Static Wikipedia February 2008 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu

Web Analytics
Cookie Policy Terms and Conditions జాతీయములు-6 - వికిపీడియా

జాతీయములు-6

వికీపీడియా నుండి

  య, ర, ల, వ, శ, ష, స, హ, ళ, క్ష, ఱ లతో మొదలయ్యే జాతీయములు
భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు

విషయ సూచిక

[మార్చు]

[మార్చు] యమ సంకటం

భరించరాని కష్టం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. చెప్పుకోలేని బాధ అనే అర్థంలో కూడా ఇది వినిపిస్తుంది. విపరీతమైన వ్యథను సూచించే సమయంలో 'ఈ పరిస్థితి అతడికి యమ సంకటంగా పరిణమించక తప్పదు' అనేలాంటి సందర్భాల్లో ఈ ప్రయోగం కనిపిస్తుంది.

[మార్చు]

[మార్చు] రంపపు కోత

తీవ్రమైన బాధ అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. రంపంతో దుంగలను కోసేటప్పుడు ఒక్కసారిగా దుంగ తెగి పడక చాలాసేపు పదునైన రంపపు పళ్లు కోతకు గురవుతుంటాయి. ఆ స్థితి మానవ శరీరానికి కలిగితే ఆ బాధ వర్ణనాతీతం. ఈ భావం ఆధారంగా ఈ జాతీయం అవతరించింది. శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎవరైనా మరొకరిని తీవ్రంగా బాధిస్తున్నప్పుడు 'వాడు చేసిన అవమానం గుర్తుకు వచ్చినప్పుడల్లా నా మనసు రంపపు కోతకు గురవుతుంటుంది' అనే లాంటి సందర్భాల్లో ఈ ప్రయోగం కనిపిస్తుంది.

[మార్చు] రంభగూడు

రంభకు సంబంధించిన గూడు అనేది దీని అర్ధం కాదు. రంభను కూడడం అంటే రంభను చేరడం అనేది ఇక్కడ అర్ధం. ఇంకా వివరాల్లోకి వెళ్తే... రంభ ఉండేది స్వర్గలోకంలో కనుక అక్కడికి వెళ్ళాడు అనే భావం స్ఫురిస్తుంది. దాని అర్ధాన్ని తీసుకుంటే స్వర్గస్తుడయ్యాడు, మరణించాడు అనే అర్ధాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

[మార్చు] రంగు తేలిపోవడం

ప్రతిష్ట కోల్పోవడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. పరువు-ప్రతిష్ట ఉన్న వ్యక్తికి సమాజంలో మంచి స్థానం ఉంటుంది. అతనంటే ఒకవిధమైన గుర్తింపు, ప్రత్యేకత ఉంటాయి. ఇలా ఉన్న వ్యక్తి ఏ కారణంచేతనైనా పరువుతక్కువ పనిచేసి దోషిగా కనిపించినప్పుడు, అంతకుముందు అతడి మీద ఉన్న అభిప్రాయం సడలిపోయి.. అతడంటే అసహ్యించుకునే స్థితి కూడా వస్తుంది. ఇలాంటి స్థితినే ఈ జాతీయంతో పోల్చిచెబుతారు. అందంగా, ఆరోగ్యంగా ఉండడాన్ని మంచి రంగుగా ఉండడంగా పోల్చిన నేపథ్యం నుంచి ఈ జాతీయం ఆవిర్భవించింది.

[మార్చు] రక్తం తాగడం

దోచుకుతినడం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. నిజంగా మనిషి శరీరంలోని రక్తాన్ని బయటకు తీసి తాగకపోయినా అలా హింసిస్తే ఎంతటి బాధ కలుగుతుందో తెలియజెప్పేందుకు ఈ జాతీయాన్ని ప్రయోగించడం జరుగుతుంది. 'ఈ రాజకీయనాయకులు పేదోళ్ల రక్తం తాగి బతికేస్తున్నారు' అనే లాంటి సందర్భాలలో ప్రయోగంలో ఉన్న ఈ జాతీయం పేదవారిని ఏదో ఒక వంకన రాజకీయ నాయకులు దోచుకుంటున్నారనే అర్ధాన్ని స్ఫురింపజేస్తుంది.

[మార్చు] రయ్‌మని వెళ్ళటం

తెలుగు భాషలో కొన్ని జాతీయాలు అనుకరణ శబ్దాల నుంచి ఆవిర్భవించాయని చెప్పటానికి ఇదొక ఉదాహరణ. రయ్‌మని వెళ్ళటమంటే అమిత వేగంగా వెళ్ళటమనేది అర్ధం. బాగా వేగంగా కదిలేటప్పుడు వచ్చే శబ్దాన్ని ఆధారంగా చేసుకొని ఈ జాతీయం వచ్చింది. అయితే... ఇది ప్రయోగంలో సాధారణంగా వేగంగా వెళ్ళటాన్ని సూచించినా అభివృద్ధి బాగా జరుగుతోంది అని చెప్పే సందర్భాల్లో కూడా ఇది ప్రయోగంలో కనుపిస్తుంది. సైకిల్‌మీద రయ్‌మని దూసుకువెళుతున్నాడు, వ్యాపారంలో రయ్‌మని ముందుకు వెళుతున్నాడు అనేలాంటి సందర్భాలు ఈ జాతీయ ప్రయోగానికి ఉదాహరణలుగా కనుపిస్తున్నాయి.

[మార్చు] రాసుకొని పూసుకొని

మితి మీరిన అనుబంధం కలిగి ఉండటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఇద్దరు వ్యక్తులు ఎంతో స్నేహపూర్వకంగా ఉన్నారు అని, వారి మధ్యన ఆప్యాయత అనురాగాలు అవధులు లేకుండా ఉన్నాయని తెలియ చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ప్రయోగించటం కనిపిస్తుంది. 'ఆ ఇద్దరు నిన్నటిదాకా బాగా రాసుకొని పూసుకొని తిరిగారు, ఇవ్వాళేమో ఒకరికొకరు తెలియనట్లు ప్రవర్తిస్తున్నారు..' అనే సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

[మార్చు] రాళ్లు రువ్వడం

నిందారోపణలు చేయడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. ఎవరిమీదకైనా రాయి రువ్వితే రాయి తగిలిన వ్యక్తి ఎంతో బాధకు గురవుతాడు. విలవిల్లాడతాడు. అలాంటి బాధనే నిందలు అనుభవిస్తున్న వ్యక్తి కూడా అనుభవిస్తాడన్న భావం ఆధారంగా ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. 'వాస్తవానికి వాడు మంచివాడే. ఇదుగో వీడే లేనిపోనివి కల్పించి రాళ్లురువ్వి బాధపెడుతున్నాడు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

[మార్చు] రామగోస

మంచికిపోతే చెడు ఎదురైందన్న భావన ఆధారంగా అవతరించిన ఈ జాతీయం తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా వినిపిస్తుంది. గోస అంటే కష్టం అని అర్థం. శ్రీరామచంద్రుడు చాలా మంచివాడే. ఆయన తన తండ్రిమాట వినాలనుకుని మంచికిపోయి వనవాసం, భార్యావిరహం లాంటి కష్టాలను పొందాడు. ఇదంతా మంచికోసం పోయినందువల్లనే జరిగింది. ఇలాగే ఎవరైనా మంచి పనికోసం వెళ్లినప్పుడు చెడు ఎదురైతే ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. 'వాడు కష్టాలలో ఉన్నాడు కదా అని ఆదుకొనేదానికి వెళ్లొచ్చిన్నందుకు రాంగా పోంగా రామగోస అయింది' అనేలాంటి సందర్భాల్లో ఈ ప్రయోగం కనిపిస్తుంది.

[మార్చు] రాచమర్యాదలు

ఎక్కువగా గౌరవ, ఆదరాలను చూపిస్తున్న సమయంలో ఈ జాతీయాన్ని వాడడం కనిపిస్తుంది. రాచరిక వ్యవస్థ అమలులో ఉన్న రోజుల్లో రాజుగారికి జరిగినంత గొప్పగా ఎక్కడైనా ఎవరికైనా మర్యాదలు జరుగుతున్నాయని భావించిన సందర్భాలలో ఈ జాతీయాన్ని ప్రయోగిస్తుంటారు. అచ్చంగా రాజుకు జరిగినట్టుగా కాకున్నా అందరిలా కాక మరికొంత ఎక్కువ మర్యాదలను ఎవరైనా అందుకుంటున్నప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు. 'ఆయనకు రాచమర్యాదలు చేసి మరీ గౌరవించారు. అందుకే వారంటే ఆయనకు అంత ఇష్టం' అనే లాంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంది.

[మార్చు] రాగాలు పెట్టడం

ఏడవడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. కొంతమంది ఏడ్చేటప్పుడు వారి బాధను వెళ్లగక్కుతూ మధ్యమధ్యలో రాగయుక్తంగా ఏడవడం కూడా జరుగుతుంటుంది. దాని ఆధారంగా ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. అంతేకానీ నిజానికి సంగీతంలో ఉండే రాగాలనన్నింటినీ ఆలపించడమనో, పాడడమనో అర్థంలోమాత్రం ఇది వాడుకలో లేదు. 'సినిమాకు మాతో రావద్దనేసరికి వాడు రాగాలు పెట్టడం ప్రారంభించాడు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

[మార్చు] రామరావణ యుద్ధం

పెద్దగొడవ అని, సుదీర్ఘకాలంపాటు జరిగే పోట్లాటలనే అర్థాలలో ఈ జాతీయం వాడుకలో ఉంది. శ్రీరాముడికి రావణుడికి జరిగిన పరమభీకరమైన యుద్ధాన్ని తలచుకుంటూ అంత తీవ్రస్థాయిలో గొడవ జరుగుతోందని తెలియజెప్పడమే ఈ జాతీయం లక్ష్యం. పౌరాణికాంశాలు, ఇతిహాసాల కథల నేపథ్యంలో ఇలాంటి జాతీయాలు వాడుకలోకి వచ్చాయి. 'నిన్న జరిగింది అంత సామాన్యమైన గొడవేమీకాదు. రామరావణ యుద్ధమే అనుకోండి' అనేలాంటి ప్రయోగాలలో ఈ జాతీయం కనిపిస్తుంది.

[మార్చు] రాక్షసుడు

దుర్మార్గుడు అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. సర్వసాధారణంగా రాక్షసులు ఎప్పుడూ మంచివారిని వేధిస్తుంటారు. చివరకు దేవతలను కూడా విడిచిపెట్టరు. అలాంటి తత్వంతో ఎవరైనా ప్రవర్తిస్తుంటే ఈ జాతీయంతో పోల్చిచెబుతుంటారు. 'వాడొట్టి రాక్షసుడని దగ్గరికెళ్లాకగానీ తెలిసిరాలేదు సుమా!' అనేలాంటి ప్రయోగాలు కనిపిస్తుంటాయి.

[మార్చు] రాక్షసానందం

ఎదుటివారు భయంతో బాధపడుతుంటే చూసి ఆనందించే నీచ స్వభావాన్ని ఈ జాతీయంతో సూచించటం కనిపిస్తుంది. రాక్షసుల దుర్మార్గవర్తనం, అనైతిక పద్ధతి లాంటివాటిని దృష్టిలో ఉంచుకొని ఈ జాతీయం అవతరించింది. "ఓ పక్క వాడు జారి కిందపడితే చూసి నవ్వటం రాక్షసానందం కాక మరేమిటి చెప్పు" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

[మార్చు] రావణ సంతతివాళ్లు

నాడు రావణుడు అసురుడై ఉండి ఎన్ని అధర్మాలు చేశాడో రామాయణం వివరించి చెబుతుంది. అంతటివాడి సంతతి కూడా చాలావరకు అలాంటి దుర్మార్గాలకే పాల్పడింది. ఆ రావణ సంతతి చేసిన దుర్మార్గాల్లాంటి దుర్మార్గాలనే ఇప్పుడు కూడా ఎవరైనా చేస్తూ కనిపించిన సందర్భంలో ఈ జాతీయాన్ని ప్రయోగిస్తుంటారు. "వాళ్లొట్టి రావణ సంతతి లాంటివాళ్లు. వాళ్లజోలికి ఎందుకు వెళ్లావు" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం గమనార్హం.

[మార్చు] రావణ దాడి

రామాయణంలోని ప్రతి నాయకుడు రావణుడు. ఎంత అధర్మంగా, అడ్డ దోవల్లో అనైతికంగా ప్రవర్తించాడో అందరికీ తెలిసిన విషయమే. అదే తీరులో ఎవరైనా ప్రవర్తిస్తున్నప్పుడు ఆ ప్రవర్తనను సూచించటానికి ఈ జాతీయాన్ని ప్రయోగించటం కనిపిస్తుంది. ఎవరైనా విచ్చలవిడిగా తిరుగుతున్నప్పుడు వారి ప్రభావానికి మరొకరు లోనుకావటాన్ని కూడా దీనితోనే సూచించటం ఉంది. 'విశ్వవిద్యాలయాల మీద రాజకీయ ప్రభావం రావణ దాడిలా ఉంది', 'అతడి ప్రవర్తన రావణ దాడి, దానిలో అతడిచుట్టూ ఉన్న వారంతా ప్రభావితమై పాడై పోతున్నారు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కన్పిస్తుంది.

[మార్చు] రాళ్లు వేయడం

విమర్శించడం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. పూర్వకాలంలో చెడుగా ప్రవర్తించిన వారి మీదకు రాళ్లను విసురుతూ శిక్షించడమనే పద్ధతి ఒకటుండేది. అంటే నడవాల్సిన రీతిలో కాక ధర్మవిరుద్ధంగానో, ఆచార విరుద్ధంగానో నడవడమనేది శిక్షార్హం. అలా ప్రవర్తిస్తే మాటపడాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే తమకు నచ్చని తీరులో పనిచేసినప్పుడు ఎవరైనా విమర్శిస్తుంటే 'జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే విన్నవాళ్లు రాళ్లు వేయగలరు సుమా', 'వాడికి ఎదుటివారు ఏం మాట్లాడినా రాళ్లు వేయడమే పని' అనే లాంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంది.

[మార్చు] రాలిపోవటం

మరణించటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. చెట్టునున్న కాయ రాలి కిందపడిందంటే ఇక కాయగా దానిజీవితం ముగిసినట్టే. ఇలాంటి భావన ఆధారంగా ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. చెట్టుకు కాయ వేలాడుతున్నంతసేపు దానిలో జీవం ఉన్నట్టేలెక్క. అది రాలి కిందపడిందంటే ఇక ఆ తర్వాత ఆ కాయ తన ఉనికిని కోల్పోయినట్టే. మనిషి బ్రతకటానికి ఆధారమైన ప్రాణం పోయినప్పుడు నిర్జీవుడై కిందపడిపోతాడు. అలాంటప్పుడు ఆయన రాలిపోయాడు అనటం వినిపిస్తుంది.

[మార్చు]

[మార్చు] లింగపోటు

జాతీయాలు కొన్ని సంప్రదాయాల నేపథ్యం నుంచి ఆవిర్భవించాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. శైవమతాన్ని ఆచరించేవారికి కొన్ని సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి. వాటిలో మెడలో శివలింగాన్ని ధరించడం కూడా ఒకటి. ఇలా ధరించిన ఓ భక్తుడి అనుభవం ఈ జాతీయ ఆవిర్భావానికి కారణమైంది. ఆ శివభక్తుడు ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు ఓ దొంగ కంటపడ్డాడు. ఆ దొంగ నుంచి తప్పించుకోవడానికి శివభక్తుడు పరుగు లంకించుకుని ఇల్లు చేరాడు. దొంగ బాధ నుంచి సురక్షితంగా ఇల్లు చేరాడు కానీ పరుగెత్తేటప్పుడు అతడి మెడలో ఉన్న శివలింగం అటూ ఇటూ ఊగుతూ బాగా బాధ కలిగించిందట. ఆ శివలింగాన్ని మెడలో వేసుకొనేటప్పుడు కానీ, ఆ తర్వాత కానీ శివభక్తుడు దాని దెబ్బ తనకు తగులుతుందని ఊహించలేదు. అనుకోనివిధంగా అతడు శివలింగపు దెబ్బతినాల్సి వచ్చింది. ఇలా అనుకోకుండా ఎప్పుడైనా ఎదురైన కష్టాలను గురించి చెప్పడానికి ఈ జాతీయాన్ని ప్రయోగిస్తుంటారు.

[మార్చు] లెక్కతీరిపోవడం

మరణించడం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. మనిషిగా పుట్టిన తరువాత ఈ లోకంలో చేయాల్సినవన్నీ దేవుడి ఆజ్ఞ మేరకు చేసినట్లు, ఆయన లెక్కకట్టిన విధంగా జీవించాల్సిన రోజులు గడిచిపోయాక మరణం ప్రాప్తిస్తుందనే భావన ఆధారంగా ఈ జాతీయం అవతరించింది. 'నిన్న రాత్రితో ఈ లోకానికి, ఆయనకు లెక్క తీరిపోయింది' అనేలాంటి సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

[మార్చు] లేవనెత్తడం

ప్రస్తావించడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. సాధారణంగా అయితే కిందపడిన వస్తువునో, మరి దేన్నైనా పైకి ఎత్తడం అనేది దీని అర్థం. అయితే జాతీయంగా ప్రయోగించేటప్పుడు... విస్మరించిన ఓ అంశాన్ని కానీ, ఎవరి దృష్టీ అంతగా పడని విషయాన్ని కానీ పదిమంది మధ్యలో ఉన్నప్పుడు అందరికీ తెలిసేలా చెప్పడం అనేది దీని అర్థం. 'ఆ నాయకుడు లోక్‌సభలో ఇదే విషయాన్ని లేవనెత్తి సంచలనం కలిగించాడు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.


[మార్చు] లేనిపోని తలనొప్పి

అనవసర ఇబ్బందులు అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. తలనొప్పి వచ్చినప్పుడు దాన్ని ఎవరు అనుభవిస్తుంటే వారికి ఆ బాధ తెలుస్తుంది. ఆ బాధ వల్ల చేయాల్సిన ఇతర పనులేవీ సక్రమంగా జరుగవు. అలాంటి తలనొప్పిని ఎవరూ కావాలని తెచ్చుకోరు. ఎందుకంటే జరగాల్సిన పనులు జరుగవు కనుక. ఇక్కడ తలనొప్పి అనేది లక్ష్యసాధనకు అవరోధమన్నది భావంగా తీసుకోవడం వల్ల ఇదొక జాతీయమైంది. ఇబ్బందులను, అడ్డంకులను కోరి మరీ తెచ్చుకున్నట్టుగా ఎవరైనా ప్రవర్తించిన సందర్భంలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. మనతోపాటు వాణ్ణి తీసుకువెళ్లడమంటే లేనిపోని తలనొప్పిని తెచ్చుకున్నట్టే అనేలాంటి సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

[మార్చు] లొట్టలేయడం

బాగా ఆనందించడం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. మనసుకు నచ్చిన, రుచికరమైన పదార్ధాలను, విషయాలను చూస్తున్నప్పుడు అసంకల్పితంగానే నోట్లో లాలాజలం ఊరడం, నాలుకను తాడించడం లాంటివి జరుగుతాయి. దేహసంబంధమైన ఈ చర్యల ఆధారంగానే ఈ జాతీయం ఆవిర్భవించింది. ఎంతో ఆనందంగా ఇష్టమైన పనిని ఎవరైనా చేస్తున్నప్పుడు... 'లొట్టలేసుకుంటూ తిన్నాడు..., లొట్టలేసుకుంటూ తిరుగుతున్నాడు' అనేలాంటి సందర్భాలలో ఈ జాతీయాన్ని ప్రయోగించడం కనిపిస్తుంది.

[మార్చు] లోకం తెలియనివాడు

అమాయకుడు అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. లోకంలో ఎవరు ఎలాంటి వారో తెలుసుకోలేకపోతే మోసపోవడం జరుగుతుంది. అలాంటివారిని ఉద్దేశించి ఈ జాతీయం వాడతారు. 'వాడంటే చిన్నవాడు, లోకం తెలియనివాడు. కానీ అన్నీ తెలిసిన నీవు కూడా ఇలా చేయడం బాగోలేదు' అనే లాంటి సందర్భాలలో ఈ జాతీయాన్ని ప్రయోగించడం కనిపిస్తుంది.

[మార్చు]

[మార్చు] వంపున మరదలు

ఇది తెలంగాణా గ్రామీణ ప్రాంతంలో వినిపించే జాతీయం. వంపున అనే పదానికి ఏకాంతం, లోపల, ఒంటరిగా అనే అర్థాలు ఉన్నాయి. స్థూలంగా ఈ జాతీయానికి ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే బాహ్యప్రపంచంలో ఒక రకంగాను, ఎవరూ లేనప్పుడు మరోరకంగాను దుర్మార్గ భావంతో ప్రవర్తించడమనే అర్థం ఉంది. పరస్త్రీని పదిమంది ముందూ సోదరిగా పిలుస్తూ, అలా భావిస్తున్నట్టు నటిస్తూ ఆమె ఏకాంతంగా దొరికినప్పుడు దుర్భుద్ధితో ఏ వ్యక్త్తెనా ప్రవర్తిస్తే ఈ జాతీయంతో సూచించడం కనిపిస్తుంది. 'వాడి పద్ధతే మంచిది కాదు. వంపున మరదలన్న తీరున ఉంటాడు జాగ్రత్త' అనే ప్రయోగాలున్నాయి.

[మార్చు] విభీషణుడు

ధర్మపాలన కోసం ఎంత త్యాగమైనా చేసేవాడు అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. పురాణాలు, ఇతిహాసాల్లోని కొన్ని ఆదర్శ పాత్రలు ఇలా జాతీయాలుగా మారాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఆనాడు విభీషణుడు తన అన్న రావణాసురుడు అధర్మంగా ప్రవర్తిస్తున్నాడని గ్రహించి తనవంతు బాధ్యతగా అతనికి చెప్పాల్సినదంతా చెప్పాడు. కానీ రావణుడు వినలేదు. ఇక చేసేదిలేక విభీషణుడు తన అన్న శత్రువైనప్పటికీ ధర్మ పరిపాలకుడైన రాముడి పక్షాన చేరాడు. ఇలాంటి పరిస్థితే ఎక్కడైనా ఎదురైనప్పుడు విభీషణుడి లక్షణాలున్న వ్యక్తిని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. "ఆయన్నేమీ తప్పు పట్టాల్సిన పనిలేదు. సాక్షాత్తూ విభీషణుడే సుమండీ!" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని ఉపయోగించడం గమనించవచ్చు.

[మార్చు] విషం చిమ్మడం

ద్వేషాన్ని ప్రదర్శించడం, కల్లోలం చేయడం అనే అర్థాల్లో ఈ జాతీయం వాడుకలో ఉంది. ఎవరిమీదకైనా విషం చల్లితే దాని ప్రభావంతో వారు అనేక బాధలకు గురవుతారు. ఈ భావన ఆధారంగా ఈ జాతీయం ఆవిర్భవించింది. ద్వేషం కూడా విషంలాంటిదేనన్న పోలికతో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. "పచ్చని బతుకుల్లో దుర్మార్గపు రాజకీయాలు విషం చిమ్మాయి" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం వాడుతుంటారు.

[మార్చు] విరగపడి చూడటం

చాలా ఆసక్తితో చూడటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఏ విషయాన్ని గురించైనా అమితంగా ఆసక్తిని ప్రదర్శిస్తూ ఆ విషయం జరిగిన చోటుకు చేరిన సందర్భంలో ఈ జాతీయాన్ని ప్రయోగించటం కనిపిస్తుంది. "ఆ సినిమాను జనమంతా విరగపడి చూస్తున్నారు. అంత గొప్పతనం దానిలో ఏముందో నాకైతే అర్ధం కావటంలేదు" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం ఉంది.

[మార్చు] వియ్యాలవారి కయ్యాలు

మిత్రపక్షాలవారి మధ్య వచ్చే తగాదా అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. వివాహాల సందర్భంలో వధువు పక్షంవారు, వరునిపక్షం వారు సంబంధం కలిసి వియ్యాలవారైనప్పుడు కొంత సరదా కోసం చిలిపి తగాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి పద్ధతిలోనే ఎక్కడైనా పోట్లాటలు, తగాదాలు సంభవించినప్పుడు వాటిని ఈ జాతీయంతో పోల్చిచెప్పడం కనిపిస్తుంది. 'ఆ గొడవలను అంతగా పట్టించుకోవల్సిన పనిలేదు. అవి వియ్యాలవారి కయ్యాలు మాత్రమే' అనేలాంటి సందర్భాల్లో ఈ ప్రయోగం కనిపిస్తుంది.

[మార్చు] వీపుమీద బాకు గుచ్చడం

వెన్నుపోటు లాంటిదే ఇది. నమ్మకద్రోహం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. ముందు మంచిగా నటిస్తూ వెనకనుంచి ఎవరైనా ద్రోహం తలపెట్టిన సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగించడాన్ని గమనించవచ్చు. "ఆయన తన పక్షంవారికే వీపుమీద బాకు గుచ్చి గెలిచాడు. అదీ ఓ గెలుపేనా" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

[మార్చు] వీధికెక్కడం

బయటపడడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. సాధారణంగా అభిప్రాయ భేదాలు వచ్చాయనే విషయం ప్రస్తావించినప్పుడు ఈ జాతీయాన్ని వాడడాన్ని గమనించవచ్చు. 'ఇరుపక్షాల మధ్య సమన్వయం కుదరకపోవడంతో ఇప్పుడు ఆ ఇద్దరూ వీధికెక్కారు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని ప్రయోగించడం కనిపిస్తుంది.

[మార్చు] వీరాభిమాని

వీరశబ్దం మితిమీరిన, అధికం అనే అర్ధాలలో వాడుకలో ఉన్న కారణంగా ఈ జాతీయం ఆవిర్భవించింది. అభిమానులు చాలా మంది ఉండొచ్చు. కానీ వారిలో మరింత అభిమానం ఉన్నవాడిని ప్రత్యేకంగా పేర్కొనటానికి ఈ జాతీయాన్ని ప్రయోగిస్తుంటారు. 'వాడు ఆయన వీరాభిమాని. ఆయన గురించి వాడి ముందు చెడుగా అనొద్దు సుమా' అనేలాంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం గమనార్హం.

[మార్చు] వీరభద్రుడు కావడం

అధికమైన కోపావేశాలతో ప్రవర్తించేవాడిని ఈ జాతీయంతో పోల్చిచెబుతుంటారు. వీరభద్రావతారం ఎత్తడం అనే రూపంలో కూడా ఈ జాతీయం వాడుకలో ఉంది. ఈ జాతీయం పురాణ కథల ఆధారంగా ఆవిర్భవించింది. పురాణాలలోని దక్షయజ్ఞ విధ్వంస సందర్భంలో ఈశ్వరుడి అనుజ్ఞ మేరకు దక్షుడు చేస్తున్న యజ్ఞాన్ని వీరభద్రుడు మహాభీకరంగా నాశనం చేశాడు. దక్షయజ్ఞం విధ్వంస సమయంలో శివుడు సృష్టించిన వీరభద్రుడు ఎంత ఉగ్రుడుగా ఉన్నాడో అంతటి ఉగ్రాన్ని ఎవరైనా ప్రదర్శిస్తున్నప్పుడు, ప్రకటిస్తున్నప్పుడు ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. 'తన గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే ఆయన వీరభద్రుడైపోతాడు', 'వాడు వీరభద్రుడిలాంటివాడు. వాడిజోలికి వెళ్ళొద్దు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం వాడడం కనిపిస్తుంది.

[మార్చు] వీరవిహారం చేయడం

విజయాలను ఎదురులేకుండా సొంతం చేసుకోవడం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. వీరుడు శత్రువులను జయిస్తూ ఆనందంగా ఎలా ముందుకు వెళతాడో అలాగే ఎవరైనా వెళ్ళిన ప్రతిచోటా విజయాలను సాధిస్తున్నప్పుడు ఈ జాతీయాన్ని వాడడం కనిపిస్తుంది. ఎక్కువగా పరీక్షలు, క్రీడల వంటి వాటిలో విజయం పొందుతున్నప్పుడు ఈ జాతీయాన్ని ప్రయోగిస్తుంటారు. 'ఈసారి జరిగిన క్రీడా పోటీలలో ఆ జట్టు వీర విహారం చేసింది' లాంటి ప్రయోగాలున్నాయి.

[మార్చు] వీధిన పడడం

అసహాయ స్థితికి చేరడమనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. అయిన వాళ్ళను, ఇల్లూ వాకిలిని అన్నిటినీ పోగొట్టుకున్న తర్వాత ఏదీ లేదనుకున్నప్పుడు వీధిలోనే గడపాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి దుర్భర అసహాయ స్థితి ప్రాప్తించిన సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. 'ఉద్యోగం పోవడంతో కుటుంబంతో సహా వాడు వీధిన పడాల్సిన పరిస్థితి వచ్చింది' అనే లాంటి సందర్భాల్లో ఈ జాతీయం తరచుగా వినిపిస్తుంది.

[మార్చు] వూపిరి పీల్చుకోవడం

వూరట చెందడం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. శ్వాస సక్రమంగా ఆడుతున్నప్పుడు ఎంతో హాయిగా ఉంటుంది. స్వచ్ఛమైన గాలి, వాతావరణంలో అలా వూపిరి ఆడుతూ ఉంటే ఆనందంగా ఉంటుంది. ఏ పనినైనా చేస్తున్నప్పుడు, చేసిన తరువాత ఇలాంటి ఆనందాన్ని పొందిన సందర్భాలలో ఈ జాతీయాన్ని ప్రయోగించడం కనిపిస్తుంది. 'ఇందాకటి దాకా వూపిరిపీల్చుకోవడానికి కూడా వీలు లేనంతగా పనిలో మునిగిపోయి ఇబ్బందిపడ్డాను. ఇప్పుడే కాస్త వూపిరి పీల్చుకుంటున్నాను' అనేలాంటి ప్రయోగాలున్నాయి.

[మార్చు] వెర్రితీగ తొక్కినట్టు

తెలంగాణా ప్రాంతంలో ఈ జాతీయం వినిపిస్తుంటుంది. వెర్రితీగ ఓ రకమైన మానసిక చంచలత్వాన్ని కలిగించే తీగగా చెబుతారు. ఆ తీగను తొక్కిన వ్యక్తికి మతిమరుపు సంభవిస్తుంది. తానెవరో ఏమిటో మరిచిపోయి ప్రవర్తిస్తుంటాడని అంటుంటారు. నిజానికి అలాంటి తీగను తొక్కినా, తొక్కకపోయినా అప్పటిదాకా మామూలుగా ప్రవర్తించిన వ్యక్తి మరో విధంగా ప్రవర్తిస్తుంటే ఈ జాతీయాన్ని ప్రయోగించడం కనిపిస్తుంది. 'ఇందాకటి దాకా బాగానే ఉన్నాడు. వెర్రితీగ తొక్కిండో ఏమో మన మాటే వినడంలేదు' అనే లాంటి సందర్భాలలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు. కొన్ని ప్రాంతాలలో ఈ తీగను మరులుతీగ అని వ్యవహరించడం కూడా ఉంది.

[మార్చు] వెన్నెముక

ప్రధానమైనది, ఆధారమైనది అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. మానవదేహంలో వెన్నెముకకు ఉన్న ప్రాధాన్యం ఆధారంగా ఈ జాతీయం అవతరించింది. 'దేశానికి రైతు వెన్నెముకలాంటివాడు' అనే సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

[మార్చు] వేరుకుంపట్లు పెట్టుకోవడం

అంతర్గత కలహాలతో విడిపోవడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. అంతా ఓ కుటుంబంగా కలిసి ఉన్నప్పుడు ఒకే పొయ్యిమీద వంట చెయ్యడం, అందరూ కలిసి తినడమనేది సహజం. కానీ ఆ ఇంటివారు విభేదాలతో విడిపోయినప్పుడు వేర్వేరుచోట్ల ఉంటూ వేర్వేరు కుంపట్లమీద వంట వండుకోవడం జరుగుతుంటుంది. ఇలాగే ఎవరైనా అప్పటిదాకా కలిసివుండి కారణాంతరాలవల్ల విడిపోయి వేర్వేరుగా ఉంటున్నప్పుడు ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. "అభిప్రాయ భేదాలొచ్చాయి, అందుకే ఆ నాయకులు విడిపోయి వేరు కుంపట్లు పెట్టుకున్నట్లు వ్యవహరిస్తున్నారు" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

[మార్చు] వేయికళ్లతో

అతిజాగ్రత్తగా పరిశీలించడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. మామూలుగా రెండుకళ్లతో సునిశితంగా పరిశీలిస్తేనే చాలా విషయాలు ఇట్టే తెలిసిపోతుంటాయి. అలాంటిది వేయికళ్లతో పరిశీలిస్తే ఏ విషయంలోని సారమైనా ఇట్టే అవగతమవుతుంది.


[మార్చు] వెయ్యికళ్లతో

అత్యంత జాగరూకతతో వ్యవహరించడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. మాములుగా ఉండే రెండు కళ్లు సవ్యంగా ఉంటేనే జాగ్రత్తగా గమనించడం జరుగుతుంది. అలాంటిది వేయి కళ్లుంటే దేన్నైనా అణువణువు పరిశీలించే శక్తి ఉంటుందన్న భావనే ఈ జాతీయం ఆవిర్భావానికి కారణం. ఈ జాతీయం రక్షణ వ్యవహారాలలో ఎక్కువగా ప్రయోగించడం కనిపిస్తుంది. వాస్తవంగా వెయ్యికళ్లతో చూడడం అసంభవమైనా, అంతగా కనిపెట్టుకుని ఉన్నారన్న విషయాన్ని చెప్పడానికి ఈ జాతీయాన్ని ప్రయోగిస్తుంటారు. 'వెయ్యికళ్లతో కాపలా కాసినా... వాడు చాకచక్యంగా తప్పించుకుని పారిపోగలడు'. 'దీన్ని ఇప్పటిదాకా వేయికళ్లతో కాపాడుతూ వచ్చాం. ఇకమీదట మీ ఇష్టం' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

[మార్చు] వేదవాక్కు

తప్పనిసరిగా ఆచరించి తీరాల్సింది అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. మనకు వేదాలు ప్రమాణాలు. అలాంటి వేదాలు చెప్పింది ఎవరైనా ఆచరించి తీరాల్సిందే అనే భావనతో ఈ జాతీయం అవతరించింది. అయితే ఇది ఒక వ్యక్తి మరో వ్యక్తి అదుపాజ్ఞలలో ఉన్నాడు, అతడు చెప్పిందల్లా చేస్తాడు అనే సందర్భాల్లో ఎక్కువగా ప్రయోగంలో కనిపిస్తోంది. 'అతడి మాటంటే ఇతడికి వేదవాక్కు' అనేలాంటి ప్రయోగాలు తరచుగా వినిపిస్తుంటాయి..

[మార్చు] వేరుకుంపటి

విడిపోయి ఎవరికి వారు స్వతంత్రంగా ఉండడం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. కలిసి ఉన్నప్పుడు ఒకే పొయ్యిమీద వండుకుని ఒక కుటుంబానికి చెందినవారంతా హాయిగా ఉండడం జరుగుతుంది. కారణాంతరాలవల్ల ఆ ఉమ్మడి కుటుంబం విడిపోయినప్పుడు ఎవరికివారు వేరుగా కుంపట్లు పెట్టుకుని ఎవరి వంట వారు వండుకుంటారు. ఈ భావన ఆధారంగా అప్పటిదాకా కలిసివున్న మిత్రులు విడిపోయిన సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. 'నిన్నటిదాకా కలిసివున్న ఆ నాయకులు వేరుకుంపటి పెట్టినట్లు కొత్తపార్టీలను పెట్టుకొని ప్రజలముందుకు వచ్చారు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

[మార్చు] వేడెక్కటం

ఉద్ధృతం కావటం అనే అర్ధంతో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. చల్లపడటం అంటే నిస్సారంగా, నిస్తేజంగా ఉండటం అనే అర్ధం అన్నట్లుగానే వేడిలో ఉంటే శక్తిని దృష్టిలో ఉంచుకొని విపరీతంగా చలనం కలిగినప్పుడు ఏ విషయాన్ని గురించైనా క్రియాశీలత ఎక్కువైనప్పుడు ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. ' పోలింగ్‌ తేదీ దగ్గర పడటంతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది' అని అనే లాంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది.

[మార్చు]

[మార్చు] శరాఘాతం

గట్టిదెబ్బ అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. తుపాకులు లాంటివి వాడుకలోకి రాకముందు దూరంగా ఉన్న లక్ష్యాన్ని సైతం గట్టిగా కొట్టడానికి బాణం ఉపకరించేది. ఆ భావన ఆధారంగానే ఈ జాతీయం అవతరించింది. మంచి విలుకాడు దూరం నుంచి బాణంతో లక్ష్యాన్ని చేధించిన విధంగా ఎవరైనా ఎదుటివారిని గట్టిదెబ్బ తీసిన సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. 'ప్రతిపక్షం వారి విమర్శ ప్రభుత్వానికి శరాఘాతమయ్యింది' అనే సందర్భంలో ఈ ప్రయోగం కన్పిస్తుంది.

[మార్చు] శీర్షాసనం వెయ్యడం

తారుమారు కావడం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. ఆసనాల ప్రక్రియలో శీర్షాసనం వేసేటప్పుడు తల కిందకు, కాళ్లు పైకి ఉండేలా ఆసనం వేస్తారు. అంటే కాళ్లు ఉండాల్సినచోట తల, తల ఉండాల్సినచోట కాళ్లు ఉంటాయి. దీని ఆధారంగా ఏ విషయమైనా తారుమారు అయినప్పుడు ఈ జాతీయం ప్రయోగించడం కనిపిస్తుంది. "ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ రాజకీయపక్షం పరిస్థితి శీర్షానమేసినట్త్లెంది" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ పయోగం కనిపిస్తుంది.



[మార్చు]

[మార్చు] షాక్‌ తినడం

దిగ్భ్రమ చెందడమనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. అన్యభాషా పదాలు మన భాషా పదాలకు జత కూడి జాతీయాలయ్యాయని చెప్పడానికి ఇదో ఉదాహరణ. 'ఆ వార్త వినగానే అతడు షాక్‌ తిన్నాడు' అనేలాంటి ప్రయోగాలు కనిపిస్తాయి.

[మార్చు]

[మార్చు] స్వస్తి పలకడం

ముగింపు చెప్పడమనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. సంప్రదాయకంగా ఏ పనైనా ముగించేటప్పుడు స్వస్తివాచకం చెప్పడం జరుగుతుంది. దాని ఆధారంగా ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. 'చదువులకు స్వస్తి చెప్పి వారంతా ఉద్యమంలోకి నడిచారు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం తరచుగా వినిపిస్తుంది.

[మార్చు] సంకెళ్లుతెగడం

అడ్డంకులు తొలగడం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. ఎంత బలవంతుడికైనా సంకెళ్లు వేస్తే ముందుకు నడవడానికి వీలు కుదరదు. అలాగే ఏదో ఒక కారణంతో చేసే పనికి ఎవరైనా అడ్డంకులు కల్పిస్తున్నప్పుడు ముందుకు సాగడం జరగదు. ఆ అడ్డంకులు తొలగినప్పుడు 'ఇన్నాళ్లూ నన్ను ఇబ్బంది పెట్టిన సంకెళ్లన్నీ తొలగిపోయాయి. ఇక నా పని నేను సులభంగా చేసుకుపోతాను' అనే లాంటి ప్రయోగాలు వినిపిస్తుంటాయి.

[మార్చు] సంకెళ్ళు వేయటం

సాధారణంగా దోషికి సంకెళ్ళు వేయటం అనేది అందరికీ తెలిసిందే. అయితే.. ఈ సంకెళ్ళు వేయటం అనేది జాతీయంగా వాడుతున్నప్పుడు నిరోధించటం అనే అర్థంలో ప్రయోగిస్తుంటారు. సంకెళ్ళు పడిన దోషి ఎలాగైతే ఎక్కడికీ కదలలేని స్థితి ఉంటాడో అలాగే దేన్నైనా.. కదలనివ్వని పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఈ జాతీయాన్ని ప్రయోగిస్తుంటారు. "ప్రభుత్వం చేస్తున్న ఈ పని సమాజ ప్రగతికి సంకెళ్ళు వేస్తున్న తీరుగా కనిపిస్తోంది" అనే సందర్భాల్లో దీన్ని గమనించవచ్చు.

[మార్చు] సంతలో చింతపండు

ప్రత్యేకత లేనిది అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. సంతలో అమ్మకానికి చాలాచోట్ల చింతపండు ఉంటుంది. ఒకచోట కాకపోతే మరొకచోట దాన్ని కొనుక్కోవచ్చు. ఆ చింతపండులో ప్రత్యేకత ఏదీ ఉండనంతవరకు అలా ఎక్కడైనా కొనుక్కోవచ్చని కొనుగోలుదారుడు భావిస్తాడు. ఈ భావన ఆధారంగానే అందరిలాగే ఉండి ప్రత్యేకంగా ఏ ప్రతిభ లేని వ్యక్తిని గురించి చెప్పాలనుకున్నప్పుడు " ఆ.. సంతలో చింతపండులాంటివాడు.. ఆయనగారికోసం అంతగా వెతకాలా ఏమిటి" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

[మార్చు] సందట్లో సమారాధన

అవకాశం చూసి తమపని నెరవేర్చుకోవడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. "ఆ విందుకు రావల్సిన నాయకులంతా వచ్చారు. సందట్లో సమారాధనలాగ మా శాసనసభ్యుడి దగ్గరకువెళ్లి నాకు కావలసిన పని అడిగి చేయించుకున్నాను" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

[మార్చు] సారథి

నాయకుడు అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. సారథ్యం వహించడమంటే ఓ రథాన్ని తోలుకువెళ్లడమని సాధారణ అర్థం. అయితే ఇలా జాతీయ రూపంలోకి వచ్చినప్పుడు ఓ విషయానికి లేదా కొంతమందికి నాయకత్వం వహించడమనే అర్థం కనిపిస్తుంది. 'ప్రస్తుతం ఆ రాజకీయపక్షం అతడి సారథ్యంలో ముందుకు సాగుతోంది' అనేలాంటి సందర్భాల్లో దీన్ని గమనించవచ్చు.

[మార్చు] సిగపట్లు

అభిప్రాయ భేదాలు అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. శిఖ అనే శబ్దం నుంచి సిగ వచ్చింది. సిగ అంటే జుట్టు, తల అనే అర్థాలు ఉన్నాయి. సిగ తరగ, సిగలోకి విరులిచ్చి... అనేలాంటి సందర్భాల్లో ఈ ప్రయోగం ఉంది. ఈ జాతీయం విషయానికి వస్తే జుట్టు జుట్టు పట్టుకొని తన్నుకొనేదాక వచ్చిందనేది అంతరార్థం. వాస్తవానికి అలా తన్నుకొన్నా తన్నుకోకపోయినా అభిప్రాయ భేదాలు ఎక్కువగా ఉన్న సందర్భాల్లో దీన్ని ప్రయోగిస్తుంటారు. "ఆ విషయం దగ్గరే ఇద్దరికీ సిగపట్లదాకా వచ్చింది" అనేలాంటి సందర్భాలు కనిపిస్తున్నాయి.

[మార్చు] సింహనాదం చేయడం

తీవ్రంగా విమర్శించడం, తిరుగుబాటు చేయడం అనేలాంటి అర్థాలలో ఈ జాతీయం వాడుకలో ఉంది. మామూలుగా అయితే సింహ శబ్దానికి అధికం, ఉన్నతం ఇలాంటి అర్థాలు ఉన్నాయి. నాదం (శబ్దం) సాధారణ స్థాయి కన్నా మరింత ఎక్కువగా చేస్తూ తిరుగుబాటుదారులే తమ నిరసనను వ్యక్తం చేస్తూ శబ్దం, అలజడి సృష్టిస్తుంటారు. ఈ భావన ఆధారంగా ఇది జాతీయమైంది. 'పాలకపక్షం తీరుపై ప్రతిపక్షం నిన్న సింహనాదం చేసింది' అనేలాంటి ప్రయోగాలు తరచుగా వినిపిస్తుంటాయి.

[మార్చు] సున్నా చుట్టడం

నిలిపివేయడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. చెయ్యాల్సిన పనులన్నిటినీ ఒక వరుసక్రమంలో రాసుకుని ఏది ముందు, ఏది వెనుక చేయాలి, దేన్ని చెయ్యకుండా వదిలేయాలి అని ఆలోచించేటప్పుడు చెయ్యకుండా వదిలేయాల్సిన పని దగ్గర సున్నా చుట్టడం ఓ అలవాటుగా చాలా మందిలో కనిపిస్తుంది. ఈ అలవాటును ఆధారం చేసుకుని ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. 'చెడు స్నేహాల ప్రభావంతో చదువుకు సున్నా చుట్టేసి అలా తయారయ్యాడు' అనేలాంటి ప్రయోగాలున్నాయి.


[మార్చు] సుడిగాలి పర్యటన

ఆకస్మిక పర్యటన అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. గాలి మాములుగా వీచే పద్ధతి వేరు. ఉన్నట్లుండి సుళ్లు తిరుగుతూ వచ్చి అంతలోనే వెళ్లి ఆగిపోవడమూ అప్పుడప్పుడూ జరుగుతుంటుంది. ఈ సుడిగాలి వచ్చిన తీరులోనే కొంతమంది నాయకులు పర్యటనలు జరుపుతుంటారు. సమయాభావం వల్ల ఎక్కడా ఎక్కువసేపు ఉండే వీలులేనప్పుడు ప్రముఖ నాయకులు అలా చేయడం జరుగుతుంటుంది. 'జిల్లాలో ముఖ్యమంత్రి సుడిగాలి పర్యటన జరిగింది' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

[మార్చు] సుదర్శన చక్రం

తిరుగులేనిది అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. శ్రీమహావిష్ణువు చేతిలోని చక్రాయుధానికి తిరుగులేదు. ఎంతటి బలవంతుడైన శత్రువునైనా సంహరించేస్తుంది. ఈ భావన ఆధారంగా ఎవరైనా తిరుగులేని అధికారాన్ని చెలాయిస్తున్న సందర్భంలోనో, ఎవరిమాటకైనా అధికమైన ప్రాధాన్యం ఉన్నప్పుడో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. 'ఆయన ఉత్తరం రాసిచ్చాడంటే అది సుదర్శన చక్రాయుధమే. ఎలాంటి పని అయినా అయితీరాల్సిందే' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.


[మార్చు] సూదిమొన మోపినంత

అత్యంత అల్పం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. సూదిమొన ఎంత సూక్ష్మంగా ఉంటుందో తెలిసిందే. అది మోపడానికి కావల్సినంత స్థలం అంటే ఎంతో ఊహించుకోవచ్చు. ఈ ఊహ ఆధారంగానే అత్యంత అల్పమైనది అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. "వాళ్ల నాన్న ఎకరం పొలం కాదుకదా సూదిమొన మోపినంత స్థలం కూడా ఇవ్వనని అంటున్నాడు" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

[మార్చు]

[మార్చు] హద్దు పద్దు లేకుండా

పెద్దా, చిన్నా బేధము లేకుండా

[మార్చు] హారతి కర్పూరం అయిపోవడం

సులభంగా ఖర్చైపోవడం, తొందరగా అయిపోవడం అనే అర్థాలలో ఈ జాతీయం వాడుకలో ఉంది. కర్పూరాన్ని హారతి కోసం వెలిగించినప్పుడు కలిగే స్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. ధనం, ఆస్తి తొందరగా ఖర్చైన సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు. 'ఆస్తంతా హారతి కర్పూరమైంది' అనేలాంటి ప్రయోగాలు ఉన్నాయి.

[మార్చు] హేమాహేమీలు

హేమాహేములు అనే రూపంగా కూడా కనిపించే ఈ జాతీయం అన్నింటా గొప్పవారు, సమర్థులు అనే అర్థంలో వ్యవహారంలో ఉంది. కొన్నిచోట్ల మోసగాళ్లనే అర్థంలో కూడా వాడడం జరుగుతోంది. ఇవి ఎవరైనా ఇద్దరికి సంబంధించిన పేర్లా? అసలీ హేమా హేముడు అనేవారు ఉన్నారా? వారివల్లనే ఈ జాతీయం వచ్చిందా? అనేవాటిని గురించి ఇంకా పండితలోకంలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఏదేమైనా కడు సమర్థులు, అందరికంటే గొప్పవారు అనే అర్థాల్లో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. 'వారికేమండీ హేమాహేమీలు, ఎలాంటి పనినైనా సాధించగలరు' అనేలాంటి ప్రయోగాలు గమనార్హం.

[మార్చు]

[మార్చు] క్ష

Static Wikipedia 2008 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2006 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu