లీపు సంవత్సరము
వికీపీడియా నుండి
ఒక కాలెండరు సంవత్సరంలో అదనంగా ఒక రోజు గానీ లేక ఒక నెల గాని అదనంగా ఉంటే, దానిని లీపు సంవత్సరం అంటారు. ఖగోళ సంవత్సరంతో, కాలెండరు సంవత్సరానికి వచ్చే తేడాను సరిచేయడానికి లీపు సంవత్సరాన్ని అమలుచేసారు. ఖగోళ సంవత్సరంలో ఘటనలు ఖచ్చితంగా ఒకే వ్యవధిలో పునరావృతం కావు. కాబట్టి ప్రతి ఏడూ ఒకే సంఖ్యలో రోజులుండే కాలెండరు, ఖగోళ ఘటనలను సరిగా ప్రతిఫలించక, ఏళ్ళు గడిచే కొద్దీ తేడాలు చూపిస్తూ ఉంటుంది. సంవత్సరంకు అదనంగా ఒక రోజునో లేక ఒక నెలనో చేర్చి ఈ తేడాను నివారించవచ్చు. లీపు సంవత్సరం కానిదానిని సాధారణ సంవత్సరం, లేదా మామూలు సంవత్సరం అంటారు.