రాయలసీమ
వికీపీడియా నుండి
![]() |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ముఖ్యప్రాంతాల్లో ఒకటి, రాయలసీమ. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలు రాయలసీమ ప్రాంతంలోకి వస్తాయి. ఒకప్పుడు దత్తమండలం (సీడెడ్) గా పేరుబడ్డ ఈ ప్రాంతానికి 1928లో గాడిచర్ల హరిసర్వోత్తమ రావు రాయలసీమ అని పేరుపెట్టాడు. అప్పటి నుండి ఆ పేరే స్థిరపడింది.
1953 వరకు రాయలసీమ ప్రాంతం సంయుక్త మద్రాసు రాష్ట్రం లో భాగంగా ఉండేది. కోస్తా, రాయలసీమ నాయకులు జరిపిన అనేక సంవత్సరాల ఉద్యమం ఫలితంగా 1953లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కోస్తా ప్రాంతంతో పొలిస్తే రాయలసీమ అభివృద్ధి పరంగా వెనుకబడి ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినపుడు రాయలసీమ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలోని కర్నూలును కొత్త రాష్ట్ర రాజధానిగా నిర్ణయించారు. అయితే మరో మూడేళ్ళలోనే విశాల ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడడంతో రాజధాని హైదరాబాదు కు మారింది.
[మార్చు] ఆర్థిక పరిస్థితి
తక్కిన రాష్ట్రం వలెనే రాయలసీమ కూడా వ్యవసాయాధారితమైనది. రాయలసీమలో వర్షపాతం రాష్ట్ర సగటు వర్షపాతం కంటే తక్కువ. అనంతపురం జిల్లా దేశం మొత్తం మీద అతి తక్కువ వర్షపాతం గల జిల్లాల్లో రాజస్థాను లోని జైసల్మీరు తరువాత రెండో స్థానంలో ఉంది. వ్యవసాయాధార ఆర్థికపరిస్థితి గల ఈ ప్రాంత అభివృద్ధిలో ఇది అతిపెద్ద అవరోధం. రాయలసీమకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వాలు ఎన్నో పథకాలు రచించాయి. బ్రిటిషు వారు నిర్మించిన కర్నూలు కడప కాలువ తోపాటు, శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ, తెలుగుగంగ, హంద్రీ-నీవా సుజల స్రవంతి, గాలేరు-నగరి మొదలైన ప్రాజెక్టులు వీటిలో కొన్ని. అయితే పథకాలు ఎన్నున్నా వాటి అమలు విషయంలో జరుగుతున్న జాప్యం, వర్షాభావ పరిస్థితుల కారణంగా పథకాల అంచనాల మేరకు సాగునీరందని పరిస్థితి నెలకొంది.
[మార్చు] భౌగోళిక మార్పులు
స్వాతంత్రానంతరం గుంటూరు జిల్లానుండి కొంత భాగాని, కర్నూలు జిల్లా నుండి కొంత భాగాన్ని వేౠ చేసి ప్రకాశం జిల్లాను ఏర్పరచినారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా మొత్తం కోస్తా ప్రాంతంలోనే చూపించబడుతున్నది.