పోర్‌బందర్
వికీపీడియా నుండి
పోర్‌బందర్ ఉచ్ఛారణ భారత దేశము యొక్క గుజరాత్ రాష్ట్రములోని ఒక తీరప్రాంతపు పట్టణము. జాతిపిత మహాత్మా గాంధీ జన్మ స్థలము. ఇది పోర్‌బందర్ జిల్లా ముఖ్య పట్టణము.
పోర్‌బందర్ అన్న పేరు పోరై మరియు బందర్ అను రెండు పదాల కలయిక. పోరై", స్థానిక దేవత పేరు. బందర్ అనగా రేవు అని అర్ధం. కలిసి పోర్‌బందర్ అనగా పోరై యొక్క రేవు అని అర్ధం. చాలా చారిత్రక మూలల ఆధారముగా ఈ ప్రాంతము 10 వ శతాబ్దములో 'పౌరవెలకుల్' గా పిలవబడేదని తెలుస్తున్నది. ఈ ప్రాచీన నామమును పోరై తెగ యొక్క భూమి అని అనువదించవచ్చు. హిందూ పురాణాలలో ఈ పట్టణము శ్రీకృష్ణుని ప్రియ మిత్రుడు, సహాధ్యాయి అయిన సుధాముని స్వస్థలముగా పేర్కొనబడినది. ఈ వృత్తాంతముతో పట్టణము సుధామపురి అని కూడా పేరొందినది.
భారత దేశ పశ్చిమాత్య భాగములో ఉన్న పోర్‌బందర్ అరేబియా సముద్రము పై అన్ని ఋతువులలో పనిచేసే ఓడరేవు. 2001 జనాభా లెక్కల ప్రకారము ఈ పట్టణములో లక్షన్నరకు పైగా జనాభా కలదు. మహాత్మా గాంధీ తో ఉన్న అనుబంధము వలన ప్రస్తుతము పోర్‌బందర్ ఒక యాత్రా ప్రదేశమైనది. ఇక్కడ ఒక విమానాశ్రయము, రైల్వే స్టేషను కలవు. ఇక్కడి లోతు సముద్ర రేవు 20వ శతాబ్దపు చివరి పావు భాగములో నిర్మించబడినది.