శ్రీకాళహస్తి
వికీపీడియా నుండి
శ్రీకాళహస్తి మండలం | |
జిల్లా: | చిత్తూరు |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | శ్రీకాళహస్తి |
గ్రామాలు: | 61 |
జనాభా (2001 లెక్కలు) | |
---|---|
మొత్తము: | 124.918 వేలు |
పురుషులు: | 62.979 వేలు |
స్త్రీలు: | 61.939 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 69.14 % |
పురుషులు: | 79.16 % |
స్త్రీలు: | 58.97 % |
చూడండి: చిత్తూరు జిల్లా మండలాలు |
శ్రీకాళహస్తి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాలో ఒక పట్టణము మరియు అదే జిల్లాకు చెందిన ఒక మండలము. అంతేకాదు శ్రీకాళహస్తి, పంచభూతలింగములలో నాల్గవదైన వాయు లింగము గల గొప్ప శైవ పుణ్యక్షేత్రము. ఇక్కడ రెండు దీపాలలో ఒకటి ఎప్పుడూ గాలికి కదులుతూ వుంటుంది, మరొకటి ఎల్లప్పుడు నిశ్చలముగా ఉంటుంది.
విషయ సూచిక |
[మార్చు] శ్రీకాళహస్తి క్షేత్రము
[మార్చు] క్షేత్ర పురాణము
సువర్ణముఖీ నదీ తీరమున వెలసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు. స్వయం భూలింగము, లింగమునకెదురుగా వున్న దీపము లింగము నుండి వచ్చు గాలికి రెపరెపలాడును. శ్రీకాళహస్తిని 'దక్షిణ కాశీ ' అని అంటారు.
అమ్మవారు జ్ఙానప్రసూనాంబ , అంబాత్రయములలో ఒకరు. శివలింగము ఇక్కడ వర్తులాకారము వలె గాక చతురస్రముగ వుంటుంది. సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము కలిగించిన పుణ్యక్షేత్రము ఇది.
కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తుండేవాడు . అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటినుండి నెత్తురు కార్చేడట. వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామి కంటికి అమర్చాడట. అప్పుడు స్వామి రెండవకంటి నుండి కూడ నెత్తురు కారటం మొదలయింది. భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవకన్ను కూడా పీకి స్వామికి అమర్చాడు. స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పని కరుణించి ముక్తి ప్రాసాదించాడు.
ఈదేవాలయము చాలా పెద్దది, పై కప్పుపై రంగులతో చిత్రించిన అనేకములయిన చిత్రములు వున్నాయి.
" మణికుండేశ్వరాఖ్య " అనే మందిరమువున్నది. కాశీ క్షేత్రములో వలె ఇక్కడ చనిపొయే వారికి పరమశివుడు ఓంకార మంత్రమును, తారకమంత్రమునుపదేశించి మోక్షము ఇచ్చునని భక్తుల నమ్మకము.
దేవాలయ ప్రాంతములోనే పాతాళ విఘ్నేశ్వరాలయము కలదు. దేవాలయమునకు సమీపములోగల కొండపై భక్త కన్నప్పకి చిన్న ఆలయము నిర్మించారు. శ్రీకాళహస్తీశ్వరాలయము రాజగోపురము యొక్క సింహద్వారము దక్షిణాభిముఖము. స్వామి వారు ఉత్తరాభిముఖులై వుంటారు. శ్రీ ఆదిశంకారచార్యులు వారు ఇక్కడ శ్రీ చక్రము స్థాపించారు. ఈ క్షేత్రమునకు గల ఇతర నామములు దక్షిణకైలాసమనియు , సత్య మహా భాస్కరక్షేత్రమనియు , సద్యోముక్తిక్షేత్రమనియు, శివానందైక నిలయమనియు పేర్కొనటం జరిగింది.
మహా శివరాత్రినాడు ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది.
[మార్చు] ఉన్న ప్రాంతము
ఇది చిత్తూరు జిల్లాలోని తిరుపతికి ముఫ్ఫై ఎనిమిది కి.మీ.ల దూరంలో ఉన్నది. రోడ్డు మార్గంలో తిరుపతి నుంచి ఒక గంటలోపు శ్రీ కాళహస్తి చేరుకోవచ్చు.ప్రతి 5 నిమిషములకు 1 బస్సు కలదు.
[మార్చు] చేరుకొను విధము
ఇది రోడ్డు, రైలు మార్గములతో చక్కగా కలపబడినది.
[మార్చు] రోడ్డు మార్గము
ఈ క్షేత్రం జాతీయరహదారి ఐదు మీద ఉన్నది. ఆంధ్రప్రదేశ్ లోని దాదాపు అన్ని ముఖ్య పట్టణాల నుండి, మరియు చెన్నై (మద్రాసు), బెంగుళూరు ల నుండి ప్రతిరోజు బస్సు సదుపాయం ఉన్నది.
[మార్చు] రైలు మార్గము
[మార్చు] విమాన మార్గము
ఇక్కడకి దగ్గ్గ్గరలోని విమాన మార్గము తిరుపతి దగ్గరలోని రేణిగుంట, కానీ అక్కడ విమానాలు ఇంకా రోజూ లేవు, కనుక చెన్నై, విజయవాడ లేదా బెంగళూరులకు వచ్చి అక్కడ నుండి రోడ్డుమార్గములో రావచ్చు.
[మార్చు] మండలంలోని పట్టణాలు
- శ్రీకాళహస్తి
[మార్చు] మండలంలోని గ్రామాలు
- కొత్తపల్లె చింతల
- మన్నవరం
- ఇనగలూరు
- గొవిందరావుపల్లె
- వాంపల్లె
- పోలి
- భీమవరం
- ఎంపేడు
- అమ్మచెరువు
- పాతగుంట
- మంగళగుంట
- వేలంపాడు
- కలవగుంట
- యర్లపూడి
- మేలచూరు
- పాపనపల్లె
- బ్రాహ్మణపల్లె
- గొల్లపల్లె వెంకటాపురం
- బహదూర్ వెంకటాపురం
- కొత్తూరు చెల్లమాంబపురం
- రామానుజపల్లె
- కుంతిపూడి
- వాగవీడు
- వెంగళంపల్లె ఎండ్రపల్లె
- మడమల
- వేలవీడు
- రెడ్డిపల్లె
- ఓబులయ్యపల్లె
- ముద్దుమూడి
- మంగళపురి
- ముచ్చివోలు
- ఎర్రగుడిపాడు
- బోడవారిపల్లె
- ఉడమలపాడు
- అక్కుర్తి
- పెనుబాక
- కమ్మకొత్తూరు
- చెరుకులపాడు
- నారాయణపురం
- గుంటకిందపల్లె
- మద్దిలేడు
- ఉరందూరు
- పనగల్లు (గ్రామీణ)
- అరవకొత్తూరు
- అప్పలయ్యగుంట
- చుక్కలనిడిగల్లు
- అమ్మపాలెం
- పుల్లారెడ్డి ఖండ్రిగ
- తొండమనాడు
- దిగువవీధి
- ఎగువవీధి
- చెర్లపల్లె
- కాపుగున్నేరి
- మర్రిమాకులచేను ఖండ్రిగ
- రాచగున్నెరి
- చల్లపాలెం
- బొక్కసంపాలెం
- సుబ్బనాయుడు ఖండ్రిగ
- రామలింగాపురం
- వెడం
- రామాపురం
[మార్చు] చిత్తూరు జిల్లా మండలాలు
పెద్దమండ్యం | తంబళ్లపల్లె | ములకలచెరువు | పెద్దతిప్ప సముద్రం | బీ.కొత్తకోట | కురబలకోట | గుర్రంకొండ | కలకడ | కంభంవారిపల్లె | యెర్రావారిపాలెం | తిరుపతి పట్టణం | రేణిగుంట | యేర్పేడు | శ్రీకాళహస్తి | తొట్టంబేడు | బుచ్చినాయుడు ఖండ్రిగ | వరదయ్యపాలెం | సత్యవీడు | నాగలాపురం | పిచ్చాటూరు | విజయపురం | నింద్ర | కె.వీ.పీ.పురం | నారాయణవనం | వడమలపేట | తిరుపతి గ్రామీణ | రామచంద్రాపురం | చంద్రగిరి | చిన్నగొట్టిగల్లు | రొంపిచెర్ల | పీలేరు | కలికిరి | వాయల్పాడు | నిమ్మన్నపల్లె | మదనపల్లె | రామసముద్రం | పుంగనూరు | చౌడేపల్లె | సోమల | సోదం | పులిచెర్ల | పాకాల | వెదురుకుప్పం | పుత్తూరు | నగరి | కార్వేటినగర్ | శ్రీరంగరాజపురం | పాలసముద్రం | గంగాధర నెల్లూరు | పెనుమూరు | పూతలపట్టు | ఐరాల | తవనంపల్లె | చిత్తూరు | గుడిపాల | యడమరి | బంగారుపాలెం | పలమనేరు | గంగవరం | పెద్దపంజని | బైరెడ్డిపల్లె | వెంకటగిరి కోట | రామకుప్పం | శాంతిపురం | గుడుపల్లె | కుప్పం