రామరాజభూషణుడు
వికీపీడియా నుండి
రామరాజభూషణుడు గా పేరుగాంచిన భట్టుమూర్తి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములోని అష్టదిగ్గజాలలో ఒకడు. ఈయన 16వ శతాబ్దము కు చెందిన తెలుగు కవి మరియు సంగీత విద్వాంసుడు. ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు అళియ రామరాయల ఆస్థానమునకు ఆభరణము వలె ఉండటము వలన ఈయనకు రామరాజభూషణుడు అని పేరు వచ్చినది.
నెల్లూరు ప్రాంతమునకు చెందిన భట్టుమూర్తి వసుచరిత్ర, హరిశ్చంద్ర, నలోపాఖ్యనము మరియు నరసభూపాళీయము అని కావ్యములను రచించినాడు. వీటన్నిటిలో వసుచరిత్ర చాలా ప్రసిద్ధమైనది. ఇందులోని శ్లేష ప్రయోగము ప్రశంసనీయము. ఆ తరువాత కాలములో వచ్చిన చేమకూరి వెంకటకవి భట్టుమూర్తి శైలిని అనుకరించాడు.
[మార్చు] బయటి లింకులు
అష్టదిగ్గజములు |
---|
అల్లసాని పెద్దన | నంది తిమ్మన | ధూర్జటి | మాదయ్యగారి మల్లన | అయ్యలరాజు రామభధ్రుడు | పింగళి సూరన | రామరాజభూషణుడు | తెనాలి రామకృష్ణుడు |