గుమ్మడిదల
వికీపీడియా నుండి
గుమ్మడిదల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని మెదక్ జిల్లాకు చెందిన ఒక చిన్న పట్టణము. ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 40 కిలోమీటర్ల దూరములొ ఉన్నది. ఈ పట్టణము కాకతీయుల నాటినుండి ఉన్నది. గుమ్మడిదలలో అనేక దేవాలయాలు కలవు వాటిలో రామాలయము, శివాలయము మరియు దగ్గరిలోని బొంతపల్లి లో కల వీరభద్రస్వామి ఆలయము చెప్పుకోదగినవి.
గుమ్మడిదల, హైదరాబాదు శివారు ప్రాంతము అయినందున గత రెండు దశాబ్దాలలో అనేక రసాయన పరిశ్రమలు మరియు ఇతర పరిశ్రమలు యేర్పడి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఉపాధి కలుగజేస్తున్నాయి.
గుమ్మడిదలలో అనేక రకాల పంటలు పండిస్తారు. వరి మరియు జొన్న ముఖ్య పంటలైనప్పటికీ పత్తి, జొన్న, ప్రొద్దుతిరుగుడు, టమాట, పచ్చిమిర్చి, వంకాయలు, కాకరకాయలు మొదలైన అనేక ఇతర పంటలు కూడా పండిస్తారు. హైదరాబాదుకు సరఫరా అయ్యే టమాటలలో ముఖ్యభాగము ఇక్కడే పండిస్తారు. జిల్లాలో "ఉత్తమ రైతు" బహుమతి పొందడము ఇక్కడి రైతులకు పెద్ద విశేషమేమీ కాదు. పంటలకు నీటికై ఋతుపవనాల మీద ఆధారపడినప్పటికీ గుమ్మడిదల రైతులు అనేక విన్నూత వ్యవసాయ పద్ధతులను అవలంభించి మంచి పలితాలను పొందుతున్నారు.
గుమ్మడిదల నుండి నర్సాపూర్ వరకు విస్తరించి ఉన్న దట్టమైన అడవి తెలుగు సినిమా పరిశ్రమకు ఒక మంచి షూటింగ్ స్పాట్గా ప్రాచుర్యము పొందినది.
భారతదేశములో కెళ్లా మొదటిదైన గ్రామీణ సమాచార కేంద్రము, ఇండియన్ ఫార్మర్స్ అండ్ ఇండస్ట్రీస్ అలయన్స్ (IFIA) మరియు ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోషియేషన్ (FFA) సమ్యుక్తముగా రూపొందించి అభివృద్ధి చేసిన తేజస్ సమాధాన కేంద్ర లేదా జనరల్ రిసోర్సెస్ అండ్ ఇంఫర్మేషన్ డిస్సెమినేషన్ (గ్రిడ్) సెంటర్ యొక్క తొలి కేంద్రమును జూలై 13, 2004 న గుమ్మడిదలలో ప్రారంభించారు. గుమ్మడిదల, మెదక్ జిల్లా, జిన్నారం మండలానికి చెందిన గ్రామము
ఈ పేజీ ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు అనే ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది. దీనిని బహుశా ఒక బాటు నిర్మించి ఉండవచ్చు. ఇక్కడ ఇదేపేరుతో ఉన్న అనేక గ్రామాల సమాచారము ఉండవచ్చు లేదా ఇదివరకే కొంత సమాచారము ఉండి ఉండవచ్చు. పరిశీలించి అయోమయ నివృత్తి పేజీలు తయారుచేసి లేదా ఇదివరకున్న సమాచారముతో విలీనము చేసి ఈ మూసను తొలగించండి. |