తణుకు
వికీపీడియా నుండి
తణుకు మండలం | |
జిల్లా: | పశ్చిమ గోదావరి |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | తణుకు |
గ్రామాలు: | 8 |
జనాభా (2001 లెక్కలు) | |
---|---|
మొత్తము: | 140.181 వేలు |
పురుషులు: | 69.632 వేలు |
స్త్రీలు: | 70.549 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 82.40 % |
పురుషులు: | 86.02 % |
స్త్రీలు: | 78.82 % |
చూడండి: పశ్చిమ గోదావరి జిల్లా మండలాలు |
తణుకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము. దీనినే తారకాపురం , తారకాసుర పట్నం అని కూడా ఆంటారు.
విషయ సూచిక |
[మార్చు] పేరు పుట్టుక
స్థల పురాణాల ప్రకారం ప్రస్తుత తణుకు ప్రాతం అసురుల(రాక్షసులు) రాజైన తారకాసురుని రాజ్య రాజధానిగా చెప్పబడుచున్నది. పరిసర ప్రాంతాలలో ఈ కధనానికి సంబందించిన కొన్ని చారిత్రక ఆధారాలు కూడా లభ్యమవుచున్నాయి. అవి కొన్ని ఇక్కడ పొందు పరిచాము. ప్రస్తుత పాలంగి ఆ రోజులలో పూలంగి( పూల కొట్టు) గానూ, ప్రస్తుత చివటం గ్రామం శ్రీవతం(ఆర్ధిక కార్యకలాపాల కేంద్రం) గానూ, అప్పటి ధాన్యాగారమే ఇప్పటి వడ్లూరు గానూ, ఇప్పటి పైడిపర్రు అప్పటి స్వర్ణాగారం(బంగారం భద్రపరుచు ప్రాంతం) గానూ, బహుశా ఇప్పటి రేలంగి అప్పటి రత్నాల అంగడి గానూ భావిస్తారు.
ఈ తారకాసురుని సంహరించడానికి వీరభధ్రుడు దేవగణానికి సైన్యాధ్యక్షుడై వచ్చాడని ప్రతీతి. వీరిరువురి మధ్యన జరిగిన భీక యుద్దంలో కుమారస్వామి తారకాసురుని వధించిన తరువాత ఇంద్రునికి అల్లుడైనాడు. ఈ యుద్దం నుండే చాలా గ్రామాలకు పేరు స్తిర పడినట్లుగా చెబుతారు. కుమారస్వామి భూమిపై అడుగిడిన ప్రాంతాన్ని కుమరవరం గా, తణుకు సరిహద్దు గ్రామమైన వీరభధ్ర పురం వీరభధ్రుడికి విడిధి అని అలాగే దేవతలు విడిదియై ఉన్న గ్రామమం వేల్పూరు(వేల్పుల ఊరు, వేల్పులు = దేవతలు) గా పిలవబడుచున్నదని చెబుతారు.ఈ కథను బలపరిచే విధంగానే వేల్పూరు గ్రామమంలో ఎన్నో గుడులు(ఆలయాలు) ఉండడం మనము గమనించవచ్ఛు. ఈ ఆలయాల సంఖ్య 101 పైనే ఉన్నది.అలాగే ఇంద్రుడు విడిది చేసిన ప్రాంతాన్ని ఇల్లింద్రపర్రు గానూ అలాగే కావలిపురం, మహాలక్ష్మి చెఱువు మొదలైన గ్రామాల పేర్లు ఈ కథను బలపరిచేవిగానే కనపడుచున్నవి. ఇవన్నీ ఎలా ఉన్ననూ తణుకు యొక్క ప్రసస్థి పురాణాలలో కూడా ఉన్నట్లు పండితులు చెబుతారు. ఆదికవి నన్నయ ఇక్కడే యాగం చేసినట్లు చరిత్ర చెబుతోంది.
[మార్చు] భౌగోళికము
- తణుకు 16o 45' ఉ , 81o 42' తూర్పు అక్షాంశ , రేఖాంశముల మద్య వుంది.
[మార్చు] చరిత్ర
గోస్ధని నది పుణ్యజలధారల తో పునీతమైన తణుకు ప్రాంతంలొనే మహాభారతాన్ని ఆంధ్రికరించిన ఆది కవి నన్నయ్య యజ్ఞం చేసిట్టూగా చారిత్రక ప్రశస్థి వుంది.దీనిని బట్టి తణుకు ఫ్రాంతానికి కనీసం వెయ్యేళ్ళు చరిత్ర వున్నట్లు స్పష్టమవుతున్నది.మధ్యయుగాలలో,ఆధునిక యగంలో తణుకు ప్రసస్తి అనేక చోట్ల కన్పిస్తూవచ్చింది.వర్తమానంలో తణుకు ప్రాధాన్యం అంతర్జాతియ స్థాయిలో విన్పిస్తూవుంది.వ్యవసాయకంగాను, పారిశ్రామికంగాను,విద్య,వైద్య రంగాలలోను తణుకు ఎంతో అభివృద్ది చెందింది. తణుకు మండలానికి చెందిన మండపాక గ్రామం , వేల్పూరు గ్రామం రాజకీయ ఛైతన్యానికి మరియు ఆధునిక వ్యవసాయ పరిజ్ఞాన వినియోగానికి జిల్లా మొత్తంలొ ముందువరుసలొ వున్నాయి.
[మార్చు] తణుకు లో కవులు
- ఆది కవి నన్నయ్య
- దేవరకోండ బాలగంగాధరతిలక్
- ముదిగంటి జగ్గన్న శ్రాస్త్రి
- కళాప్రపూర్ణ పండిత పెనుమత్స సత్యనారాయణరాజు (తెలుగు రాజ)
- ఘండికోట సుబ్రహ్మణ్య శ్రాస్త్రి
- రసరాజు
- డా.వేదుల సూర్యనారాయణ శర్మ
- వేదుల సూరి
- పామర్తి రమణ
- డా.తంగిరాల సుబ్బారావు
- తాళ్లభట్టు పాపరాజు
- టి.వి.కె సోమయాజులు
- కొప్పర్తి వెంకటరమణమూర్తి
- పడాల సత్యనారాయణరెడ్డి
- సుశర్మ
- కోట లక్ష్మినరసింహ (శతావధాని)
- మొటమర్రి సూర్య కిరణ్
[మార్చు] తణుకు లో సాంస్కృతిక సేవా రంగాలు
- శ్రీ నన్నయ్య భట్టారక పీఠము
- స్త్రీ సమాజం
- రామకృష్ణ సేవాసమితి
- శ్రీ త్యాగరాజుస్వామి ఆరాధన ఉత్సవ సోసైటి
- రోటరీ క్లబ్ ఆఫ్ తణుకు
- తణుకు లయస్స్ క్లబ్
[మార్చు] పరిశ్రమలు
|
[మార్చు] విద్యాలయాలు
సంపూర్ణ అక్షరాస్యతకు మార్గదర్శి తణుకు
అక్షరాస్యతా వార్తలలో తణుకు పట్టణం ప్రత్యేక స్థానంలో వుంది. 2000 సెప్టెంబర్ 8న అక్షరయజ్ఞం పేరుతో సంపూర్ణ అక్షరాస్యతా ఉద్యమానికి ఈ పట్టణం శ్రీకారం చుట్టింది.2001 మార్చి 15న శాసనసభలో పాఠశాల విద్యాశాఖ మంత్రి సంపూర్ణ అక్షరాస్యతా సాధించిన తొలి పట్టణంగా తణుకును ప్రకటించారు. ఇప్పుడు నిర్బంధ ప్రాధమిక విద్యను ప్రవేశపెట్టడానికి తీర్మానించిన తొలి తెలుగు పట్టణంగా ముందుకు వచ్చింది.
- శతవసంతాల పాఠశాల జడ్.పి.బాలుర ఉన్నత పాఠశాల
- శ్రీమతి జాస్తి సీతామహాలక్ష్మి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల
- శ్రీ తిమ్మరాజు ఉన్నత పాఠశాల
- యస్.ఎం.వి.యం పాలిటిక్నిక్
- అంద్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జిల్ల పరిషత్ ఉన్నత పాఠశాల
- శ్రీ చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ గవర్నమెంటు డిగ్రీ కళాశాల
- ఎస్.ఎన్.వి.టి ప్రభుత్వ జూనియర్ కళాశాల
- శ్రీమతి కొండేపాటి సరోజినిదేవి మహిళా కళాశాల
- మున్సిపల్ పాఠశాలలు
- భారతీ విద్యాలయం
- శశి విద్యాసంస్థలు
- గురజాడ విద్యానికేతన్
[మార్చు] సినిమాథియేటర్లు
- శ్రీ వీరనారాయణ
- శ్రీ శ్రీనివాసా
- వెంకటకృష్ణా
- లక్ష్మి
- పద్మశ్రీ
- శ్రీచిత్ర
- వెంకటేశ్వర
- నరేంద్ర
- మినీ నరేంద్ర
- ప్రత్యూష
- మినీ ప్రత్యూష
- వెంకట్రామయ్య
- ప్రసాద్
[మార్చు] తణుకు చిత్రపటం
[మార్చు] వికిమాపియా లో తణుకు
[మార్చు] బయటి లింకులు
[మార్చు] మండలంలోని పట్టణాలు
- tanuku (m+og)
- tanuku (m)
[మార్చు] గ్రామాలు
[మార్చు] పశ్చిమ గోదావరి జిల్లా మండలాలు
జీలుగుమిల్లి | బుట్టాయగూడెం | పోలవరం | తాళ్ళపూడి | గోపాలపురం | కొయ్యలగూడెం | జంగారెడ్డిగూడెం | టి.నరసాపురం | చింతలపూడి | లింగపాలెం | కామవరపుకోట | ద్వారకా తిరుమల | నల్లజర్ల | దేవరపల్లి | చాగల్లు | కొవ్వూరు | నిడదవోలు | తాడేపల్లిగూడెం | ఉంగుటూరు | భీమడోలు | పెదవేగి | పెదపాడు | ఏలూరు | దెందులూరు | నిడమర్రు | గణపవరం | పెంటపాడు | తణుకు | ఉండ్రాజవరం | పెరవలి | ఇరగవరం | అత్తిలి | ఉండి | ఆకివీడు | కాళ్ళ | భీమవరం | పాలకోడేరు | వీరవాసరము | పెనుమంట్ర | పెనుగొండ | ఆచంట | పోడూరు | పాలకొల్లు | యలమంచిలి | నరసాపురం | మొగల్తూరు