రాజేంద్ర ప్రసాద్(రాష్ట్రపతి)
వికీపీడియా నుండి
జననం: | డిసెంబర్ 3, 1884 |
---|---|
మరణం: | ఫిబ్రవరి 28, 1963 |
భారతదేశపు మొదటి రాష్ట్రపతి |
డా. రాజేంద్ర ప్రసాద్ (Dr. Rajendra Prasad) (డిసెంబర్ 3, 1884 – ఫిబ్రవరి 28, 1963) భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి.
రాజేంద్ర ప్రసాద్ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, భారత రాజ్యాంగ నిర్మాణ శిల్పి. 1948 నుండి 1950 వరకు భారత రాజ్యాంగ ముసాయిదా తయారీ కోసం ఏర్పరచబడిన సంఘానికి (Constituent Assembly) అధ్యక్షత వహించాడు. భారతదేశ మొట్టమొదటి ప్రభుత్వంలో కొద్ది కాలం పాటుగా కేంద్ర మంత్రిగా కూడా పని చేసాడు. భారతదేశ స్వాతంత్ర్య సమరంలో ఒక ముఖ్య నాయకుడుకూడా
విషయ సూచిక |
[మార్చు] బాల్యము మరియు విద్యాబ్యాసము
రాజేంద్ర ప్రసాద్ బీహార్ రాష్ట్రంలో శివాన్ జిల్లాలోని జిర్దేయి గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి మహదేవ్ సహాయ్ సంస్కృతం మరియు పర్శియను భాషలలో పండితుడు. తల్లి కమలేశ్వరీ దేవి ఎప్పుడూ రామాయనం నుండి కధలు వివరించేది. ఐదవ ఏటనే పర్శియా భాషను నేర్చుకోవడానికి ఒక మౌల్వీ దగ్గరకు పంపించబడ్డాడు. చాప్రా ప్రభుత్వ పాఠశాలలో ప్రాదమిక విద్యాబ్యాసం చేసాడు. 12 సంవత్సరాల వయసులోనే రాజ్‌వంశీ దేవీని వివాహం చేసుకున్నాడు. అటు తరువాత విధ్యకై పాట్నాలో తన అన్న మహేంద్ర ప్రసాద్ వద్ద ఉంటూ ఆర్.కె.గోష్ పాఠశాలలో చదువుకున్నాడు. మరల ఇంకోసారి చాప్రా ప్రభుత్వ పాఠశాలలో చేరి కలకత్తా విశ్వ విధ్యాలయం ప్రవేశ పరీక్షలలో ప్రధమ శ్రేనిలో ఉత్తీర్ణుడయ్యాడు.
అప్పుడు కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో చేరాడు. మొదట్లో సైన్సు విద్యార్ధి, అతని అధ్యాపకులలో జగదీష్ చెంద్ర బోసు, ప్రఫుల్లా చంద్ర రాయి మొదలగువారు ఉన్నారు. కాకపోతే తరువాత సాంగిక శాస్తాల పై మక్కువ పెంచుకుని అటువైపు తన దృష్టి మరల్చాడు. రాజేంద్ర ప్రాసాదు చదుతున్నప్పుడు తన అన్నతో పాటు కలిసి ఇడెన్ హిందూ హాస్టలులో నివశించాడు. రాజేంద్ర ప్రసాద్ తన అన్నతో కలిసి స్వదేశీ ఉధ్యమాన్ని నడిపాడు.
1911లో, కాంగ్రేసులో చేరాడు. కానీ అతని కుటుంభ పరిస్తితిమాత్రం ఏమంత బాగాలేదు. అతని కుటుంభం అతని సహాయానికై ఎదురు చూస్తున్న తరుణంలో, తన అన్నను స్వాతంత్ర్య సమరంలో పాల్గొనేందుకు అనుమతి అడిగాడు. అతని అన్న అందుకు ఒప్పుకోక పోవటం వలన 1916లో ,బీహార్ మరియు ఒరిస్సా రాష్ట్రాల హైచోర్టులలో చేరాడు. ఏదయినా విచారణ జరుగుతున్నప్పుడు, తన వాదనకు వ్యతిరేకంగా ఏదయినా ఉదాహరణలు తీయలేకపోయినప్పుడు, న్యాసమూర్తులు రాజేంద్ర ప్రాసాదునే ఉదాహరణ ఇవ్వమని అడిగేవారు.
[మార్చు] స్వాతంత్ర్య సమరంలో
లాయరుగా తన జీవితాన్ని ప్రారంభించిన అనతికాలంలోనే స్వాతంత్ర్య పోరాటంవైపు ఆకర్శితుడయ్యాడు. 1921లో మహాత్మా గాంధీతో చేపట్టిన ఒక సమావేశం తరువాత తన కలిసిన తరువాత, అతను విశ్వవిధ్యాలయంలో తన సెనేటర్ పదవికి రాజీనామా చేసేశాడు. పాశ్చాత్య చదువులను బహిశ్కరించమని గాంధీజీ పిలిపునిచ్చినప్పుడు తన కొడుకు మృత్యుంజయ ప్రాసాదును విశ్వవిధ్యాలయంలో చదువును మాంపించి వెంటనే బీహార్ విధ్యాపీట్‌లో చేర్చాడు. ఈ విధ్యాపీఠాన్ని తను తన మిత్రబృందంతో కలిసి భారతీయ సాంస్కృతి ఉట్టిపడేలా స్తాపించి నడిపాడు. 1914లో బీహారు బెంగాల్‌లలో వచ్చిన వరదలలో అన్నీ కోల్పోయిన అభాగ్యులను ఆదుకోవడంకోసం తనవం సహాయాన్ని ముందుండి అందించాడు. జనవరి 15, 1934న బీహారులో భూకంపం వచ్చినప్పుడు రాజేంద్ర ప్రసాదు జైలులో ఉన్నాడూ. రెండు రోజుల అనంతరం అతనిని విడిచిపెట్టారు. బయటకు రాగానే అతను నిధులను సేకరించడం మొదలుపెట్టాడు. అలా భుకంప బాదితుల సహాయార్ధం అతను సేకరించిన నిధులు(38 లక్షలు) అప్పట్లో వైస్రాయి సేకరించిన నిధులకు మూడింతలున్నాయి.
తదుపరి ఈతనిని 1934 ఒక్టోబరులో బొంబాయిలో జరిగిన అఖిల భారత కాంగ్రేసు మహాసభలకు ప్రెసిడెంటుగా ఎన్నుకున్నారు. అలాగే 1939లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేసిన తరువాత ఇంకోసారి ఆ పదవిని చేపట్టాడు.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రాజేంద్ర ప్రసాదును రాష్ట్రపతిగా ఎన్నుకున్నారు. దేశానికి మొట్టమొదటి రాష్ట్రపతిగా స్వతంత్ర్యంగా మెలిగి, ప్రధానిని గానీ పార్టీని గానీ రాజ్యాంగ నిర్మాణంలో చేయిదూర్చనివ్వలేదు. అలా తన తరువాత వచ్చిన అందరు రాష్ట్రపతులకు ఉదాహరణగా నిలిచాడు. 12 సంవత్సరాలపాటు భారత రాష్ట్రపతిగా సేవలందించి 1962న పదవీ విరమనచేసాడు. అనంతర కాలంలో భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన భారతరత్న పురస్కారన్ని రాజేంద్ర ప్రసాదుకు ప్రకటించారు.
[మార్చు] మరణము మరియు వారసత్వం
పదవీ వరామం చేసిన కొన్ని నెలలకు అనగా సెప్టెంబర్ 1962లో, అతని భార్య రాజ్‌వంశీ దీవి చనిపోయింది. మరణానికి నెలరోజుల ముండు అతనికతనే ఒక ఉత్తరం రాసుకున్నాడు, ఇలా చెప్పాడు, "నేను అంతిమం దశకు చేరునట్లు అనిపిస్తుంది, ఏదయినా చేసే శక్తి అంతమవుతుంది, నా ఉనికే అంతమవుతుంది". ఫిబ్రవరి 28, 1963 రాం రాం అంటూ కన్ను మూశాడు.
దేశ పరజలలో ఆయనకు ఉన్నా అచంచలమైన ప్రేమాభిమానాల వలన ఆయనను దేష్ రత్న అని పెలిచేవారు.
[మార్చు] ఇవికూడా చూడండి
[మార్చు] మూలాలు
- ఇంతకుముందు ఉన్న రాష్ట్రపతుల గురించి భారత ప్రభుత్వంవారి అధికారిక వెబ్‌సైటులో చూడండి
- కాంగ్రేస్ పార్టీ వెబ్‌సైటులో రాజేంద్ర ప్రసాద్ గురించి
- డా. రాజేంద్ర ప్రాసాద్ జీవిత చరిత్ర
ఇంతకు ముందు ఉన్నవారు: రాజగోపాలాచారి (జెనరల్ గవర్నర్) |
భారత రాష్ట్రపతి 1950 జనవరి 26—1962 మే 13 |
తరువాత వచ్చినవారు: సర్వేపల్లి రాధాకృష్ణన్ |
భారత రాష్ట్రపతులు |
---|
రాజేంద్ర ప్రసాద్ • సర్వేపల్లి రాధాకృష్ణన్ • జాకీర్ హుస్సేన్ • వి.వి.గిరి • ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ • నీలం సంజీవరెడ్డి • జ్ఞాని జైల్ సింగ్ • ఆర్.వెంకటరామన్ • శంకర దయాళ్ శర్మ • కె.ఆర్.నారాయణన్ • అబ్దుల్ కలామ్ |