పాలకొల్లు
వికీపీడియా నుండి
పాలకొల్లు మండలం | |
జిల్లా: | పశ్చిమ గోదావరి |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | పాలకొల్లు |
గ్రామాలు: | 16 |
జనాభా (2001 లెక్కలు) | |
---|---|
మొత్తము: | 126.3 వేలు |
పురుషులు: | 63.327 వేలు |
స్త్రీలు: | 62.973 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 81.45 % |
పురుషులు: | 86.61 % |
స్త్రీలు: | 76.30 % |
చూడండి: పశ్చిమ గోదావరి జిల్లా మండలాలు |
పాలకొల్లు (palakol, palakollu), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము, చిన్న పట్టణము. పాలకొల్లు చుట్టుప్రక్కల భూములు సారవంతమైనవి. ఊరిచుట్టూ పచ్చని వరిచేలు, కొబ్బరితోటలు, చేపల చెరువులు కనిపిస్తాయి.
పాలకొల్లు నుండి నరసాపురం పట్టణానికి 10 కి.మీ. దూరం. పాలకొల్లుకు 7 కి.మీ. దూరంలో చించినాడ వద్ద "వశిష్టగోదావరి" నదిపై కట్టిన వంతెన తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలను కలుపుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 పుణ్యక్షేత్రాలలో పాలకొల్లు ఒకటి. ప్రసిద్ధ క్షీరరామలింగేశ్వరస్వామి గుడి ఇక్కడే ఉంది. క్షీరం అంటే పాలు. ఆ పేరుమీదుగానే పట్టణానికి పాలకొల్లు అనే పేరు వచ్చింది. స్థల పురాణం ప్రకారం ఒకప్పుడు శివుడు ఇక్కడ బాణం వేస్తే భూమిలోంచి పాలు ఉబికివచ్చాయి. పాలకొల్లును పూర్వము పలకొలను అని పిలిచేవారు. ఇక్కడి మందిరాన్ని చాళుక్యుల కాలంలో, 10 - 11 శతాబ్దులలో, నిర్మించారు. ఈ గుడి గోపురం 9 అంతస్తులతో 125 అడుగుల ఎత్తుతో దర్శనమిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎత్తయిన గోపురాలలో ఇది ఒకటి.
పాలకొల్లులో "అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి" మందిరం కూడా ఉంది. ఇక్కడి బ్రహ్మోత్సవం వూళ్ళో ఒక పెద్ద పండుగ. ఈ మందిరంలో ధనుర్మాసంలో జరిపే ప్రత్యేక పూజలు కూడా ప్రసిద్ధం.
పాలకొల్లునుండి 20 కి.మీ. దూరంలో ఉన్న "నత్త రామేశ్వరం" మందిరం కూడా చూడదగినది. ఇక్కడ శివలింగం ఆలిచిప్పలు, శంఖాలతో చేయబడింది.
విషయ సూచిక |
[మార్చు] మరికొన్ని విశేషాలు
- పాలకొల్లుకు చెందిన కొందరు వ్యక్తులు సినీరంగంలో బాగా రాణించారు. చిరంజీవి, దాసరి నారాయణ రావు, కోడి రామకృష్ణ్ణ, చలం, వాకాడ అప్పారావు, రేలంగి నరసింహారావు అటువంటివారు.
- మాండొలిన్ వాయిద్యంపై సంగీతాన్ని పలికించడంలో చిన్నతనంలోనే పేరుపొందిన యు.శ్రీనివాస్ జన్మ స్థానం పాలకొల్లు.
- తెలుగులో గజల్ సంగీత, కవితా ప్రక్రియలకు మంచి ప్రజాదరణ తెచ్చిన గజల్ శ్రీనివాస్ కూడా పాలకొల్లు వాడు.
- నరసాపురంతో బాటు పాలకొల్లు కూడా "లేసు"లకు ప్రసిద్ధం.
[మార్చు] మండలంలోని పట్టణాలు
- పాలకొల్లు
[మార్చు] గ్రామాలు
- అగర్రు
- ఆరట్లకట్ల
- బల్లిపాడు
- చందపర్రు
- చింతపర్రు
- దగ్గులూరు
- దిగమర్రు
- గొరింటాడ
- కాపవరం
- లంకలకోడేరు
- పాలమూరు
- పెదమామిడిపల్లె
- శివదేవునిచిక్కల
- తిల్లపూడి
- వరిధనం
- వెలివెల
[మార్చు] పశ్చిమ గోదావరి జిల్లా మండలాలు
జీలుగుమిల్లి | బుట్టాయగూడెం | పోలవరం | తాళ్ళపూడి | గోపాలపురం | కొయ్యలగూడెం | జంగారెడ్డిగూడెం | టి.నరసాపురం | చింతలపూడి | లింగపాలెం | కామవరపుకోట | ద్వారకా తిరుమల | నల్లజర్ల | దేవరపల్లి | చాగల్లు | కొవ్వూరు | నిడదవోలు | తాడేపల్లిగూడెం | ఉంగుటూరు | భీమడోలు | పెదవేగి | పెదపాడు | ఏలూరు | దెందులూరు | నిడమర్రు | గణపవరం | పెంటపాడు | తణుకు | ఉండ్రాజవరం | పెరవలి | ఇరగవరం | అత్తిలి | ఉండి | ఆకివీడు | కాళ్ళ | భీమవరం | పాలకోడేరు | వీరవాసరము | పెనుమంట్ర | పెనుగొండ | ఆచంట | పోడూరు | పాలకొల్లు | యలమంచిలి | నరసాపురం | మొగల్తూరు