ఐ.ఎస్.జగన్నాధపురం
వికీపీడియా నుండి
ఐ.ఎస్.జగన్నాధపురం, పశ్చిమ గోదావరి జిల్లా, ద్వారకా తిరుమల మండలానికి చెందిన గ్రామము .
ఇక్కడ మెరకతోటల వ్యవసాయం జరుగుతుంది. ఈ వూరికి, ప్రక్క వూరు ఐ.ఎస్.రాఘవాపురంకు మధ్య "నృసింహగిరి" అనే కొండమీద నరసింహ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలోని స్వామి "భూతనరసింహ స్వామి". నరసింహుని సరసన కనకవల్లి (మహాలక్ష్మి) అమ్మవారున్నారు. ఆలయం ఎదురుగా పంచముఖ ఆంజనేయ స్వామి, ప్రక్కన ఏకాక్షర గణపతి, వెనుక సర్ప శ్రీనివాసులను ప్రతిష్టించారు.
కొండపైకి కచ్చా రోడ్డు ఉన్నది. దగ్గరలో ఏమీ సదుపాయములు లేవు. కనుక భక్తులు తమకు కావలసిన సంబారాలను తమతో తెచ్చుకోవడం మంచిది. ఆలయంలో స్వామిని దర్శించుకొంటే సకల శుభాలు కలుగుతాయని, ఆరోగ్యం చేకూరుతుందని భక్తుల నమ్మకం. పెళ్ళికావలసిన ఆడుపిల్లలకోసము, పిల్లలు లేని దంపతుల కోసం ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేస్తారు.
ఈ ఆలయం ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారి అజమాయిషీలో నిర్వహింపబడే ఒక ఆలయం.
వనరులు
- భండారు పర్వతాలరావు రచించిన "ఓం నమో శ్రీ నారసింహాయ" - (ప్రచురణ: శ్రీ వేదభారతి, హైదరాబాదు)