Static Wikipedia February 2008 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu

Web Analytics
Cookie Policy Terms and Conditions జాతీయములు-3 - వికిపీడియా

జాతీయములు-3

వికీపీడియా నుండి

భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు
  క, ఖ, గ, ఘ, ఙ, చ, ఛ, జ, ఝ, ఞ అక్షరాలతో మొదలయ్యే జాతీయాలు.


విషయ సూచిక

[మార్చు]

[మార్చు] కంకణము గట్టు

దీక్షబూను

[మార్చు] కంచము దగ్గర పిల్లి

చప్పిడి చేయకుండ ఎప్పుడు ముద్ద దొరుకునా అని చూచునది

[మార్చు] కంచుకాగడా వేసినను దొరకదు

ఎంత వెతకినా దొరకదు

[మార్చు] కంచిగరుడసేవ

కష్టమైన పని అని అర్థములో ఉపయోగిస్తారు। కంచిలో గరుడ విగ్రహము చాలా పెద్దది, ఒక రథము అంత ఉంటుంది దానిని సేవకు తరలించుట కొద్దిగ కష్టమైన విషయము కదా!

[మార్చు] కళ్ళల్లో వత్తులేసుకుని చూడటం

[మార్చు] కంటికి రెప్పవోలె

[మార్చు] కంటికి రెప్ప భార మగు

[మార్చు] కంటిలో నలుసు

[మార్చు] కందాల రాజు

[మార్చు] కంపలో బడిన కాకి

అటు ఇటు కాని స్థితి

[మార్చు] కకబిక

గజిబిజి

[మార్చు] కకావికలు

చెల్లాచెదరు

[మార్చు] కట్టు తప్పు

నీతిని తప్పు

[మార్చు] కడుపుబ్బు

ఏ రహస్యాన్ని దాచుకోలేకపోవు స్థితి।

[మార్చు] కడుపు చల్లగా

[మార్చు] కడుపే కైలాసం

ఇంట్లో ఉండటం వైకుంఠంలో ఉన్నంత సుఖం గాను,కడుపునిండితేనే కైలాసంలో ఉన్నంత సంతోషంగా ఉండటం.త్రుప్తిగా ఉండటం.

[మార్చు] కడుపులో చల్ల కదలకుండా

  • సుఖంగా,సంతోషంగా ఉండటం.
  • ఏమాత్రం శ్రమ లేకుండా... అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. అంటే కూర్చున్నవారు కూర్చున్నచోటనే ఉండి శారీరకంగా రవ్వంత కూడా అటూఇటూ కదలకపోయినా అనుకున్న పనులు అనుకున్నట్టు సాధించుకోగలగడం. 'వాడు సామాన్యుడు కాడు. కడుపులో చల్ల కదలకుండా ఎంతటి పనినైనా సాధించగలడు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

[మార్చు] కడుపులో చేయి పెట్టి కెలుకు

మిక్కిలి కష్టపెట్టు

[మార్చు] కడుపునిండిన బేరము

అక్కరలేని బేరము

[మార్చు] కడుపు కక్కుర్తి

అత్యాశ

[మార్చు] కతపత్రము

ప్రమాణ పత్రము

[మార్చు] కత్తులబోను

భరించరాని పరిస్తితులు.

[మార్చు] కత్తులు నూరటం

కక్షతో బలాబలాలను ప్రదర్శించుకోవటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. కత్తి మారణాయుధం. శత్రువుమీద దాడిచేసి అతని అంతాన్ని చూడటానికి అదో సాధనమవుతుంది. దాన్ని నూరటం అంటే పదును పెట్టడం అని అర్థం. జాతీయ ప్రయోగం విషయంలో నిజంగా కత్తి నూరినా, నూరకపోయినా తన శత్రువుమీద కక్ష సాధించటానికి ఏ ప్రయత్నం చేసినా దాన్ని ఈ జాతీయంతో సరిపోల్చి చెపుతుంటారు. "పాలకపక్షం మీద విపక్షం కత్తులు నూరుతోంది" అనేలాంటి సందర్భాల్లో ఈ ప్రయోగం విన్పిస్తుంది.

[మార్చు] కత్తిమీది సాము

[మార్చు] కథల కామరాజు

[మార్చు] కను గానక

అహంకారం.

[మార్చు] కట్టె, కొట్టె, తెచ్చె

క్లుప్తతను సూచించేందుకు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ఇది రామాయణ కథనంతటినీ క్లుప్తీకరించి చెప్పిన జాతీయం. రాముడు వారధి కట్టి, రావణుడిని కొట్టి, సీతమ్మను తెచ్చాడు అని రామాయణ కథనంతటినీ అత్యంత సంగ్రహంగా చెప్పినట్టుగా ఏ విషయాన్నైనా అత్యంత సూక్ష్మంగా చెప్పిన సందర్భంలో ఈ జాతీయం వినిపిస్తుంది. 'అంతపెద్ద విషయాన్ని కట్టె, కొట్టె, తెచ్చే అన్నట్టు చెప్పినా కూడా బాగానే ఉంది' అనేలాంటి సందర్భాల్లో దీన్ని గమనించవచ్చు.

[మార్చు] కుంచం తప్పదు

ఇది తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా వినిపించే జాతీయం. ఆచార వ్యవహారాలు, లావాదేవీల నేపథ్యం నుంచి ఇది అవతరించింది. 'కంచాల పోసింది తప్పుతుంది గానీ, కుంచాల పోసింది తప్పదు' అనే ఓ సామెత దీనికి ఆధారం. అంటే ఎవరినైనా పిలిచి కంచం పెట్టి అందులో అన్నం పెట్టి తినమన్నప్పుడు ఆ అన్నానికి ఖరీదు కట్టడం కానీ, మరెలాంటి వ్యాపార సంబంధమైన విషయాలుకానీ మిత్ర బంధువర్గాల్లో ఉండనే ఉండవు. కంచంలో ఎంత పెట్టినా తిరిగి తనకు ఇవ్వమని ఎవరూ అడగరు. కానీ కుంచం అంటే కొలమానం. ఏవైనా ఆహారపదార్థాలను ఓ కొలతగా కొలిచి వేరొక వ్యక్తికి ఇవ్వడమంటే దాన్ని మళ్లీ తిరిగి ఎప్పుడో ఒకప్పుడు ఇవ్వాల్సిందేనని అర్థం. 'నేనిచ్చింది జాగ్రత్తగా తిరిగియ్యాల. కుంచం తప్పదు మరి' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

[మార్చు] కాకి బలగం

సామూహిక ఐకమత్యానికి ప్రతీకగా ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు. సర్వసాధారణంగా కాకులు ఆహారం దొరికినా, ఏదైనా ఆపద వచ్చినా తోటి కాకులన్నింటినీ చేరబిలిచి సామూహికంగా ఆ ఆహారాన్ని పంచుకోవటమూ, ఆపదను తెచ్చినవారిని ఎదుర్కోవడమూ చేస్తుంటాయి. ఈ పద్ధతిలోనే ఎవరైనా కొంతమంది అన్ని వ్యవహారాలను సామూహికంగా చక్కపెట్టుకుంటున్న సందర్భంలో 'వారిదంతా కాకి బలగం. ఒకరికి చెబితే చాలు అందరికీ చెప్పినట్లే. అందరూ వచ్చేస్తారు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని ప్రయోగిస్తుంటారు.

[మార్చు] కన్నూ మిన్నూ కానక

హద్దులులేని అహంకారం.

[మార్చు] కనుసన్నమెలగు

[మార్చు] కన్నీళ్ళు తుడుచు

తాత్కాలికముగా శాంతపరచు

[మార్చు] కన్నీరు మున్నీరై పారు

మిక్కిలి విలపించు

[మార్చు] కన్నుల నిప్పులు రాలు

మిక్కిలి ఆగ్రహపడటం.

[మార్చు] కన్నుల పండుగ

అంతులేని ఆనందం.

[మార్చు] కన్నులలో నిప్పులు పోసుకొను

చాలా అసూయపడటం.

[మార్చు] కన్ను వేయు

ఎలాగైన స్వంతం చేసుకోవాలని ఆశపడటం.

[మార్చు] కన్ను కుట్టు

అసూయ పడటం.

[మార్చు] కళ్ళు నెత్తికెక్కు

పొగరు కనబరచు

[మార్చు] కన్నులు కాయలు కాచు

[మార్చు] కన్నులు వాచు

[మార్చు] కన్నులు పైకి వచ్చు

[మార్చు] కన్నెర్రజేయు

[మార్చు] కప్పదాటులు వేయుట

[మార్చు] కప్పల తక్కెడ

[మార్చు] కయ్యమును కాలు దువ్వు

[మార్చు] కరతలామలకము

ఆర చేతిలో ఉసిరికాయ పెట్టుకున్నంత తేలిక అని దీని అసలు అర్థము. ఏదైనా పనిని "నేను చాలా సులువుగా చెయ గలను" అని చెప్పటానికి ఈ సామెత వాడుతారు. ఉదాహరణకు: ఈ చెరువును ఈది దాటటము నాకు కరతలామలకము.

[మార్చు] కర్ణాకర్ణిగా

[మార్చు] కర్ణుడు లేని భారతము

[మార్చు] కలసిమెలసి

[మార్చు] కలలోని మాట

[మార్చు] కలసి కట్టుగా నుండు

[మార్చు] కలహమునకు కాలు దువ్వు

[మార్చు] కలగూరగంప

[మార్చు] కలలోని కాన్పు

[మార్చు] కవకవ

[మార్చు] కసమస

[మార్చు] కహ కహ నవ్వు

[మార్చు] కళ్ళమీద తెల్లారటం

నిద్రపోవటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. రాత్రంతా కనీసం కన్నుమూయలేదు అని చెప్పే భావంతో ఈ జాతీయం సరిపోలుతుంది. పెళ్ళి సమయాల్లో పెళ్ళిపెద్దలు రాత్రిళ్ళంతా మేలుకొనివుండి పెళ్ళి పనులన్నీ చక్కదిద్దుతుంటారు. "నిన్న పెళ్ళివంటలు చేయించటానికి వెళ్ళాము, మా కళ్ళమీదనే తెల్లారింది, అంతగా కష్టపడబట్టే పిండివంటలన్నీ ఇప్పటికి సిద్ధమయ్యాయి" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం విన్పిస్తుంది.

[మార్చు] కలుపుగోలు కల్లు

తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో ప్రచారంలో ఉన్న ఈ జాతీయానికి ఇరువర్గాలవారు విభేదాలను మరిచి స్నేహంగా కలిసిన సందర్భంలో ఇచ్చే విందు అని, వివాహ సంబంధాల నిశ్చయ సమయంలో ఇచ్చే విందు అని అర్థాలున్నాయి. పూర్వపురోజుల్లో అలా ఎవరైనా ఇద్దరు కలిసినప్పుడు విందు ఇచ్చి కల్లు తాగించే ఆచారం కూడా ఉండేది. తర్వాత కాలంలో కల్లు ప్రస్తావన ఉన్నా లేకపోయినా విందు ఇచ్చే సందర్భాన్ని తెలపడానికి ఈ జాతీయాన్ని ప్రయోగించడం కనిపిస్తుంది. 'నిన్ననే సంబంధం కుదిరింది. ఇవ్వాళ కలుపుగోలు కల్లుకు పోతున్నాం' అనేలాంటి ప్రయోగాలున్నాయి.

[మార్చు] కసాయి కత్తులు

నిర్దాక్షిణ్యమైనవి, నిర్దాక్షిణ్య వైఖరిని అవలంబించేవారు అనే అర్ధాలలో ఈ జాతీయం వాడుకలో ఉంది. కసాయివాడి చేతిలోఉన్న కత్తికి, కసాయివాడికి దయాదాక్షిణ్యం ఉండవు. అలాగే ఏమాత్రం కరుణ చూపకుండా ఎవరైనా ప్రవర్తిస్తున్న సందర్భంలో ఈ జాతీయాన్ని వాడడం కనిపిస్తుంది. "ప్రతిపక్ష రాష్ట్రాల్లోని గవర్నర్లు కేంద్రం చేతిలోని కసాయికత్తుల్లా తయారయ్యారని అనిపిస్తోంది" అనేలాంటి సందర్భాల్లో ఇది ప్రయోగంలో ఉంది.

[మార్చు] కడుపు కుటకుట

ఈర్ష్య, ఓర్వలేనితనం అనే అర్థాలలో వినిపించే ఈ జాతీయం ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో వాడుకలో ఉంది. ఎదుటివాడు అభివృద్ధిలోకి వస్తున్నాడని ఓర్వలేనితనంతో ఎవరైనా ప్రవర్తిస్తున్నప్పుడు 'వాడిని చూసి వీడి కడుపు కుటుకుటలాడుతాంది" అనేలాంటి సందర్భాల్లో ఈ ప్రయోగం కనిపిస్తుంది.

[మార్చు] కడుపులో ఎలుకలు పరుగెత్తడం

ఎక్కువగా ఆకలి కావడం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. ఎలుక తనకు అడ్డం వచ్చినవాటిని కొరకడం సహజం. అలాంటిదే ఎలుకలు కడుపులో పరుగెత్తుతున్నాయంటే అవి కొరుకుతున్నంత బాధ కలుగుతోందని అర్ధం. ఆ బాధను ఆకలితో పోల్చిచెప్పడంవల్ల ఈ జాతీయం అవతరించింది. అంటే ఎలుక కొరికినంత బాధలా ఆకలిబాధ ఉందని చెప్పడం ఇక్కడి అర్థం. "కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి. ఆ భోజనమేదో త్వరగా వడ్డించండి బాబూ" అనే సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

[మార్చు] కప్పదాటు వైఖరి

సమస్య నుంచి తప్పించుకు తిరగడమనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. కప్ప మాములుగా నేలబారున నడవక గంతులేస్తూ వెళ్తుంది. ఇదే పద్ధతిలో ఎదురుగా సమస్య ఉన్నప్పుడు దాన్ని పరిష్కరించకుండా, సాధించకుండా వేరే మార్గంలో తప్పించుకుపోయే పద్ధతిని కప్పదాటు పద్ధతి అనడం కనిపిస్తుంది. 'అడిగిన విషయం గురించి మాట్లాడకుండా ఆయన కప్పదాటుడు వైఖరితో ఉండడం ఏమీ బాగోలేదు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని ప్రయోగించడం గమనించవచ్చు.

[మార్చు] కళ్లనీళ్లు తుడవడం

ఓదార్చడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. దుఃఖం కలిగినప్పుడు కళ్లవెంట నీరు రావడం సహజం. అలా వచ్చిన నీళ్లను దుఃఖిస్తున్న వ్యక్తి లేదా అక్కడ ఎదురుగా ఉన్న అతడి అభిమాని అయినా తుడవవచ్చు. దుఃఖం నుంచి ఉపశమనం కలిగించడానికి ఎదుటివారు అలా కళ్లనీళ్లు తుడుస్తారు. అయితే ఇది జాతీయంగా వాడుకలోకి వచ్చేసరికి దుఃఖం ఉన్నా లేకపోయినా, నిజంగా కళ్లవెంట నీరు వచ్చినా రాకపోయినా ఎదుటివారి మనసుకు కొంత ప్రశాంతత కలిగించేందుకు చేసే పనులను ఈ జాతీయంతో సూచించడం కనిపిస్తుంది. 'ఈ పథకాలు పేదప్రజల కన్నీరు తుడవడానికే సుమా' అనేలాంటి సందర్భాల్లో దీని ప్రయోగం కనిపిస్తుంది.

[మార్చు] కబంధ హస్తాలలో చిక్కడం

తప్పించుకోలేని విషమ పరిస్థితులు ఏర్పడడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. రామాయణంలో కబంధుడి ప్రస్తావన ఉంది. కబంధుడి చేతులలో చిక్కినవారెవరూ బతికి బయటపడడం నాడు సాధ్యమయ్యేదికాదు. అంత క్లిష్ట పరిస్థితులు వచ్చాయని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని ప్రయోగిస్తుంటారు.

[మార్చు] కత్తులు దూయడం

గొడవ పడడం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. పూర్వకాలపు యుద్ధపద్ధతిలో రణరంగంలో శత్రువు మీదకు కత్తులు దూసి వెళ్లేవారు. తన విరోధిని అంతం చేయాలన్న లక్ష్యం ఈ స్థితిలో ఉండేది. అదే పద్ధతిలో నిజంగా కత్తులు చేతపట్టి తన విరోధి మీదకు వెళ్లకపోయినా మాములుగా గొడవ చేసేందుకు వెళ్లిన సందర్భమే అయినా ఈ జాతీయాన్ని ప్రయోగించడం కనిపిస్తుంది. అంటే విరోధ తీవ్రతను తెలియజేయడానికి ఇలా ఈ జాతీయాన్ని ప్రయోగిస్తుంటారన్నది భావం. "పాలకవర్గం, ప్రతిపక్షం ఆ విషయమై కత్తులు దూసుకోవడం ఏమంత సమంజసం కాదనిపించింది" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని ఉపయోగించడం కనిపిస్తుంది.

[మార్చు] కాలుదువ్వడం

ఘర్షణకు సిద్ధపడడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. అయితే ఇది జంతువుల స్వాభావిక చర్య ఆధారంగా ఆవిర్భవించిందని పండితులు చెపుతారు. ఎద్దులాంటి జంతువు మరో జంతువుతో పోరాడడానికి సిద్ధమయ్యేటప్పుడు నేలమీద కాలు వేగంగా దువ్వుతూ తోక పైకెత్తి తన కోపాన్ని ప్రకటిస్తున్నట్లు కనిపిస్తుంది. మానవ వ్యవహారంలో ఇలాంటిదేదీ లేకపోయినా తన శత్రువులపై అధిక కోపాన్ని ఎవరైనా ప్రకటిస్తూ పోట్లాటకు సిద్ధమైనప్పుడు ఈ జాతీయాన్ని ప్రయోగించడం కనిపిస్తుంది.

[మార్చు] కాచి వడబోయడం

పూర్తిగా సారాన్ని గ్రహించడం, అవగాహన చేసుకోవడం అనే అర్ధాలలో ఈ జాతీయం వాడుకలో ఉంది. "దాన్నిగురించి ఆయనకు మనమిప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఆయన దాన్ని కాచి వడబోశాడు" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని ప్రయోగించడం కనిపిస్తుంది.

[మార్చు] కుక్కల దొడ్డి

కుక్కలను భద్రత కోసమో, ముద్దు కోసమో పెంచుకునే వారు అవి ఉండే ప్రదేశాలను చాలా పరిశుభ్రంగా ఉంచే మాట నిజమే కానీ ఈ జాతీయ ఆవిర్భావానికి కారణమైన కుక్కల దొడ్డి మాత్రం దానికి విరుద్ధంగానే ఉంటుంది. ఊరకుక్కలు తమ ఆహారం కోసం కొట్లాడుకుంటూ తిరిగే ప్రదేశం చిందరవందరగా, అపరిశుభ్రంగా ఉంటుంది. ఊరకుక్కలు ఉండే ప్రాంతం (దొడ్డి) మాదిరి అపరిశుభ్రంగా ఎక్కడైనా ఉన్నప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. 'ఇది ఇల్లా, కుక్కల దొడ్డా!' అనేలాంటి ప్రయోగాలున్నాయి.

[మార్చు] కుక్క మొరిగినట్లు

ప్రతిదానికీ అనవసరంగా మాట్లాడడం, పెద్దాచిన్నా భేదం చూసుకోకుండా వాడెంత, వీడెంత అని ఎగతాళి చేయడం లాంటి వాటిని ఈ జాతీయంతో పోల్చి చెబుతారు. దారి వెంట పోయే వారిలో గొప్ప పండితుడు వెళ్తూ ఉన్నా, పామరుడు పోతూ ఉన్నా, ధనికుడు కనిపించినా, పేదవాడిని చూసినా... కుక్క తన సహజ లక్షణం ప్రకారం మొరుగుతుంటుంది. పెద్దలను చూసి హేళన చేసి మాట్లాడడమూ ఇలాంటిదే. అందుకే ఈ జాతీయం ఆవిర్భవించింది. 'ఎదుటివారి గొప్పతనం ఏమీ తెలియకుండా కుక్క మొరిగినట్లు మొరగకూడదు సుమా' అనేలాంటి ప్రయోగాలు ఉన్నాయి.

[మార్చు] కుదిపేయటం

ఆందోళన కలిగించటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. గమనం మామూలుగా సాగుతూ ఉంటే హాయిగానే ఉంటుంది. కానీ ఎత్తునుంచి పల్లానికి పడ్డప్పుడు ఎత్తుకు ఎక్కలేకపోతున్నప్పుడు ఎంతో బాధ కలుగుతుంది. ఈ స్థితి ఆందోళన కలిగిస్తుంది. ఇలాంటి భావానికి ప్రతీకగానే జీవితం మాములుగా సాగిపోతున్నప్పుడు ఏ కారణం చేతనైనా ఆందోళనకర పరిస్థితులు సంభవించినప్పుడు ఈ జాతీయాన్ని ప్రయోగిస్తుంటారు. "నిన్న జరిగిన సంఘటన అతడిని బాగా కుదిపేసింది. ఇప్పుడిప్పుడే కోలుకొనేలా లేడు" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగాన్ని గమనించవచ్చు.

[మార్చు] కుంపట్లు

విభేదాలు అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. కుంపట్లో నిప్పులు ఉంటాయి. అవి రాజుకుంటే వేడిపుడుతుంది. అసహనం, భేదాభిప్రాయాలు... ఇలాంటివాటిని నిప్పుతోను, మితిమీరిన వేడితోను పోల్చిచెప్పడంవల్ల ఈ జాతీయం వాడుకలోకి వచ్చింది. "తన సొంత పక్షంలో కుంపట్లు రాజుకున్నందువల్లనే ఆ నాయకుడి పరిస్థితి అలా దిగజారాల్సి వచ్చింది" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

[మార్చు] కొంగు ముడేయడం

వివాహం జరిపించడం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. 'పల్లూ బాంధ్‌నా' అని దీనికి సామ్యంగా హిందీ భాషలో కూడా జాతీయం ఉంది. సంప్రదాయబద్ధంగా ఉన్న కొన్ని విషయాలు జాతీయాలయ్యాయి అనడానికి ఇదొక ఉదాహరణ. వధూవరుల కొంగులను వివాహ సమయంలో ముడివేయడం ఓ సంప్రదాయం. 'ఈ సంవత్సరం వీళ్ళిద్దరికీ కొంగుముడేయాలని అనుకుంటున్నాం' అనేలాంటి ప్రయోగాలున్నాయి.

[మార్చు] కోరల్లేని పాము

అధికారాలు ఏమీ లేనివాడు అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పాముకు కోరలు ఉంటే అది కాటువేస్తుందని, ఆ విషం ప్రాణాంతకమవుతుందని భావించి భయపడతారు. అదే ఆ పాముకు కోరలు లేవని అనుకొన్నప్పుడు ఆ పామును చూసి భయపడటంకానీ మరేదీ జరగదు. ఇక్కడ కోరలనేవి అధికారికి ఉండే అధికారాలుగా పోల్చిచెప్పటం జరిగింది. ఎవరినైనా శిక్షించటానికి తగిన అధికారాలు చేతిలోవున్న వాడిని చూస్తే కోరలున్న పామును చూసినట్లు అతడి కింది ఉద్యోగులు భయపడతారు. అధికారాలు లేనివాడిని చూస్తే అలాంటి భయమేదీ ఉండదు. "ఆయన కోరల్లేని పాములే... అందుకే నేనంతగా భయపడటంలేదు" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.


కోపముతో నవ్వు

[మార్చు] కాందారి మాందారి ప్రొద్దు

అర్దరాత్రి

[మార్చు] కాకః కాకః పీకః పీకః

కాకి కాకియే పీక పీకయే కాకి కాకియే, కోకిల కోకిలయే

[మార్చు] కాకతాళీయము

కాకి వాలగానే అకస్మాత్తుగా తాటిపండు పడినట్లు।

[మార్చు] కాకదంత పరిక్ష

[మార్చు] కాకిగోల

[మార్చు] కాకులను కొట్టి, గ్రద్దలకు వేయు

[మార్చు] కాకులు దూరని కారడవి

[మార్చు] కాటికి కాళ్ళు చాపు

[మార్చు] కాయగసరులు

[మార్చు] కాయ గాచు

ఓ బిడ్డను కను

[మార్చు] కాయో పండో

అవునో కాదో

[మార్చు] కారాలు మిరియాలు నూరు

[మార్చు] కాలనేమి జపము

[మార్చు] కాలు ద్రువ్వు

[మార్చు] కాలు కాలిన పిల్లి

[మార్చు] కాలికి ముల్లు గ్రుచ్చుకొనదు

[మార్చు] కాలికి వేసిన వేలికి, వేలికి వేసిన కాలికి

దీనికే రూపాతరం - "కాలికేస్తే వేలికి, వేలికేస్తే కాలికి". ఇద్దరి మధ్య ఒక వాగ్వాదం గాని, తగవుగాని జరుగుతున్నపుడు విషయాన్ని ఏదో విధంగా మెలికబెట్టి పరిష్కారం కానీయకుండా చేసే నేర్పును ఇలా చమత్కరిస్తారు. ఈ జాతీయాన్ని పొగడే సందర్భంలో గాని, తిట్టే సందర్భంలోగాని వాడవచ్చును.

[మార్చు] కాలికి బుద్ది చెప్పు

[మార్చు] కాళ్లకు చక్రాలు

అదేపనిగా ఎప్పుడూ తిరుగుతూ ఉండడమనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. చక్రం చలనానికి సూచకం. ఇక నేరుగా కాళ్లకు చక్రాలుంటే ఆగే పనుండదు కదా... అనేది ఈ జాతీయం వెనకున్న భావన. 'వాడు కాళ్లకు చక్రాలు తగిలించుకున్నట్టు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

[మార్చు] కసంత (కుసంత)

కొంచెము

[మార్చు] కిమ్మను

[మార్చు] కీలెరిగి వాత పెట్టు

[మార్చు] కుండమీదికి

వంట సరుకులు అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. కుండమీదికి, కుండ కిందికి, పొయ్యి మీదికి, పొయ్యి కిందకి... అనే లాంటి సమానార్ధక ప్రయోగాలు ప్రచారంలో ఉన్నాయి. అంటే పొయ్యి పెట్టి వంట చేసేటప్పుడు పూర్వం పొయ్యిలోకి కట్టెలను వాడేవారు. పొయ్యి మీదికి (కుండమీదికి) అంటే కుండలో ఏదైనా వండడానికి సరుకులు అవసరం. ఈ భావనతోనే 'ఈ రోజు కుండమీదికేముంది' అని ఎవరైనా అంటే వండడానికి సరుకులేమున్నాయనేది దాని అర్ధం. అలాగే 'కుండమీదికి, కుండ కిందికి ఉండేటట్లు ఈ జీవితం సాగిపోతే చాలు' అనే లాంటి ప్రయోగాలు కూడా వినిపిస్తుంటాయి.

[మార్చు] కుంచెములతో మంచు కొలుచు

[మార్చు] కుంచెడు మానెడు

[మార్చు] కుండమార్పు

[మార్చు] కుందేటికొమ్ము

[మార్చు] కుంభకర్ణ నిద్ర

[మార్చు] కుంభము మీది పొట్టేలు వలె

[మార్చు] కుక్క ముట్టిన కుండ

[మార్చు] కుడి ఎడమ

[మార్చు] కుయ్యో మొర్రో

[మార్చు] కూత వేటు దూరంలో

[మార్చు] కూనలమ్మ కీర్తనలు

లల్లాయి పదాలు

[మార్చు] కూరగాయ కవిత్వము

ఎప్పటివో సుద్దులు

[మార్చు] కొంగుపరచు

రతికి తయారవ్వు

[మార్చు] కొంగు బంగారు

[మార్చు] కొండను తవ్వి ఎలుకను పట్టు

[మార్చు] కొండలు పిండి చేయు

[మార్చు] కొండంత దేవరకు కొండంత పత్రి

[మార్చు] కొండంత ఆశ

[మార్చు] కొంప తీసి

[మార్చు] కొంప కూల్చు

[మార్చు] కొట్టిన పిండి

[మార్చు] కొట్టు మిట్టాడు

[మార్చు] కొమ్ములు తిరిగిన వాడు

[మార్చు] కొరివితో తలగోక్కొను

[మార్చు] కొరకరాని కొయ్య

[మార్చు] కొలికికి వచ్చు

[మార్చు] కోడికూసినదాక

[మార్చు] కోతలు కోయు

[మార్చు] కోరలు తీసిన పాము

[మార్చు]

[మార్చు] ఖయ్యిమనడం

కోపంతో అరవడం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. ఎవరైనా ఎదుటి వ్యక్తి మీద విపరీతంగా కోపం ప్రదర్శిస్తూ అరుస్తున్న సమయంలో ఖయ్యిమంటున్నాడు, ఖయ్‌ఖయ్‌ లాడుతున్నాడు అని అనడం కనిపిస్తుంది. ఇలా ఈ జాతీయం కోప భావ ప్రకటనకు ప్రతిబింబంగా ప్రయోగంలో ఉంది.


[మార్చు]

[మార్చు] గోదావరిలో కలుపు

[మార్చు] గంగి

[మార్చు] గంతకు తగ్గ బొంత

[మార్చు] గగన కుసుమము

[మార్చు] గగనమగు

క్షీణించిపోవు

[మార్చు] గజ స్నానము

[మార్చు] గజరుగజరులు పోవు

పిండి పిండి యగు

[మార్చు] గట్టెక్కు

[మార్చు] గడ్డితిను

[మార్చు] గాడిద గుడ్డు

గాడిద గుడ్డు పెట్టదు. కనుక గాడిద గుడ్డు అంటే "ఏమీ నిజం లేనిది" అని అర్ధం. అంటే అది ఉత్తుత్తి సంగతి. అందులో ఏమీ పస లేదు. ఈ పదాన్ని బాగా మోటుగా నిరసన, విభేదం తెలపడానికి వాడుతారు. ఎవరైనా అదనీ, ఇదనీ చెబుతున్నపుడు అందుకు మనం అసలు ఒప్పుకోకపోతే "గాడిద గుడ్డేం కాదూ?" అనవచ్చును. (అవతలివాడు నొచ్చుకున్నా మనకేమీ ఇబ్బంది లేకపోతేనే!).

ఈ పదానికి ఒక పాతకధ చెబుతారు ఒకడు ఒక చనిపోయిన గాడిదను మోసుకుపోవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే దానిని మోయలేక దాని రెండు గుడ్లను (కనుగుడ్లను) పెరికి తీసుకెళ్తున్నాడు. 'ఏమి తీసికెళ్తున్నావురా?' అని ఎవరో అడగగా 'గాడిద గుడ్డు' అని జవాబిచ్చాడు. (ఈ కధకూ పైన చెప్పిన వాడుకకూ అంత పొత్తు కుదరడంలేదు. బహుశా కధ అందరికీ తెలవకపోవచ్చును.)

[మార్చు] గాలి పాట

[మార్చు] గాలి మాట

[మార్చు] గాలికి ధూళికి

[మార్చు] గుండె రాయి చేసుకొను

[మార్చు] గుటకలు మ్రింగు

[మార్చు] గుట్టు మట్టు

[మార్చు]

[మార్చు]

[మార్చు] చల్లని సంసారం

ప్రశాంతమైన కుటుంబ జీవన విధానం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. చల్లదనం ఆనందానికి, ఆహ్లాదానికి ప్రతీకగా గ్రహిస్తున్న నేపథ్యంలో ఈ జాతీయం ఆవిర్భవించింది. ఎవరి కుటుంబమైనా ఏ గొడవలూ లేకుండా హాయిగా గడిచిపోతున్నప్పుడు 'వాళ్ళకేమండీ... వాళ్ళది చల్లని సంసారం' అని అనడం గమనార్హం.

[మార్చు] చతుర్ముఖ పారాయణం

చతుర్ముఖుడు అంటే నాలుగు ముఖాలు కలిగిన వాడు అంటే బ్రహ్మదేవుడు అనే అర్ధం బహుళ ప్రచారంలో ఉంది. ఈ జాతీయం విషయానికి వస్తే ఆ బ్రహ్మదేవుడి నామాన్ని పారాయణ చేయడమో, పూజలో, వ్రతాలో చేయడమన్నది మాత్రం దీని అర్ధం కాదు.పేకాట అనే దీని అర్ధం. పేక ముక్క దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. దీని నాలుగు మూలల అంచులను నాలుగు ముఖాలుగా చెప్పి దాన్ని చతుర్ముఖం అని పిలుస్తూ ఆ పేకముక్కలతో ఆడే ఆటను చతుర్మఖ పారాయణం అనడం జరుగుతోంది. 'ఈ సమయంలో వాడు ఇంటిదగ్గర ఉండడు. బయట ఎక్కడో చతుర్ముఖ పారాయణ చేస్తుంటాడు' అనేలాంటి సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.


[మార్చు] చప్పగా ఉండడం

నిస్సారంగా ఉండడం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. ఏ పదార్ధమైనా ఉప్పు, కారం, తీపి, పులుపు లాంటి రుచులేవీ లేకుండా ఉంటే దాన్ని ఎవరూ ఇష్టపడరు. ఈ భావన ఆధారంగానే ఎవరికీ నచ్చని విధంగా ఎవరైనా ఏ పనైనా చేసినప్పుడు, ఆ పనిలో ఎలాంటి సారమూ లేనప్పుడు ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. 'రాత్రి చూసిన నాటకం నాకెందుకో చప్పగా అనిపించింది' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని ఉపయోగించడం గమనించవచ్చు.


[మార్చు] చురుకు ముట్టడం

కష్టాలు ప్రాప్తించడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. బెత్తం లాంటి వాటితో ఎవరినైనా కొడితే చురుకు తగిలి బాధ కలుగుతుంది. ఆ బాధ అనుభవించే వాడికి వర్ణనాతీతంగానే ఉంటుంది. వాస్తవానికి బెత్తంతో కొట్టినా కొట్టక పోయినా గతం తాలూకు కష్టాలు ఏమైనా గుర్తుకొచ్చి ఆ కష్టాలు గుణ పాఠాలుగా ఉన్న సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. 'దొర దగ్గర ఇంతకు ముందే వాడికి చురుకు ముట్టింది. అందుకే మళ్లీ ఆయన ముందుకు వచ్చి పొగరుగా మాట్లాడడం లేదు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని వాడుతుంటారు.

[మార్చు] చిన్న ఇల్లు

రెండో భార్య ఇల్లు అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. అంటే చిన్నభార్య ఉండే ఇల్లు అన్నది అంతరార్థం. ఒకసారి వివాహమైన తర్వాత కారణాంతరాల వల్ల బయటకు తెలిసో తెలియకుండానో ఉండేలా ఎవరైనా రెండో వివాహం చేసుకున్న సందర్భంలో లేదా వివాహేతర సంబంధం ఉన్న సందర్భాల్లో కూడా ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. 'ఈ మధ్య వాడు చిన్నిల్లు పెట్టాడట. అందుకే మన దగ్గరకు ఎక్కువగా రావడంలేదు' అనే సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం గమనార్హం.

[మార్చు] చిన్నచూపు

చులకన చేయు


[మార్చు] చిటికెలో

స్వల్ప వ్యవధిలో అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. చేత్తో చిటిక వేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. పెద్దగా శ్రమించనవసరం లేదు కూడా. అంత తక్కువ శ్రమ, తక్కువ సమయాల్లో చేసే పనిని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు 'అదే నేనైతేనా... ఆ పనంతా చిటికెలో చేసేస్తా" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

[మార్చు] చీమదూరే సందు

స్వల్ప అవకాశం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. చీమ దూరడానికి చాలా తక్కువ చోటు సరిపోతుంది. అంత తక్కువ అవకాశం అని చెప్పడానికి ఈ జాతీయాన్ని ఒక పోలికగా వాడుతుంటారు. 'చీమ దూరేంత సందు దొరికితే చాలు, నీకు చేయాల్సిన సహాయమంతా చేసేస్తాను' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

[మార్చు] చేయి పట్టడం

సమాజంలో ఉండే సంప్రదాయాలు కూడా జాతీయాల ఆవిర్భావానికి కారణాలయ్యాయని చెప్పడానికి ఈ జాతీయం ఓ ఉదాహరణ. వివాహ వ్యవస్థలో పాణిగ్రహణం ఓ సంప్రదాయం. దాని అర్థమే ఈ చేయి పట్టడం. వధూవరులు ఒకరి చేతిని ఒకరు పట్టుకోవడంతోటే వారికి వివాహ బంధం ఏర్పడుతుందన్న భావనతో ఈ జాతీయం ఆవిర్భవించింది. 'ఎలాగైనా సరే ఆమె చేయి పట్టి, తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలన్నదే తన లక్ష్యమని అతను అంటున్నాడు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని ప్రయోగించడం కనిపిస్తుంది.

[మార్చు] చేయి చేసుకోవడం

ఎదుటివ్యక్తిపై ఆగ్రహంతో చేయి చేసుకోవటం అనే సందర్భం ఈ జాతీయం వెనుక ఉన్న భావన. చెయ్యందించటం అనే జాతీయానికి సహాయం చేయటం అనే అర్థం ఎలా ఉందో దానికి వ్యతిరేకంగా ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. "అనవసరంగా ముందు అతడే చేయి చేసుకొన్నాడు. లేకపోతే ఇంతదాకా వచ్చేదికాదు." అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం వినిపిస్తుంది.


[మార్చు] చొప్ప తినే ఎద్దులా

విరామం లేకుండా అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. వ్యవసాయం జీవనాధారంగా ఉన్న సమాజ నేపథ్యం నుంచి ఇది అవతరించింది. చొప్ప తినే ఎద్దు మేస్తున్నంతసేపు విరామం లేకుండా మేస్తూనే ఉంటుంది. అలాగే ఎవరైనా నిరంతరం ఏదో ఒకటి నములుతూ ఉన్నా, లేక ఏదో ఒక పని నిర్విరామంగా చేస్తున్న సందర్భాల్లో కూడా ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. 'ఎప్పుడూ చొప్పతినే ఎద్దులా ఏమిటలా ఏదో ఒకటి నములుతూనే ఉంటావు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగించడం గమనార్హం.

[మార్చు] చూసిరమ్మంటే కాల్చొచ్చినట్టు

అమితోత్సాహంతో ప్రవర్తించడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. చెప్పినదానికన్నా ఇంకా ఒకటి రెండు పనులు ఎక్కువ చేసుకొచ్చే తత్త్వం ఉన్న వ్యక్తి అని చెప్పే సందర్భంలో దీనిని ప్రయోగిస్తారు. రామాయణంలోని హనుమంతుడి లంకా దహన స్ఫూర్తితో ఇది ప్రచారంలోకి వచ్చింది. రాముడు హనుమంతుడిని సీతను చూసిరమ్మన్నాడేకానీ లంకను కాల్చిరమ్మనలేదు. అలా ఎవరైనా వ్యవహరించే సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. 'వాడు చూసిరమ్మంటే కాల్చొస్తాడు. వాడి గురించి ఏమీ దిగులుపడొద్దు.' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం వినిపిస్తుంది.

[మార్చు] చేతులు కలపడం

చేయి కలపడం అనే రూపంలో కూడా కనిపించే ఈ జాతీయం ఇద్దరు వ్యక్తులు ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఒకటి కావడమనే అర్థంలో ప్రయోగంలో ఉంది. 'నిన్నటి దాకా అభిప్రాయ భేదాలతో ఉన్నవారు మధ్యవర్తి పుణ్యమా అని చేతులు కలిపి ముందుకు నడుస్తున్నారు' అనే లాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది.


[మార్చు]

[మార్చు]

[మార్చు] జల్లెడతో నీళ్లు తెచ్చినట్లు

అసంభవమైన కార్యాన్ని గురించి చెప్పేటప్పుడు ఈ జాతీయం వాడుకలో ఉంది. జల్లెడకు అంతా చిల్లులే ఉంటాయి. ఆ చిల్లుల జల్లెడతో నీరు తేవడమంటే అది అయ్యే పని కాదు. అలాగే కాని పనిని గురించి ఎవరైనా చెబుతున్నప్పుడు 'వాడు చెబుతున్న మాటల తీరు చూస్తే జల్లెడతో నీళ్లు తెచ్చినట్లుగా ఉంది తప్ప మరోలాలేదు" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగించడం గమనార్హం.

[మార్చు] జీగంజి

ఇది తెలంగాణ ప్రాంతంలో వినిపించే జాతీయం. ఇతర ప్రాంతాల్లో గంగా జలం, తులసి తీర్థం అనే వాటికి ఇది సమానార్ధకం. ఎవరైనా చివరి క్షణాల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి నోట్లో గంగా జలమో, తులసి తీర్ధమో పోయడం ఓ అలవాటు. జీవికి ఆఖరుగా పోసే గంజిని జీగంజి అంటారు. చాలామంది గంగా జలం, తులసి తీర్థం లాంటివి సంపాదించుకునే స్థితి లేని వారు వాటికి బదులు గంజి పోస్తుంటారు. ఈ కారణం చేతనే ఈ జాతీయం వాడుకలోకి వచ్చింది. 'ఆయన మరణిస్తే జీగంజి పోసే దిక్కు కూడా లేకుండా పోయింది' అనే లాంటి సందర్భాల్లో ఈ ప్రయోగం కనిపిస్తుంది.

[మార్చు]

Static Wikipedia 2008 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2006 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu