం ఈ గ్రామప్రజల ముఖ్య జీవనాధారం. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఈ గ్రామానికి ప్రధాన నీటివనరు.
ఈ గ్రామ ప్రస్తుత సర్పంచ్ సామినేని హరి ప్రసాద్.