ప్రకాశం
వికీపీడియా నుండి
ప్రకాశం జిల్లా | |
---|---|
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ప్రాంతము: | కోస్తా |
ముఖ్య పట్టణము: | ఒంగోలు |
విస్తీర్ణము: | 17,626 చ.కి.మీ |
జనాభా (2001 లెక్కలు) | |
మొత్తము: | 30.55 లక్షలు |
పురుషులు: | 15.50 లక్షలు |
స్త్రీలు: | 15.05 లక్షలు |
పట్టణ: | 4.66 లక్షలు |
గ్రామీణ: | 25.88 లక్షలు |
జనసాంద్రత: | 173 / చ.కి.మీ |
జనాభా వృద్ధి: | 10.72 % (1991-2001) |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 57.86 % |
పురుషులు: | 69.78 % |
స్త్రీలు: | 45.6 % |
చూడండి: ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు |
ప్రకాశం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము యెక్క తొమ్మిది కోస్తా ప్రాంతపు జిల్లాలో ఒకటి. ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణము ఒంగోలు. ఒంగోలు జిల్లా, ఫిబ్రవరి 2,1970వ తేదీన, నెల్లూరు, కర్నూలు మరియు గుంటూరు జిల్లాల యొక్క కొంత భాగముల నుండి ఆవిర్భవించినది. తరువాత డిసెంబర్ 5,1972వ తేదీన, జిల్లాలోని కనుపర్తి గ్రామములో పుట్టిన గొప్ప దేశభక్తుడు మరియు ఆంధ్ర నాయకుడైన, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జ్ఞాపకార్ధము ప్రకాశం జిల్లాగా నామకరణము చేయబడినది. ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా యొక్క మూడు తాలూకాలు (అద్దంకి, చీరాల మరియు ఒంగోలు), నెల్లూరు జిల్లా యొక్క నాలుగు తాలూకాలు (కందుకూరు, కనిగిరి, పొదిలి మరియు దర్శి) మరియు కర్నూలు జిల్లా యొక్క రెండు తాలూకాలతో (మార్కాపురం మరియు గిద్దలూరు) ఏర్పడినది.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
[మార్చు] భౌగోళికము
ప్రకాశం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రపు దక్షిణ కోస్తాలో సుమారు 150.90 మరియు 160 డిగ్రీల ఉతర అక్షాంశాలు 79 మరియు 80 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య నెలకొని ఉన్నది. ఉత్తరాన మహబూబ్ నగర్ మరియు గుంటూరు జిల్లాలు, పశ్చిమాన కర్నూలు జిల్లా, దక్షిణాన కడప, నెల్లూరు జిల్లాలు, తూర్పున బంగాళా ఖాతము సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లాలోని మధ్య ప్రాంతం చిన్న చిన్న పొదలతో, కొండలతో, రాతి నేలలతో కూడి జిల్లాకు ఒక ప్రత్యేకతను ఆపాదిస్తున్నాయి.
[మార్చు] కొండలు
నల్లమల, వెలుగొండలు జిల్లాలోని ముఖ్యమైన కొండలు. నల్లమల కొండలు ఇదివరకటి గిద్దలూరు, మార్కాపురం తాలూకాలలో వ్యాపించి ఉండగా, వెలుగొండ కర్నూలు, కడప జిల్లాల సరిహద్దులలో ఉన్నాయి. నల్లమలలో నంది కనుమ, మాబాల కనుమ అనే రెండు ముఖ్యమైన కనుమలు ఉన్నాయి. నంది కనుమ పశ్చిమాన గల కర్నూలు,బళ్ళారి జిల్లాలకు, తూర్పున కోస్తా జిల్లాలకు ప్రధాన మార్గం కాగా, మాబాల కనుమ పశ్చిమాన ఆత్మకూరు, కర్నూలు ను తూర్పున దోర్నాల, యర్రగొండపాలెం, మార్కాపురం లను కలుపుతుంది.
[మార్చు] నదులు
గుండ్లకమ్మ, పాలేరు, మూసీ, మున్నేరు, సగిలేరు లు జిల్లాలో ప్రవహించే ముఖ్యమైన నదులు. వీటిలో 220 కి మీలు ప్రవహించే గుండ్లకమ్మ నది జిల్లా యొక్క తాగునీటి, సాగునీటి అవసరాలకు తల్లి వంటిది. తమ్మిలేరు, ఈగిలేరు, గుడిశలేరు అనే చిన్న నదులు, వాగేరు వాగు, నల్లవాగు, యేడి మంగల వాగు వంటి వాగులు కూడా జిల్లలో ప్రవహిస్తున్నాయి.
[మార్చు] వాతావరణం, వర్షపాతం
జిల్లా లోని కొస్తా ప్రాంతాల్లో సముద్రపు గాలి వలన అన్నికాలాల్లోను ఒకే రకంగా ఉంటుంది. ఇతర ప్రాంతాల్లో, ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో వేసవి కాలం చాలా తీవ్రంగా ఉంటుంది. జూన్- సెప్టెంబరు లో నైరుతి ఋతుపవనాలు, అక్టోబరు - డిసెంబరు లో ఈశాన్య ఋతుపవనాల వలన వర్షాలు కురుస్తాయి.
[మార్చు] నేలలు
ఎర్ర, నల్ల రేగడి, ఇసుక నేలలు క్రమంగా 51% 41% 6% వరకు జిల్లలో ఉన్నాయి.
[మార్చు] వృక్ష సంపద
జిల్లా విస్తీర్ణంలో 25.11% అడవులు ఉన్నాయి. కోస్తా ప్రాంతంలో చీరాల, వేటపాలెం, చిన్నగంజాం, కొత్తపట్నం, సింగరాయకొండ, ఉలవపాడు లలోజీడి మొదలైన చెట్లతో కూడిన అడవులు ఉన్నయి.
[మార్చు] పరిశ్రమలు
ప్రకాశం జిల్లాలో పరిశ్రమలకు అనుకూలమైన ప్రకృతి వనరులు పుష్కలంగా ఉన్నాయి. ప్రపంచంలోనే అతి శ్రేష్ఠమైన గాలక్సీ గ్రానైటు జిల్లాలో దొరుకుతుంది. ఎన్నో గ్రానైటు గనులు సంబంధిత పరిశ్రమలు జిల్లాలో వెలిసాయి. దేశానికి అవసరమైన రాతి పలకలో 80% మార్కాపురం నుండే వస్తుంది. సముద్ర తీరం పొడుగునా 5000 ఎకరాల విస్తీర్ణంలో ఉప్పును పండిస్తారు.
[మార్చు] వ్యవసాయం
వర్జీనియా పొగాకు ఉత్పత్తిలో జిల్లా ప్రసిద్ధి చెందింది. వరి, జొన్న, రాగి, మొక్కజొన్న, కొర్రలు, పప్పు ధాన్యాలు, మిరప, పత్తి, వేరుశనగ, ఆముదం ఇక్కడ పండే ఇతర పంటలు. జిల్లాలోని 102 కి మీల సముద్ర తీరంలో సముద్ర ఉత్పత్తులు విరివిగా అవకాశాలున్నాయి.
[మార్చు] జిల్లా గణాంకాలు
- రెవిన్యూ డివిజన్లు (3): కందుకూరు, ఒంగోలు, మార్కాపురం.
- నదులు: గుండ్లకమ్మ, పాలేరు, మూసీ, మున్నేరు, సగిలేరు.
- ముఖ్య పంటలు : వరి, వరిగలు, మొక్కజొన్న, పెసర, మినుము, పసుపు, పొగాకు, వేరుశనగ, మిర్చి, ప్రత్తి.
- ముఖ్య ఖనిజాలు : పలక రాయి, గ్రానైటు, రాగి.
- ముఖ్య పరిశ్రమలు : ప్రత్తి, పొగాకు, తోలు, పలకలు , బిల్డింగు రాళ్లు, జీడీపప్పు.
- ముఖ్య పత్తన్నములు : ఒంగోలు, చీరాల, మార్కాపురం, అద్దంకి, గిద్దలూరు, కందుకూరు.
- లోక్సభ నియోజకవర్గములు (1): ఒంగోలు
- శాసనసభ నియోజకవర్గములు (13): ఒంగోలు, సంతనూతలపాడు, కందుకూరు, కనిగిరి, కొండపి, అద్దంకి, కంభం, మార్టూరు, మార్కాపురం, దర్శి, చీరాల, గిద్దలూరు, పర్చూరు.
- పర్యాటక కేంద్రాలు: చీరాల (షిప్ యార్డు), టంగుటూరు, మార్కాపురం, శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయము, సింగరాయకొండ వరాహ నరసింహస్వామి దేవాలయము.
[మార్చు] మండలాలు
భౌగోళికంగా ప్రకాశం జిల్లాను 56 రెవిన్యూ మండలములుగా విభజించినారు.
4.కురిచేడు 5.దొనకొండ 7.దోర్నాల 8.అర్ధవీడు 10.తర్లపాడు 11.కొంకణమిట్ల 12.పొదిలి 13.దర్శి 14.ముండ్లమూరు 15.తాళ్ళూరు 16.అద్దంకి 17.బల్లికురవ 18.సంతమాగులూరు 19.యద్దనపూడి |
20.మార్టూరు 21.పర్చూరు 22.కారంచేడు 23.చీరాల 24.వేటపాలెం 25.ఇంకొల్లు 26.జే.పంగులూరు 27.కొరిసపాడు 28.మద్దిపాడు 29.చీమకుర్తి 30.మర్రిపూడి 31.కనిగిరి 33.బెస్తవారిపేట 34.కంభం 35.రాచర్ల 36.గిద్దలూరు 37.కొమరోలు |
39.వెలిగండ్ల 41.పొన్నలూరు 42.కొండపి 43.సంతనూతలపాడు 44.ఒంగోలు 46.చినగంజాము 47.కొత్తపట్నం 48.టంగుటూరు 49.జరుగుమిల్లి 50.కందుకూరు 52.పామూరు 53.లింగసముద్రము 54.గుడ్లూరు 55.ఉలవపాడు 56.సింగరాయకొండ |
ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు | ![]() |
---|---|
అనంతపురం | అదిలాబాదు | కడప | కరీంనగర్ | కర్నూలు | కృష్ణ | ఖమ్మం | గుంటూరు | చిత్తూరు | తూర్పు గోదావరి | నల్గొండ | నిజామాబాదు | నెల్లూరు | పశ్చిమ గోదావరి | ప్రకాశం | మహబూబ్ నగర్ | మెదక్ | రంగారెడ్డి | వరంగల్ | విజయనగరం | విశాఖపట్నం | శ్రీకాకుళం | హైదరాబాదు |