తులసి
వికీపీడియా నుండి
తులసి (Tulasi, Tulsi, Holy Basil) ఔషధీ పరంగానూ, హిందూ సంప్రదాయాలలోనూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న మొక్క. దీని శాస్త్రీయ నామము ఓసిమమ్ టెన్యుఫ్లోరమ్ (Ocimum tenuiflorum). ఇందులో రెండు జాతులున్నాయి. ముదురు రంగులో ఉండే జాతిని కృష్ణ తులసి అనీ, కొంచెం లేత రంగులో ఉండేదానిని రామతులసి అనీ అంటారు. వీటిలో సాధారణంగా కృష్ణతులసిని పూజకు వాడుతారు. ఆయుర్వేద ఔషధాలలో కూడా కృష్ణతులసిని అధికంగా వాడుతారు.
విషయ సూచిక |
[మార్చు] తులసి ప్రాముఖ్యత
హిందూ మతంలో, ప్రత్యేకించి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో తులసి మొక్క పట్ల ఎంతో భక్తి,పూజావిధానాలు ఉన్నాయి. ఆడువారు తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండడానికి తులసిని పూజిస్తారు. తులసి పూజకు సంబంధించి చాలా విధానాలు, నియమాలు, వ్రతాలు, పండుగలు, స్తోత్రాలు, భక్తి గేయాలు ఆచారంలో ఉన్నాయి. తులసి తీర్ధం అన్నమాట తరచు వింటాము.
వేలాది సంవత్సరాలుగా ఆయుర్వేదంలో తులసి ఒక ముఖ్యమైన ఔషధిగా వాడబడుతున్నది. రెండు వేల సంవత్సరాలకంటే పురాతనమైన ఆయుర్వేద గ్రంధం చరక సంహితంలోనూ, అంతకంటే పురాతనమైన ఋగ్వేదంలోనూ కూడా తులసి ప్రస్తావన ఉంది. తులసిని ఇంకా చాలా గృహ వైద్యంచిట్కాలలో కూడా వాడుతారు. దీని ఔషధీగుణంపై ఇప్పుడు మరింత పరిశోధన జరుగుతున్నది. అనేక ఆధునిక ఔషధాలలో కూడా తులసిని వాడుతున్నారు. శరీరంలో వివిధ ప్రక్రియలను సమతుల్యం చేశే ప్రభావం ఉన్న adaptogen గా తులసిని గుర్తించారు. కనుక మానసిక వత్తిడిని తగ్గించే ప్రభావం, ఆయుర్వృద్ధి కలిగించే ప్రభావం తులసిలో ఉన్నాయని అభిప్రాయుం.
ఇదే జాతికి చెందిన Thai Basil మొక్కను ఒకోసారి తులసి (Holy Basil)గా అనుకోవడం జరుగుతుంది. కాని రెండింటికీ రూపంలోనూ, రుచి, వాసనలోనూ తేడాలున్నాయి. Thai Basil మొక్క నునుపుగా ఉంటుంది. తులసి మొక్క కాస్త నూగుగా ఉంటుంది. Holy Basil does not have the strong aniseed or licorice smell of Thai Basil; and Holy Basil has a hot, spicy flavor sometimes compared to cloves.
[మార్చు] ఔషధంగా తులసి
తులసి ఆకుల రసం ఆయుర్వేదంలోనూ, ఇంటి వైద్యం చిట్కాలలోనూ విస్తృతంగా వాడుతారు. జలుబు, తలనొప్పి, పొట్టకు సంబంధించిన వ్యాధులు, వాపులు, గుండె జబ్బులు, విషాహారాలు, మలేరియా వంటి చాలా రకాల రుగ్మతలను నయం చేయడానికి తులసి వాడుతారు.
- కొన్ని ఉపయోగాలు
- తులసి ఆకులకు ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ ఆకులు నాడులకు టానిక్‌లాగా,
జ్ఞాపకశక్తిని పెంపొందించేవిగా పనిచేస్తాయి.
- తులసి ఆకుల్ని పలురకాల జ్వరాల్లో ఉపశమనానికి ఉపయోగించుకోవచ్చు. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ జ్వరం వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు లేత తులసి ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించి తాగితే ఈ రకం జ్వరాల నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. జ్వరం మరీ తీవ్రంగా ఉంటే తులసి ఆకులనూ, యాలకుల పొడినీ కలిపి అరలీటరు నీళ్లలో మరిగించి కషాయం తయారు చేయాలి. అందులో చక్కెర, పాలు కలిపి తాగితే జ్వర తీవ్రత తగ్గుతుంది. తులసి ఆకుల్ని మెత్తగా నూరి నీటిలో కలుపుకుని రెండుమూడు గంటలకోసారి తాగొచ్చు.
- పలురకాల ఆయుర్వేద దగ్గు మందుల్లో తులసిని తప్పకుండా కలుపుతారు. బ్రాంకైటిస్, ఆస్థమాల్లో కఫాన్ని తొలగించటంలో తోడ్పడుతుంది. తులసి ఆకుల్ని నోట్లో పెట్టుకుని నమలటం వల్ల జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది.
- తులసి ఆకులతో మరిగించిన నీళ్లను తాగితే గొంతులో గరగర నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ నీళ్లతో నోటిని పుక్కిలించినా మంచి ప్రయోజనం కనిపిస్తుంది.
- చిన్నపిల్లల్లో సర్వసాధారణంగా కనిపించే దగ్గు, జలుబు, జ్వరం, డయేరియా, వాంతులు వంటి సమస్యలకు తులసి ఆకుల రసాన్ని తాగిస్తే మంచి ఉపశమనం కనిపిస్తుంది.
- ఎండిన తులసి ఆకులను ధాన్యం నిలవ చేసిన చోట్ల ఉండుతారు - కీటకాలను దూరంగా ఉంచడం కోసం.
ఆకుల రసం (పసరు), ఎండిన ఆకుల పొడి, మరగించిన నీరు, హెర్బల్ టీ, నేతిలో మరగ పెట్టడం - ఇలా తులసిని చాలా విధాలుగా తీసుకోవచ్చును.
ఇటీవల అధ్యయనాలలోని ఫలితాల ప్రకారం చాలా నొప్పి నివారక పదార్ధాలలాగా తులసి ఒక COX-2 inhibitor కావచ్చును. ఇందుకు కారణం తులసిలో అధిక మోతాదులో ఉన్న యూజినాల్'(Eugenol) (1-హైడ్రాక్సీ-2-మీథాక్సీ-4-అల్లైల్ బెంజీన్).[1][2] ఇంకా ఇతర అధ్యనాలలో తులసికి రక్తంలో చక్కెర మోతాదును తగ్గించగలిగే శక్తి తులసికి ఉంది. కనుక డయాబెటిస్ (చక్కెర వ్యాధి) వైద్యంలో కూడా తులసి పనికొస్తుంది. [3] రక్తంలో కోలెస్టరాల్ను తగ్గించడానికీ, 'యాంటీ ఆక్సిడెంట్' గుణాల వలన బ్లడ్ షుగర్ తగ్గించడానికీ కూడా పనికొచ్చే పదార్ధాలు తులసిలో ఉన్నాయని మరి కొన్ని పరిశోధనలలో తేలింది. [4]
'రేడియేషన్' కు గురైనందువలన కలిగే విషమ పరిస్థితి నుండి రక్షణకు కూడా తులసి ఉపయోగ పడవచ్చునని కొన్ని అధ్యయనాలు సూచించాయి.[5] అలాగే కంటి శుక్లాల సమస్యకు కూడా. [6]
[మార్చు] పురాణాలలో తులసి
తులసిని గురించి హిందూమతంలో ఎన్నో కధలు, నమ్మకాళు, ఆచారాలు ఉన్నాయి.
- బృందాదేవి కధ
--వ్రాయాలి
- తులాభారం
శ్రీ కృష్ణ తులాభారం కధలో -సత్యభామ బారువులకొలది బంగారం వేసినా సరితూగని కృష్ణుడు రుక్మిణి ఒక్క తులసి ఆకు వేయగానే తూగాడు. భగవంతుడు భక్తికి అందుతాడని ఈ గాధ సందేశం.
[మార్చు] ఆచారాలలో తులసి
తులసికి సంబంధించిన ఆచారాలకు మౌలికమైన నమ్మకాలు:
- తులసి విష్ణువునకు ప్రియమైన భక్తురాలు. విష్ణుపూజలో తులసిని విరివిగా వాడుతారు.
- తులసి పూజ చేస్తే మాంగల్యం చిరకాలం నిలుస్తుంది.
- తులసి ఉన్నచోట దుష్ట శక్తులు ప్రవేశించవు.
- ఉదయాన్నే తులసిని దర్శించుకయంటే పాపాలు నశిస్తాయి.
కార్తీక శుక్ల ఏకాదశినాటినుండి పౌర్ణమి వరకు తులసీ వివాహం ఉత్సవం జరుగుతుంది.
- ఇతర మతాలలో
- ఏసు క్రీస్తును శిలువ వేసిన స్థలంలో తులసి పెరిగిందని ఒక కధ.
- షియా రచనలలో కూడా తులసి ప్రస్తావన ఉంది
[1].
[మార్చు] తులసిని గురించిన సూక్తులు, ప్రార్ధనలు
- "గంగ స్మరణం లాగానే తులసీ స్మరణం, హరి నామస్మరణం సకల పాపహరణము" - బృహన్నారదీయ పురాణం
- "తులసిని తాకినంతనే పవిత్రత సిద్ధిస్తుంది. తులసిని ప్రార్ధీంచడం వలన రోగములు నశిస్తాయి. తులసిని పూజించిన యమునిగూర్చి భయముండదు." - స్కంద పురాణం
- "తులసి ఆకులు, పూలు శ్రీకృష్ణునకు అత్యంత ప్రీతికరమైనవి." - భక్తి సిద్ధాంత సరస్వతీ ఠాకురా
- తులసీ స్తోత్రం నుండి
- జగద్ధాత్రి నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే
- యతో బ్రహ్మాదయో దేవాః సృష్టి స్థిత్యంత కారిణీ
- నమస్తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియే శుభే
- నమో మోక్షప్రదే దేవి నమ సంపత్ప్రదాయికే
- తులసీ శ్రీ మహాలక్ష్మీర్విద్యా యశస్వినీ
- ధర్మా ధర్మా నవా దేవీ దేవ దేవః మనఃప్రియా
- లక్ష్మీప్రియసఖీ దేవీద్యౌర్భమిరచలాచలా
- షోడశైతాని నామాని తులస్యాః కీర్తెయేన్నరః
- లభతే సుతరాం భక్తిమంతే విష్ణుపదం భవేత్
- తులసీ భూర్మహాలక్ష్మీః పద్మినీ శ్రీర్హరిప్రియా
- తులసి శ్రీసఖి శుభే పాపహారిణి పుణ్యదే
- నమస్తే నారదనుతే నారాయణ మనఃప్రియే
[మార్చు] దేవతగా తులసి
The presence of a Tulsi plant symbolizes the religious bent of a Hindu family. In many traditions (i.e Vaishnavism), a household is considered incomplete if it doesn't have a Tulsi plant. Many families have the Tulsi planted in a specially built structure, which has images of deities installed on all four sides, and an alcove for small earthen oil lamp. Some households can even have up to a dozen Tulsi plants on the verandah or in the garden forming a "Tulsi-van" or "Tulsivrindavan" — a miniature basil forest.
Places that tend to inspire concentration and places ideal for worship, according to the Gandharva tantra, include "grounds overgrown with Tulsi plants". The Tulsi Manas Mandir at Varanasi is one such famous temple, where Tulsi is worshipped along with other devas (demi-gods/goddesses). Vaishnavites, or followers of Vishnu, revere the Tulsi leaf because it pleases Vishnu the most and thus is as an inherent part of offerings of naivedya. They also wear beaded necklaces made of Tulsi stems. The manufacture of these Tulsi necklaces is a cottage industry in places of pilgrimage and temple towns. Another name for Tulsi within the Gaudiya Vaishnava tradition is Vrindadevi, meaning 'the goddess of Vrindavan'.
[మార్చు] తులసి పూజ
On a specific day each year known as 'Kartik Shukla Dwadashi' (usually about two weeks after Diwali) there is a tradition wherein Tulsi plants will be beautifully decorated with structures made of sugarcane, mango leaves and flowers and then a puja (form of worship) is offered.
As with Diwali celebrations there are usually clay lamps lit around the Tulsi plant and the house. In some parts of India people will have also have fireworks displays to mark the occasion. In northern India and in Gaudiya Vaishnava communities it is called the 'Tulsi vivah' or the wedding day of Tulsi with Krishna in his Sila form.
[మార్చు] ఇవి కూడా చూడండి
- List of basil cultivars
- Lakshmi
- Lotus Flower
[మార్చు] మూలాలు, వనరులు
- ↑ Indian J Exp Biol. 1999 Mar;37(3):248-52.
- ↑ Prakash P, Gupta N. Therapeutic uses of Ocimum sanctum Linn (Tulsi) with a note on eugenol and its pharmacological actions: a short review.
- ↑ Effect of Ocimum sanctum Leaf Powder on Blood Lipoproteins, Glycated Proteins and Total Amino Acids in Patients with Non-insulin-dependent Diabetes Mellitus. Journal of Nutritional & Environmental Medicine. V. RAI MSC, U. V. MANI MSC PHD FICN AND U. M. IYER MSC PHD. Volume 7, Number 2 / June 1, 1997. p. 113 - 118
- ↑ Evaluation of Hypoglycemic and Antioxidant Effect of Ocimum Sanctum,. Jyoti Sethi, Sushma Sood, Shashi Seth, and Anjana Talwar. Indian Journal of Clinical Biochemistry, 2004, 19 (2) 152-155.
- ↑ Devi, P. Uma; Ganasoundari, A.. Modulation of glutathione and antioxidant enzymes by Ocimum sanctum and its role in protection against radiation injury. Indian Journal of Experimental Biology, v.37, n.3, 1999. March,:262-268.
- ↑ Sharma, P; Kulshreshtha, S; Sharma, A L. Anti-cataract activity of Ocimum sanctum on experimental cataract. Indian Journal of Pharmacology, v.30, n.1, 1998:16-20
[మార్చు] బయటి లింకులు
[మార్చు] తులసి మాత
- Vrindadevi (Tulsi) - Vrindavan homepage
- Traditional Songs about Tulsi devi
- Tulasi Devi: The Sacred Tree
- The Story of Tulsi devi
- Tulasi Devi - an overview
- Tulsi Worship
[మార్చు] తులసి ఉపయోగాలు
- The Holy Herb
- Basil: Herb Society of America Guide
- Medicinal benefits of tulasi
- Holy Basil to Combat Stress?
- Plant Cultures: botany, history and uses of holy basil
- Holy Basil-Tulsi
- Tulsi Queen of Herbs (PDF Download)
[మార్చు] తులసి పెంపకం
[మార్చు] ఇతరాలు
మూస:Herbs & spices