మోక్షగుండం
వికీపీడియా నుండి
మోక్షగుండం ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలములోని ఒక చిన్న శ్రోత్రీయ గ్రామము. స్థానిక పంచాంగములు లెక్కలు కట్టే గ్రామమునకు చెందిన జ్యోతిష్యులు ఈ ప్రదేశములో పేరుపొందినారు. గ్రామమునకు తూర్పున ఒక చిన్న కొండపై ముక్తేశ్వరము అను శివాలయము ఉన్నది. ప్రతి యేటా మాఘ మాసములో(ఫిబ్రవరి) జరిగే ముక్తేశ్వర స్వామి జాతరకు అనేక మంది భక్తులు చుట్టుపక్కల ప్రదేశముల నుండి విచ్చేయుదురు. ఈ గుడి దగ్గర ఉన్న పవిత్ర గుండములో స్నానము చేసిన వారికి మోక్షము కలుగునని స్థానికులు భావిస్తారు. అందుకే ఈ ఊరికి మోక్షగుండమని పేరు వచ్చెను.
భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య యొక్క పూర్వీకులు ఈ గ్రామము నుండే కన్నడ దేశానికి వలస వెళ్లారు.