వికీపీడియా:సహాయ కేంద్రం
వికీపీడియా నుండి
కొత్త సభ్యులకు: వికీని త్వరగా అర్థం చేసుకునేందుకు 5 నిమిషాల్లో వికీ పేజీని చూడండి. |
- ప్రాపంచిక ప్రశ్నల కొరకు (ఉదా.., మన ప్రధాన మంత్రి ఎవరు?) సంప్రదింపుల కేంద్రం చూడండి.
- మెరుగు పరచవలసిన విషయాలపై చర్చ కొరకు సాధారణ ఫిర్యాదులు చూడండి.
- సాంకేతిక విషయాలపై సమాచారం కొరకు రచ్చబండ చూడండి.
- సభ్యుల మధ్య వివాదాల పరిష్కారం కొరకు వివాద పరిష్కారం చూడండి.
సహాయ కేంద్రానికి స్వాగతం! వికీపీడియా గురించిన ప్రశ్నలు అడగటానికీ, వ్యాసాలు రాసే విషయంలో సహాయం పొందటానికి ఇదే సరియైన స్థలం. ఎక్కువగా కొత్తవారి ప్రశ్నలకు సమాధానాలిస్తాం, కాని అనుభవజ్ఞులూ అడగవచ్చు. ప్రశ్న రాసిన తరువాత, సమాధానాలు వచ్చాయేమో చూడటానికి ఈ పేజీని చూస్తూ ఉండండి.
ప్రశ్న ఎలా అడగాలి
- ముందుగా, మీ ప్రశ్నకు ఇదివరకే సమాధానం ఇచ్చేసారేమో చూడండి. చాలా ప్రశ్నలకు తరచుగా అడిగే ప్రశ్నల లో సమాధానాలు దొరుకుతాయి.
- ప్రశ్నలకు ఒక అర్ధవంతమైన శీర్షిక పెట్టండి, దానికి అర్ధవంతమైన సమాధానం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
- సూటిగా, వివరంగా అడగండి.
- ప్రశ్న చివర సంతకం పెట్టండి. మీకు వికీపీడియా లో సభ్యత్వం ఉంటే,
~~~~
అని టైపు చెయ్యండి. లేకపోతే, మీ పేరు రాయవచ్చు లేదాఆకాశరామన్న
అని రాయవచ్చు. - ప్రశ్నలకు ఈ-మెయిల్ లో సమాధానాలు ఇవ్వరు కాబట్టి, ఈ-మెయిల్ అడ్రసు ఇవ్వకండి. పైగా వికీపీడియాలో విషయాలు యథేఛ్ఛగా కాపీ చేసుకోవచ్చు కనుక మీ ఈ-మెయిల్ కు గోప్యత ఉండదు.
- అప్పుడప్పుడూ ఈ పేజీని చూస్తూ ఉండండి. ఎందుకంటే, సమాధానం ఒక్కసారే రాకపోవచ్చు, అది ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి.
- మీ ప్రశ్నకు అనుబంధంగా ఇంకా అడగాలంటే, మీ ప్రశ్న విభాగం పక్కనే ఉండే [మార్చు] లింకును నొక్కి ప్రశ్నను రాయండి. ఒకే ప్రశ్నపై బహుళ విభాగాలు ప్రారంభించవద్దు.
- అన్ని వయసుల పాఠకులూ ఈ పేజీ చూస్తారని గుర్తుంచుకోండి.
- ప్రశ్న తెలుగులోనే అడగండి.
- ప్రశ్నలకు సమాధానాలు మనుష్యులే ఇస్తారు, కంప్యూటర్లు కాదు. ఇది సెర్చ్ ఇంజిన్ కాదు.
సమాధానం ఎలా ఇవ్వాలి
- వీలయినంత విపులమైన సమాధానం ఇవ్వండి.
- క్లుప్తంగా ఇవ్వండి, కరకుగా కాదు. స్పష్టంగా, సులభంగా అర్ధమయ్యే విధంగా రాయండి. ప్రశ్న పరిధికి లోబడి సమాధానం ఇవ్వండి.
- సమాధానం తెలుగులోనే ఇవ్వండి.
- వికీపీడియా లోని పేజీలకు లింకులు ఇవ్వండి. దీనివలన మరింత సమాచారం దొరుకుతుంది.
- వాదాలకు ఇది వేదిక కాదు. ఏ విషయంపైనైనా వాదించాలనుకుంటే, చర్చా పేజీ చూడండి.
[మార్చు] నమస్కారములు
నాకింకా బోధపడటలేదు! నేనేవిధముగా సహాయపడాలో మీరే చెప్పండి. ద్రవ్యసహాయము మాత్రము చెయ్యలేను (రిటైర్ అయిన కారణముచే). శ్రేయోభిలాషి శిష్ట్లా శ్రీరామచంద్ర మూర్తి
- నమస్కారము శ్రీరామచంద్ర మూర్తి గారు,
- మీ లాంటి పెద్దవారు ఇక్కడ ఉండుటయే మహా భాగ్యము. మీ సహాయము ఈ మహత్తర బృహద్ కార్యానికి ఎంతైనా అవసరము. మీరు ఏ విధముగా సహాయము చేయవచ్చొ తెలుసుకొనుటకు సముదాయ పందిరిలో "కలసి పనిచేద్దాం రండి" విభాగము చూడండి.
- తెలుగులో ఇంకా సహాయ పేజీలు పూర్తిగా తర్జుమా చేయలేదు. కావున మీరు ఆంగ్ల సహాయ పేజీలు కూడా చూడవచ్చు.
- ధన్యవాదములు
- వైఙాసత్య
[మార్చు] Why should we edit the pages written by somebody.
asalu naku ee site em cheyalo ardham kavadam ledhu, verokaru rasina articles ni edit cheyadam dheniki.. asalu
Because we believe 1. Nobody is perfect, but at the same time there is something we can contribute as a personal leve, when combined with a group of contributions we will move towards perfection.
2. If you are not interested in editing some others articles, WELCOME write your own articles and obsrve how they are edited (if so) and I hope then u will get an answer of why articles should be edited and how they improve after edit after edit.
Regards, Kiran user:chavakiran
[మార్చు] తెలుగు వికిపీడియా
సభ్యులకు నమస్కారములు. ఆకౌంటు ఆనే పదం బదుల ఖాతా అంటే బాగా ఉంటుందేమౌ!!!!!!!
- అవునండీ ఇలా చాలా సూచనలు వచ్చాయి కాని ఎదీ ప్రస్తుత సందర్భములో ఖచ్చితముగ సరిపోక అలాగే ఉంచేశాము. కానీ మిగతా సభ్యులు ఖాతాకు మార్చడానికి అనుకూలిస్తే నాకేమీ అభ్యంతరము లేదు. --వైఙాసత్య 18:47, 27 నవంబర్ 2005 (UTC)
[మార్చు] unable to type the matter in telugu
i have joined this site recently and i would like to type the matter in telugu and also i would like to post something for discussions but unable to do it. please help in this. sailaja
- Welcome to Telugu Wikipedia. The simplest way is to go to this URL... http://www.geocities.com/vnagarjuna/padma.html. It is a simple and highly useful tool called Padma. It converts (transliterates) whatever you type in English, into Telugu. Then copy that Telugu text and paste it wherever you want. It is provided by V Nagarajuna.
- If you are using Firefox brouser, you can type Telugu matter in English script and then transliterate into Telugu script there itself. You need to install Padma extension in Firefox.
- For more on Telugu reading and writing links, please visit.. http://te.wikipedia.org/wiki/Wikipedia:Setting_up_your_browser_for_Indic_scripts. __చదువరి 08:47, 7 డిసెంబర్ 2005 (UTC)
[మార్చు] derivatives
[మార్చు] how to type in telugu
you have suggested me some sites to type in telugu, but i still have doubts with regard this subject.
to type in telugu do i have to download or install anything?
please suggest me in this subject.
sailaja.
- If your brouser is displaying Telugu fonts, and you are able to read Telugu text, you need not install any software to use Padma tool at Geocities. I hope I cleared your doubt. If not, please post your doubt again. Thanks. __చదువరి 17:51, 10 డిసెంబర్ 2005 (UTC)
[మార్చు] how to get my name in Telugu Font in Hotmail.
hi, i have seen of my friends has her name in Urdu in Hotmail next to her English name. Is there any possibility that i can also have my Name in Telugu in hotmail Msn along with my Name in English.
Please respond back to rajbasa@yahoo.com.
regards, Raj.
నమస్కారములు, నా పేరు అరుణ్. నేను వికిపీడియా లొ ఇటీవలనే ఖాతా తెరిచాను. నేను ఆంగ్లము లోని పేజీలను తెలుగు లోనికి అనువాదము చెయ్యదలిచాను. దయచేసి నేను ఏమి చెయ్యవలెనో తెలుపగలరు
అరుణ్ గారు, మీరు ఆంగ్ల వ్యాసములు తెలుగులోకి అనువదించాలనుకొంటున్నదుకు చాలా సంతోషం. ఇదివరకట నాలాంటి వాళ్లు ఆలోచించకుండా ఆంగ్ల వ్యాసములను నేరుగా తెలుగు వికిలో అతికించడము జరిగింది. అవి ఇప్పటికి కూడా అనువాదము కోసము వేచిఉన్నాయి. వాటి జాబితా కొరకు అనువాదము కోరబడిన పేజీలు చూడండి. కొత్తవి అనువదించాలనుకుంటే మీరు ఒక సొంత ఇసుకపెట్టె పేజీ తయారు చేసుకొని అందులో అనువదించి తరువాత వ్యాసముతో పేజీ సృష్టించవచ్చు --వైఙాసత్య 15:36, 14 మార్చి 2006 (UTC)
[మార్చు] Creating new Page
నేను పొరబాటున కమ్యునిజం(communism), కమ్యునిజం అను పేర్లతో రెండు వ్యాసాలు సృష్టించాను. రెండిటి పాఠము ఒక్కటే. మరియు నేను సృష్టించిన పేజీలు సెర్చ్ బాక్స్ లో టైప్ చేసి "వెళ్ళు" క్లిక్ చేస్తే కనబడుట లేదు. కొత్త వ్యాసాలను ఎలా సృష్టించాలో తెలుపగలరు. --arun
- అరుణ్ గారూ, పొరపాటున అలా తప్పు పేరుతో పేజీ సృష్టించినప్పుడు మీరు రెండు పనులు చేయవచ్చు. మొదటిది మీరు దానిని సరైన పేజీకి తరలించవచ్చు. లేదా కొత్తపేజీలో పాత సమాచారము అతికించవచ్చు. కానీ మొదటి విధానమే సరి అయినది ఎందుకంటే రెండవ విధానములో పేజీ చరిత్ర కోల్పోతాము. వెళ్ళు నొక్కితే ఆ పేరుతో పేజీ ఉంటేనే అక్కడికి నేరుగా వెలుతుంది. అన్వేషణ నొక్కితే అన్ని పేజీలలో ఆ పదాన్ని వెతికి చూపిస్తుంది. కొత్త పేజి సృష్టించడానికి ఈ వ్యాసము చదవండి Wikipedia:కొత్త పేజీని ఎలా ప్రారంభించాలి. ఇతర ప్రశ్నలకు Help:Contents చూడండి --వైఙాసత్య 14:59, 15 మార్చి 2006 (UTC)
[మార్చు] సంకేత పదం (password) మర్చిపోతె ఎలా
వికిపీడియా లొ 'లాగిన్ '/'సంకేత పదం ' కాని మర్చిపోతె ఎలా రాబట్టుకోవాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఏమి చెయ్యాలి? Satyavani 00:59, 6 ఏప్రిల్ 2006 (UTC) సత్యవాణి
- లాగిన్ అయ్యేచోటే "నా సంకేతపదం మర్చిపోయాను, కొత్తది పంపించు" అనే మీట ఉంది. అది నొక్కితే, మీరిచ్చిన ఈ మెయిల్ ఐడీ కి కొత్త సంకేతపదం వస్తుంది. సభ్యత్వం పొందేటపుడు మీరు మీ ఈ మెయిల్ ఐడీ ఇచ్చి ఉండకపోతే.., సంకేతపదాన్ని పొందే ఏర్పాటు లేనట్లే! మరింత సమాచారం దొరుకుతుందేమో చూస్తాను. __చదువరి (చర్చ, రచనలు) 07:23, 6 ఏప్రిల్ 2006 (UTC)
[మార్చు] Adding my name to Wikipedian list
Hi,
It is confusing, can you help me to add my name to the list
Thaks
Shashikanth
మీరు వికీపీడియా ఫార్మాటింగ్ గురించి నేర్చుకుంటే మీకు అర్థమవుతుంది. భవిష్యత్తులో కూడా చాలా ఉపయోగపడుతుంది. దానికి సంభందించిన లింకు చూడండి.
[మార్చు] రెండు పేర్ల సమస్య
నమస్కారములు. - రామాయణము, రామాయణం - అనే రెండు శీర్షికలు ఉన్నాయి. నేను "రామాయణము" - లో కొంత వ్రాత మొదలు పెట్టినాను. కాని " రామాయణం" అనేది ఖాళీగా ఉన్నది. - దీనికి ఏమయినా పరిష్కారము ఉన్నదా? - సుధాకర బాబు
- సుధాకర బాబు గారు, మీ కృషి అభినందనీయము. ఇలాంటి సమస్యలకు పరిష్కారము దారిమార్పు పేజీలు. వాటి గురించి Wikipedia:దారిమార్పు లో చదవండి. క్లుప్తంగా రామాయణం పేజీలో #redirect[[రామాయణము]] అని రాసి భద్రపరుస్తే సరిపోతుంది. --వైఙాసత్య 00:52, 2 ఆగష్టు 2006 (UTC)
[మార్చు] పరవస్తు వెంకట రంగాచార్యులు, కొమర్రజు వెంకట లక్ష్మణ రావు
పరవస్తు వెంకట రంగాచార్యులు, కొమర్రజు వెంకట లక్ష్మణ రావు గార్లు - ప్రప్రధమముగా తెలుగులో విజ్ఞాన సర్వస్వమును మొదలుపెట్టిన మహానుభావులు. వారిని గూర్చిన శీర్షికలు వికిలో ఉండుట ఉచితము. తగు శీర్షికలు మొదలుపెట్టగోరుతున్నాను. నాకు రిఫరిన్సులు అందుబాటులో లేవు. ఎవరైనా ఆంగ్లములో వ్యాసాలు ఇచ్చినట్లయితే నేను అనువదించగలను.
--Kajasudhakarababu 21:54, 3 ఆగష్టు 2006 (UTC)
పరవస్తు వెంకట రంగాచార్యులు, కొమర్రాజు లక్ష్మణరావు - వ్యాసములు చేర్చబడ్డాయి - చూడండి. అదనపు సమాచారాన్ని చేర్చండి. కాసుబాబు 14:38, 22 ఆగష్టు 2006 (UTC)
[మార్చు] do you have telugu spellchecker for utf gautami?if u do,pl let me know where to download it from.thanks
My e mail addres is krishnamaitri@yahoo.co.in I have a lot of problem in trying to spell check my seminar papers.I am desperately looking for a telugu spell checker to download for unicode gautami font.Any one can pl help me?
- http://www.ildc.gov.in/telugu/htm/Morph.htm Is spell checker font specific? I am not sure.--వైఙాసత్య 16:41, 22 అక్టోబర్ 2006 (UTC)
[మార్చు] ఆమకవేప సహాయం letters
ఆమకవేప సహాయం picture is not displaying in my browser. In the place of letters it is displaying numbers like that "22 - 5 =". I tryed to create account by giving this expression. But it won't take. plz any one can give help.........
- మీకెదురైన సమస్య ఏమిటో మరికాస్త వివరంగా చెబుతారా? ముందుగా అకౌంటు సృష్టించుకోవాలనుకోవడం మంచి ఆలోచన. అకౌంటు సృష్టించుకోవాలంటే మామూలుగా మీ పేరుతోనే సృష్టించుకోవచ్చు. ఆమకవేప సహాయం picture అంటే ఏ బొమ్మ గురించి మీరు మాట్లాడుతున్నారు? లేఖిని ని వాడి తెలుగులో రాయడానికి ప్రయత్నించండి. త్రివిక్రమ్ 14:52, 6 నవంబర్ 2006 (UTC)
- ఆమకవేప అంటే ఆటోమాటిక్ గా మనుష్యులను, కంప్యూటర్లను వేరుచేసే పరీక్ష - సభ్యత్వం తీసుకునేటపుడు ఆ తీసుకునేది మనిషా కంప్యూటరా అని తెలుసుకునే సాధకం - ఇంగ్లీషులో capcha. ఇదివరలో ఆమకవేపలో బొమ్మ ఉండేదండి. అంచేత బొమ్మలోని పదాలను టైపు చెయ్యమని రాసాము. ఈ మధ్య దాని స్థానంలో సమీకరణం ఇచ్చారు. కానీ పైనున్న వివరణ మార్చలేదు. ఇప్పుడు మార్చేసాము. మీరు చెయ్యవలసింది, ఆ సమీకరణం విలువను పక్కనున్న పెట్టెలో టైపు చెయ్యడమే! తప్పును ఎత్తి చూపినందుకు చాలా థాంక్స్! మీరిక సభ్యత్వం తీసుకుని వికీని మరింత మెరుగుపరచండి, స్వాగతం! __చదువరి (చర్చ, రచనలు) 17:27, 6 నవంబర్ 2006 (UTC)
[మార్చు] regarding alfred noble
why mathematics does not have noble prize?
hai thank q wikipedia
[మార్చు] telugulo vyasam type cheyatam elaga
telugu lo ediana vyasam gani edaina news gani indulo telugulo type cheyadam elago telupagalaru.
itlu, kiran.
Use http://lekhini.org Chavakiran 08:19, 14 నవంబర్ 2006 (UTC)
[మార్చు] చరిత్రకు సంబందించిన వ్యాసాలు
నా పేరు హరిణాథ్ రెడ్డి నేను భారత చరిత్రకు సంబందించి నాకు తెలిసన వివరాలు ఆసక్తిదాయాకగా ఉన్నవి వికిపేడీయా లో పెట్టాలి అనుక్ంటుననౌు దయచేసి వివరాలు ఇవ్వగలరు
హరినాథ్ గారు, మీరు చరిత్రకు సంబందించిన వ్యాసాలు రాయాలని అనుకోవడం ఎంతో ఆహ్వానించదగినది. మీరు భారత దేశ చరిత్రతో మొదలు వెట్టవచ్చు. అక్కడ ప్రస్తుతం హెడ్డింగులు ఉన్నాయి కానీ సమాచారం మాత్రం లేదు. అలాగే విజయనగర సామ్రాజ్యము మీద కొన్ని ఉన్నాయి, వ్యాసాలు వాటికి సరయిన మూలాలు లేవు, అవి వెతికి పట్టి వాటిని చేర్చే పని కూడా చేయవచ్చు. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 06:22, 28 నవంబర్ 2006 (UTC)
- All the best Chavakiran 06:41, 28 నవంబర్ 2006 (UTC)
MA OORI GURINTHI VEVARALU ENTER CHEYADAM ELA
[మార్చు] padma avaardulu
పద్మ అవార్డులకి ఆ పేరు ఎలా వచ్చ్హింది?
[మార్చు] వికిపిడియ ఆంగ్ల భాష లోని వ్యాసాలను తెలుగులోకి తర్జుమా చెయ్యాలనుకుంటున్న చెయ్యవచ్చా?
నేను వికిపిడియ ఆంగ్ల భాష లోని వ్యాసాలను తెలుగులోకి తర్జుమా చెయ్యాలనుకుంటున్న చెయ్యవచ్చా.నా ఉద్దేశ్యం కేవలం తెలుగులో వీలైనన్ని ఎక్కువ పేజీలు పొందుపరచటం.అలా చెయ్యవచ్చా దీనికి కాపిరైట్ సంస్య ఏమన్న ఉంటుందా? -- హనుమ దీపక్
- దీపక్ గారూ, నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా చెయ్యవచ్చు. ఇక్కడి వ్యాసాల్లో అలా అనువదించినవి చాలానే ఉన్నాయి. కాపీహక్కుల సమస్యేమీ లేదు. __చదువరి (చర్చ, రచనలు) 15:50, 28 డిసెంబర్ 2006 (UTC)
[మార్చు] ఏ అక్షరానికి ఏమి నొక్కాలి?
తెలుగు లొ వ్రయుతకు ఎ అక్షరనికి ఎమి నొక్కలి
తెలుదగు లొ కొన్ని అక్షరలు వ్రయతమ్ రవత్లెదు
-
- ఇలాంటి ఇబ్బంది క్రొత్తగా మొదలు పెట్టినవారికి మామూలే. ఒకసారి http://lekhini.org/ చూడండి. అక్కడ పేజీలో కుడి ప్రక్కన ఉన్న "టేబుల్" మీకు ఉపయోగపడుతుంది. మీరు వ్రాసినదానిని బట్టి మీకు ఇబ్బందిగా ఉన్నవనిపించిన అక్షరాలు ఇక్కడ ఇస్తున్నాను.
-
- ట T - ఠ Th - సున్న M
- ilA v&RAyAli ఇలా వ్రాయాలి
- p&rayat&niMcaMDi ప్రయత్నించండి
--కాసుబాబు 11:55, 12 మార్చి 2007 (UTC)
[మార్చు] వార్తా పత్రిక ఫాంట్లు
namaskaaram
naa kamp&yuuta&r loe telugu paepa&r Ope&n avutu&ndi kaani faa&nT telugu loe raavaDam leadu. eadoe koeD loe Ope&n avutu&ndi. telugu faa&nT raavala&nTea eamicheayaali.
- అది మీరు వాడే బ్రౌజర్‌పై ఆధారపడి ఉంటుంది. ఆ వార్తా పత్రిక లో Font help అని ఉంటుంది. చూడండి.
- ఇక్కడ చూడండి. http://ubuntuforums.org/showthread.php?p=2121150 మీకు ఉపయోగపడవచ్చును.
- Windows XP అయితే ఇబ్బంది ఉండకూడదు. ఒక వేళ WIndows 98 అయితే ఇది చూడండి.
http://chavakiran.blogspot.com/2004/12/my-experiments-for-telugu-on-windows.html
- ఒకవేళ మీరు ఫైర్‌ఫాక్స్ వాడుతున్నట్లయితే ఇక్కడ చూడండి. http://chavakiran.blogspot.com/2005/06/eenadu-news-paper-in-firefox.html
-
- --కాసుబాబు 14:27, 25 మార్చి 2007 (UTC)
[మార్చు] my ip address revealed
నేను లాగిన్ చెయ్యటం మరచిపోయి మార్పులు చేసేను. నా ఐ. పి. ఎడ్రస్ కనబడుతోంది. దానిని తొలగించి నా పేరుని పెట్టటం ఎలా?
- నాకు తెలిసినంతవరకు అది సాధ్యం కాదు. ఒక సూచన. ఆ వ్యాసం చర్చా పేజీలో ఫలాని విషయం ఫలాని తేదీలో ఫలాని ఐ. పి. ఎడ్రస్ నుండి నేను వ్రాశానని వ్రాయవచ్చును. ఇది ఒక రికార్డుగా ఉంటుంది. --కాసుబాబు 05:29, 4 ఏప్రిల్ 2007 (UTC)
[మార్చు] ఆంగ్లం నుండి అనువాధించడానికి తేలికైన పద్ధతి
నేను ఆంగ్ల వికీ నుండి తెవికికి ఒక వ్యాసం అనువాదించాలను కుంటున్నా. దాని కోసం 1)తెలుగులో పేజి సృష్టించి 2)ఆంగ్లం నుండి source కాపి పేస్ట్ చేసి 3)అనువాదం చేయడం కంటే మంచి పద్దతి ఉంటే తెలుపగలరు.
- మీ సభ్యుని చర్చాపేజీలో లేదా సభ్యుడు నేంస్పేసులో ఒక తాత్కాలిక పేజీ సృష్టించుకొని అందులో అనువదించి తెలుగు వ్యాసంలో అతికించండి. --వైఙాసత్య 00:45, 10 ఏప్రిల్ 2007 (UTC)