రాజస్థాన్
వికీపీడియా నుండి
రాజస్థాన్ | |
రాజధాని - Coordinates |
జైపూర్ - |
పెద్ద నగరము | జైపూర్ |
జనాభా (2001) - జనసాంద్రత |
56,473,122 (8వ స్థానం) - 165/చ.కి.మీ |
విస్తీర్ణము - జిల్లాలు |
342,236 చ.కి.మీ (1వ స్థానం) - 32 |
సమయ ప్రాంతం | IST (UTC +5:30) |
అవతరణ - గవర్నరు - ముఖ్యమంత్రి - చట్టసభలు (సీట్లు) |
1956-11-01 - ప్రతిభా పాటిల్ - వసుంధరా రాజె - ఒకే సభ (200) |
అధికార బాష (లు) | హిందీ, రాజస్థానీ గుజరాతీకూడా మాట్లాడుతారు |
పొడిపదం (ISO) | IN-RJ |
వెబ్‌సైటు: www.rajasthan.gov.in |
రాజస్థాన్ (Rajasthan) (राजस्थान) భారత దేశంలో వైశాల్యం ప్రకారం అతి పెద్ద రాష్ట్రం. రాజస్థాన్ కు పశ్చిమాన పాకిస్తాన్ దేశం ఉన్నది. ఇంకా నైఋతిన గుజరాత్, ఆగ్నేయాన మధ్య ప్రదేశ్, ఈశాన్యాన ఉత్తరప్రదేశ్, హర్యానా మరియు ఉత్తరాన పంజాబు రాష్ట్రాలు రాజస్థాన్ కు హద్దులు. మొత్తం రాజస్థాన్ వైశాల్యం 3లక్షల 42వేల చదరపు కి.మీ. (1,32,139 చదరపు మైళ్ళు)
రాజస్థాన్ రాష్ట్రంలో ప్రధానమైన భౌగోళిక అంశము థార్ ఎడారి. ఆరావళీ పర్వత శ్రేణులు రాజస్థాన్ భూభాగాన్ని మధ్యగా విడగొడుతున్నాయి. ఈ పర్వతాలు ఋతుపవనాలను అడ్డుకోవడం వల్ల పశ్చిమ ప్రాతంలో వర్షపాతం దాదాపు శూన్యం. అందువల్ల అది ఎడారిగా మారింది. మరొప్రక్క దట్టమైన అడవులతో గూడిన రణథంబోర్ నేషనల్ పార్క్ (పులులకు సంరక్షణాటవి), ఘనా పక్షి ఆశ్రయము, భరత్ పూర్ పక్షి ఆశ్రయము ఉన్నాయి.
రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరం.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
రాజపుత్రులచే పాలింపబడినది గనుక రాజస్థాన్ "రాజపుటానా" రాష్ట్రంగా వ్యవహరించేవారు. రాజస్థాన్ చరిత్రలో ఎక్కువకాలం యుద్ధప్రియులైన చిన్న చిన్న రాజపుత్ర వంశపు రాజుల పాలనలో సాగింది. ఈ ప్రాంతాన్ని బయటివారెవరూ పూర్తిగా ఆక్రమించలేకపోయారు. అయితే వేరు వేరు ఒడంబడికలద్వారా బ్రిటిష్ పాలకులు మాత్రం పెత్తనం చలాయించారు.
ఈ విధమైన చరిత్ర వల్ల రాజస్థాన్ లో చాలా చారిత్రిక నిర్మాణాలు, కోటలు, సంస్కృతి విలక్షణంగా నిలబడ్డాయి. అందువల్లనే అక్కడ అభివృద్ధి కొరవడిందనీ, సమాజంలో అసమానతలు ప్రబలి ఉన్నాయనీ, స్త్రీలు బాగా వెనుకబడ్డారనీ కొదరి వాదన.
[మార్చు] జిల్లాలు
రాజస్థాన్ లో 32 జిల్లాలు ఉన్నాయి.
రాష్ట్రము. | కోడ్ | జిల్లా | ముఖ్య పట్టణము | జనాభా (2001) | విస్తీర్ణము (కి.మీ.²) | జన సాంద్రత (/కి.మీ.²) |
---|---|---|---|---|---|---|
RJ | AJ | అజ్మీర్ | అజ్మీర్ | 2180526 | 8481 | 257 |
RJ | AL | ఆల్వార్ | ఆల్వార్ | 2990862 | 8380 | 357 |
RJ | BI | బికనీర్ | బికనీర్ | 1673562 | 27244 | 61 |
RJ | BM | బార్మర్ | బార్మర్ | 1963758 | 28387 | 69 |
RJ | BN | బన్‌స్వార | బన్‌స్వార | 1500420 | 5037 | 298 |
RJ | BP | భరత్‌పూర్ | భరత్‌పూర్ | 2098323 | 5066 | 414 |
RJ | BR | బరన్ | బరన్ | 1022568 | 6955 | 147 |
RJ | BU | బుంది | బుంది | 961269 | 5550 | 173 |
RJ | BW | భిల్వార | భిల్వార | 2009516 | 10455 | 192 |
RJ | CR | చురు | చురు | 1922908 | 16830 | 114 |
RJ | CT | చిత్తొర్‌గర్ | చిత్తొర్‌గర్ | 1802656 | 10856 | 166 |
RJ | DA | దౌస | దౌస | 1316790 | 3429 | 384 |
RJ | DH | ధొల్‌పూర్ | ధొల్‌పూర్ | 982815 | 3084 | 319 |
RJ | DU | దుంగర్‌పుర్ | దుంగర్‌పుర్ | 1107037 | 3770 | 294 |
RJ | GA | గంగానగర్ | గంగానగర్ | 1788487 | 7984 | 224 |
RJ | HA | హనుమాన్‌గర్ | హనుమాన్‌గర్ | 1517390 | 12645 | 120 |
RJ | JJ | ఝుంఝునూన్ | ఝుంఝునూన్ | 1913099 | 5928 | 323 |
RJ | JL | జలోర్ | జలోర్ | 1448486 | 10640 | 136 |
RJ | JO | జోద్‌పూర్ | జోద్‌పూర్ | 2880777 | 22850 | 126 |
RJ | JP | జైపూర్ | జైపూర్ | 5252388 | 11152 | 471 |
RJ | JS | జైసల్మేర్ | జైసల్మేర్ | 507999 | 38401 | 13 |
RJ | JW | ఝలవర్ | ఝలవర్ | 1180342 | 6219 | 190 |
RJ | KA | కరౌలి | కరౌలి | 1205631 | 5530 | 218 |
RJ | KO | కోట | కోట | 1568580 | 5446 | 288 |
RJ | NA | నగౌర్ | నగౌర్ | 2773894 | 17718 | 157 |
RJ | PA | పలి | పలి | 1819201 | 12387 | 147 |
RJ | RA | రాజ్‌సమంద్ | రాజ్‌సమంద్ | 986269 | 3853 | 256 |
RJ | SK | సికర్ | సికర్ | 2287229 | 7732 | 296 |
RJ | SM | సవై మధోపూర్ | సవై మధోపూర్ | 1116031 | 4500 | 248 |
RJ | SR | సిరోహి | సిరోహి | 850756 | 5136 | 166 |
RJ | TO | తోంక్ | తోంక్ | 1211343 | 7194 | 168 |
RJ | UD | ఉదైపూర్ | ఉదైపూర్ | 2632210 | 13430 | 196 |
[మార్చు] ప్రసిద్ధులైన వారు
రాజస్థాన్ చరిత్ర, సాహిత్యమూ ఎన్నో వీరగాధలతో నిండి ఉన్నాయి. ఎందరో త్యాగశీలురూ, ధైర్యశాలురూ చరిత్రలో గుర్తుండిపోయారు. వారిలో కొందరి పేర్లు
- బలదేవ్ రామ్ మీర్ధా
- చౌదరి కుంభారామ్ ఆర్యా
- మహారాణా ప్రతాప్
- మీరా బాయి
- జైమల్ రాథోడ్
- వీర దుర్గాదాసు
- పన్నాబాయి
- వీరతేజ
- శేఖాజీ
- మహారాణీ గాయత్రీ దేవి - ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నాయకురాలు
- మహారాజా సవాయ్ జైసింగ్
- మహారాజా సవాయ్ మాన్ సింగ్
- మహారాజా సవాయ్ మధో సింగ్
- మహారాజా సూరజ్ మల్
- స్వామికేశవానంద
[మార్చు] గణాంకాలు
- జానాభా: 5కోట్ల 65 లక్షలు (2001 లెక్కలు)
- జిల్లాలు: 33
- నగరాలు: ??
- ముఖ్య నగరాలు: జైపూర్, జోధ్ పూర్, ఉదయపూర్, కోట, ఆజ్మీర్, బికనేర్, భిల్వాడా, ఆల్వార్
- రోడ్లు: 61,520 కి.మీ.( 2,846 కి,మీ. జాతీయ రహదారి)
- భాషలు: హిందీ, రాజస్థానీ
- అక్షరాస్యత: 61.03 %
[మార్చు] మందిరాలు
భారతదేశంలో చాలా పవిత్రంగా భావించే హిందూ, జైన మందిరాలు కొన్ని రాజస్థాన్‌లో ఉన్నాయి:
బ్రహ్మ మందిరం: ఆజ్మీర్ వద్ద పుష్కర్‌లో ఉన్నది. సృష్టికర్త బ్రహ్మను పూజించే మందిరం ఇదొక్కటే.
అచలేశ్వర్ మహాదేవ మందిరం: మౌంట్ అబూ వద్ద అచల్‌ఘర్‌లో ఉన్న శివాలయం. ఈ మందిరం ప్రత్యేకత ఏమంటే ఇక్కడ శివలింగం బదులు శివుని మడమ శిల్పం, ఇత్తడి నంది విగ్రహం ఉన్నాయి.
ఆదినాధ్ మందిరం: ఉదయపూర్ సమీపంలో రిఖాబ్‌దేవ్ వద్ద నున్న జైన మందిరం. 15వ శతాబ్దంలో నిర్మితం. బిజోలియా మందిరాలు: బుంది వద్ద బిజోలియాలో ఉన్న మందిరాల సమూహం. దాదాపు 100 మందిరాలలో మూడు మాత్రమే ఇప్పుడు మిగిలి ఉన్నాయి.
నాథ్‌ద్వారా : ఉదయ్‌పూర్‌కు 48 కి.మీ. దూరాన ఉన్న రాజసమండ్ జిల్లాలో ఉన్న శ్రీనాధ్‌జీ మందిరం. పుష్టిమార్గం అనుసరించేవారికి పూజాస్థలం.
అంబికామాత మందిరం: ఉదయపూర్‌కు 50 కి.మీ. దూరంలో మౌంట్ అబూ వద్ద జగత్ గ్రామంలో ఉన్న దుర్గాదేవి మందిరం.
[మార్చు] సమస్యలు
- నీటి కొరత రాజస్థాన్ లో తీవ్రమైన సమస్య.
- స్త్రీ, పురుషుల నిష్పత్తి = 850:1000
[మార్చు] వనరులు
- Gahlot, Sukhvirsingh. 1992. RAJASTHAN: Historical & Cultural. J. S. Gahlot Research Institute, Jodhpur.
- Somani, Ram Vallabh. 1993. History of Rajasthan. Jain Pustak Mandir, Jaipur.
- Tod, James & Crooke, William. 1829. Annals & Antiquities of Rajasthan or the Central and Western Rajput States of India. 3 Vols. Reprint: Low Price Publications, Delhi. 1990. ISBN 81-85395-68-3 (set of 3 vols.)
[మార్చు] బయటి లంకెలు
- State Government of Rajasthan - Official home page
- Tourism Department of Rajasthan - Tourism Home Page
భారతదేశ రాష్ట్రములు మరియు ప్రాంతములు | |
---|---|
ఆంధ్ర ప్రదేశ్ | అరుణాచల్ ప్రదేశ్ | అసోం | బీహార్ | ఛత్తీస్‌గఢ్ | గోవా | గుజరాత్ | హర్యానా | హిమాచల్ ప్రదేశ్ | జమ్మూ కాశ్మీరు | జార్ఖండ్ | కర్నాటక | కేరళ | మధ్య ప్రదేశ్ | మహారాష్ట్ర | మణిపూర్ | మేఘాలయ | మిజోరాం | నాగాలాండ్ | ఒరిస్సా | పంజాబ్ | రాజస్థాన్ | సిక్కిం | తమిళనాడు | త్రిపుర | ఉత్తరాంచల్ | ఉత్తర ప్రదేశ్ | పశ్చిమ బెంగాల్ | |
కేంద్రపాలిత ప్రాంతములు: అండమాన్ నికోబార్ దీవులు | చండీగఢ్ | దాద్రా నగరు హవేలీ | డామన్ డయ్యు | లక్షద్వీపములు | పుదుచ్చేరి | |
జాతీయ రాజధాని ప్రాంతము: ఢిల్లీ |