మహా భారతము
వికీపీడియా నుండి
మహాభారతం ఒక ఇతిహాసము. దీనిని వేదవ్యాసుడు సంస్కృతములో రచించెను. 18 పర్వములతో, లక్ష శ్లోకములతో (74,000ల పద్యములతో లేక సుమారు 18 లక్షల పదములతో) ప్రపంచము లోని అతి పెద్ద పద్య కావ్యములలొ ఒక్కటిగ అలరారుచున్నది. ఈ మహాకావ్యాన్ని "కవిత్రయము"గా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రన అనే కవులు అద్భుతంగా తెనుగులో వ్రాశారు.
విషయ సూచిక |
[మార్చు] కావ్య ప్రశస్తి
మహాభారతాన్ని "పంచమవేదము" అని కూడా గౌరవిస్తారు. "యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్" - "ఇందులో ఏది ఉందో అదే ఇతరత్రా ఉంది. ఇందులో లేనిది మరెక్కడా లేదు" అని ప్రశస్తి పొందింది. హిందువులకు ఎంతో పవిత్రరచనలైన భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రము కూడా మహాభారతంలోని భాగాలే. దీనిని బట్టి ఈ కావ్య విశిష్టతను అంచనా వేయవచ్చును.
ఈ కావ్యవైభవాన్ని నన్నయ ఇలా చెప్పాడు:
దీనిని ధర్మ తత్వజ్ఞులు ధర్మశాస్త్రమనీఈ, ఆధ్యాత్మవిదులు వేదాంతమనీ, నీతి విచక్షణులు నీతి శాస్త్రమనీ, కవులు మహాకావ్యమనీ అంటారు. లాక్షణికులు సర్వ లక్ష్యసంగ్రహమనీ, ఐతిహాసికులు ఇతిహాసమనీ, పౌరాణికులు బహుపురాణ సముచ్చయమనీ కొనియాడుతారు. వివిధ తత్వవేది, విష్ణు సన్నిభుడు ఐన వేదవ్యాసుడు వేదవ్యాసుడు దీనిని విశ్వజనీనమయ్యేలా సృజించాడు.
[మార్చు] మహాభారతంలోని విభాగాలు
మహాభారతంలోని విభాగాలను "పర్వాలు" అంటారు. మొత్తం 18 పర్వాలలో కధాక్రమం క్రింద ఈయబడింది.
- ఆది పర్వము: 1-19 ఉపపర్వాలు - పీఠిక, కురువంశం కధ, రాకుమారుల జననం, విద్యాభ్యాసం .
- సభా పర్వము: 20-28 ఉపపర్వాలు - కురుసభా రంగం, మయసభ, పాచికల ఆట, పాండవుల ఓటమి, రాజ్యభ్రష్టత.
- వన పర్వము (లేక) అరణ్య పర్వము: 29-44 ఉపపర్వాలు - అరణ్యంలో పాండవుల 12 సంవత్సరాల జీవనం.
- విరాట పర్వము: 45-48 ఉపపర్వాలు - విరాటరాజు కొలువులో ఒక సంవత్సరం పాండవుల అజ్ఞాతవాసం.
- ఉద్యోగ పర్వము: 49-59 ఉపపర్వాలు - కౌరవ పాండవ సంగ్రామానికి సన్నాహాలు.
- భీష్మ పర్వము: 60-64 ఉపపర్వాలు - భీష్ముని నాయకత్వంలో సాగిన యుద్ధం.
- ద్రోణ పర్వము 65-72 ఉపపర్వాలు - ద్రోణుని నాయకత్వంలో సాగిన యుద్ధం.
- కర్ణ పర్వము: 73 వ ఉపపర్వము - కర్ణుని నాయకత్వంలో సాగిన యుద్ధం.
- శల్య పర్వము: 74-77 ఉపపర్వాలు - శల్యుడు సారధిగా సాగిన యుద్ధం.
- సౌప్తిక పర్వము: 78-80 ఉపపర్వాలు - నిదురిస్తున్న ఉపపాండవులను అశ్వత్థామ వధించడం.
- స్త్రీ పర్వము: 81-85 ఉపపర్వాలు - గాంధారి వంటి స్త్రీలు మరణించినవారికై రోదించడం.
- శాంతి పర్వము: 86-88 యుధిష్ఠిరుని రాజ్యాభిషేకం. భీష్ముని ఉపదేశాలు.
- అనుశాసన పర్వము: 89-90 ఉపపర్వాలు - భీష్ముని చివరి ఉపదేశాలు (అనుశాసనాలు)
- అశ్వమేధ పర్వము: 91-92 ఉపపర్వాలు - యుధిష్ఠిరుని అశ్వమేధ యాగం.
- ఆశ్రమవాసిక పర్వము: 93-95 ఉపపర్వాలు - ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి ప్రభృతులు చివరి రోజులు ఆశ్రమవాసులుగా గడపడం.
- మౌసల పర్వము: 96వ ఉపపర్వం - యదువంశంలో ముసలం, అంతఃకలహాలు.
- మహాప్రస్ధానిక పర్వము: 97వ ఉపపర్వం - పాండవుల స్వర్గ ప్రయాణం ఆరంభం.
- స్వర్గారోహణ పర్వము:98వ ఉపపర్వం - పాండవులు స్వర్గాన్ని చేరడం.
హరివంశ పర్వము: శ్రీకృష్ణుని జీవితగాధ
[మార్చు] తెలుగు సినిమాలలో భారతగాధ
మహాభారత కధ ఇతివృత్తంగా ఎన్నో తెలుగు సినిమాలు వెలువడ్డాయి. పౌరాణిక ఇతివృత్తాలను తెరకెక్కించడంలో తెలుగువారికున్న నైపుణ్యం కారణంగా వాటిలో చాలా సినిమాలు చిరస్థాయిగా జనాదరణ పొందాయి. వాటిలో కొన్ని.
- మాయాబజార్
- పాండవ వనవాసం
- శ్రీకృష్ణపాండవీయం
- నర్తనశాల
- విరాటపర్వం
- కురుక్షేత్రం
- దానవీరశూరకర్ణ
- భీష్మ
- బాలభారతం
[మార్చు] బయటి లింకులు
- ఆన్‌లైన్ మహాభారత గ్రంధం
- అనువాదం, కధలు, నీతులు
- మహాభారతం పురాతన గ్రంధం
- [1] (transliterated) at అనువాదం
- [2] అనువాదం Internet Sacred Text Archive
- కిసారి మోహన్ గంగూలి అనువాదం
- మహాభారతం గురించిన వ్యాసాలు
- సుభాష్-కక్ వ్యాసం (pdf)
- మహాభారత యుధ్ధకాల నిర్ణయం
- మహాభారతం గురించి వివేకానందుడు
- భారతం గూర్చి వి.ఎమ్.బ్లేక్
- వినండి (ఆడియో)
- ఇంకా కొన్ని వనరులు
- HinduWiki.Com హిందూమతం గురించి వికీ
- Reading Suggestions J. F. Fitzgerald, University of Tennessee
- Clay Sanskrit Library
- భారతాన్ని గూర్చి వనరులు