వికీపీడియా నుండి
* ఈ యేడాది 12 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
* గూడవల్లి రామబ్రహ్మం రూపొందించిన రైతుబిడ్డ ఈసారీ సంచలనం సృష్టించింది. మూడు జిల్లాల్లో జమీందార్లు ఈ చిత్ర ప్రదర్శనను ఆపు చేయించారు.
అయినా రాత్రిపూట పొలాల్లో తెరలు కట్టి ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తే జనం తండోపతండాలుగా వచ్చి చూడటం గురించి ఆ నాటి ప్రేక్షకులు నేటికీ కథలుగా చెప్పుకుంటారు.
* వాహినీ పతాకంపై బి.యన్.రెడ్డి తెరకెక్కించిన వందేమాతరం, వై.వి.రావు రూపొందించిన మళ్ళీ పెళ్ళి, పి.పుల్లయ్య
దర్శకత్వం వహించిన శ్రీ వేంకటేశ్వర మహత్యం, భానుమతి తొలి చిత్రం వరవిక్రయంకూడా ప్రజాదరణ పొందాయి.
* వందేమాతరం సినిమాలో మొదటిసారిగా నేపధ్య గానాన్ని వాడుకున్నారు. కానీ ఇది చిన్నపిల్లవానికి కావడం వల్ల దేవత సినిమాకు పాడిన
యెమ్.యెస్.రామారావు గారు మొదటి నేపధ్య గాయకుడిగా గుర్తింపు పొందారు.
- జయప్రద
- మహానంద
- మళ్ళీ పెళ్ళి
- పాండురంగ విఠల్
- పాశుపతాస్త్రం
- రాధాకృష్ణ
- రైతుబిడ్డ
- ఉష
- వందేమాతరం
- వరవిక్రయం --> భానుమతి తొలి చిత్రం
- అమ్మ
- బాలాజీ లేదా శ్రీ వేంకటేశ్వర మహత్యం