రఘునాథపాలెం
వికీపీడియా నుండి
రఘునాథపాలెం భారతదేశంలోని , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము నందలి, ఖమ్మం జిల్లాలోని ఖమ్మం (అర్బన్) మండలమునకు చెందిన ఓ గ్రామము. ఈ గ్రామము ఖమ్మం నుంది ఇల్లందు వెళ్ళు రహదారిలో ఐదు కిలోమీటర్ల తరువాత ఉన్నది.
[మార్చు] చరిత్ర
ఇక్కడి వారి నుండి విన్న ప్రకారం: పూర్వం స్వాతంత్ర్యానికి ముందు నిజాం పరిపాలనలో రఘునాథ నాయకుడు అనే అతను ఈ ప్రాంతములోని భూమిని వేలం వేసి ఇతరులకు అప్పగించినాడనీ, తద్వారా వివిద కుటుంబాలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నాయని అతని పేరు మీదగానే ఈ గ్రామానికి రఘునాథ పాలెం అనే పేరు వచ్చినది అని ప్రశస్తి.
[మార్చు] 2001 జనాభా లెక్కలు
- మొత్తం గృహాల సంఖ్య = 1,055
- మొత్తం జనాభా = 4,303
- అక్షరాస్యులు = 1,802
- స్త్రీ,పురుష నిష్పత్తి = 948
- స్త్రీ, పురుష నిష్పత్తి(0-6 సంవత్సరాలు) = 901
(ఆధారం: భారత సెన్సెస్ బ్యూరో సీడీ )
[మార్చు] విశేషాలు
- ఇక్కడ సాయిబాబా గుడి చుట్టు పక్కల ప్రాంతాలలో ప్రసిద్ది వహించినది
- ఈ గ్రామమున ఓ శివాలయం కలదు
- ఇంకా ఓ బాలాంజనేయస్వామి దేవాలయం కలదు
- ఇక్కడ నాగులకుంట, కోలకుంట, నర్సింహ చెరువు, కొంగేటి చెరువు అని నాల్గు చెరువులు ఉండి వ్యవసాయంలో ప్రముక పాత్ర వహిస్తున్నాయి
నల్గొండ జిల్లా, మట్టంపల్లి మండలానికి చెందిన ఇదేపేరుగల గ్రామము కోసం రఘునాథపాలెం(మట్టంపల్లి మండలం) చూడండి.