బుచ్చిరెడ్డిపాలెము
వికీపీడియా నుండి
బుచ్చిరెడ్డిపాలెము మండలం | |
![]() |
|
జిల్లా: | నెల్లూరు |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | బుచ్చిరెడ్డిపాలెము |
గ్రామాలు: | 14 |
జనాభా (2001 లెక్కలు) | |
---|---|
మొత్తము: | 72.566 వేలు |
పురుషులు: | 36.358 వేలు |
స్త్రీలు: | 36.208 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 70.35 % |
పురుషులు: | 78.05 % |
స్త్రీలు: | 62.69 % |
చూడండి: నెల్లూరు జిల్లా మండలాలు |
బుచ్చిరెడ్డిపాలెము , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నెల్లూరు జిల్లాకు చెందిన ఒక పెద్ద మండలము మరియు పట్టణము. నెల్లూరు నుండి 15 కి.మీ.ల దూరములో ఉన్న ఈ పట్టణము నెల్లూరు - ముంబైని కలుపుతున్న రాష్ట్ర రహదారి మీద ఉన్నది. సమీప రైల్వే స్టేషన్ నెల్లూరులో, ఓడరేవు కృష్ణపట్నము వద్ద మరియు విమానాశ్రయము రేణిగుంటలో కలవు. బుచ్చిరెడ్డిపాలెము మండలము యొక్క జనాభా దాదాపు 30 వేలు. ఇక్కడి ప్రజల ముఖ్య జీవనాధారము వ్యవసాయము మరియు వ్యాపారము. వరి మరియు చెరుకు పండిస్తారు. రొయ్యలు మరియు చేపల పెంపకము (ఆక్వా కల్చర్) కూడా చేస్తారు. మండల ప్రజల మనోరంజనము కొరకు ఆరు సినిమా థియేటర్లు కలవు.
[మార్చు] విశేషాలు
బుచ్చిరెడ్డిపాలెము విస్తారమైన ఆక్వా కల్చర్ కు ప్రసిద్ధి చెందినది. ప్రఖ్యాత జొన్నవాడ కామాక్షి ఆలయము మరియు పల్లవుల నాటి కోదండ రామస్వామి ఆలయములు ఇక్కడే కలవు. బుచ్చిరెడ్డిపాలెము, అనేక మంది స్వతంత్ర సమరయోధులు మరియు రాజకీయవేత్తలను దేశానికి అందించినది. ఉత్తర ప్రదేశ్ తొలి గవర్నర్ గా పనిచేసిన బెజవాడ గోపాలరెడ్డి మరియు ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు ఏ.ఎం.రత్నం బుచ్చిరెడ్డిపాలెముకు చెందిన వారే. అతి దగ్గరలొ కనిగిరి రిజర్వాయర్ కలదు.
[మార్చు] గ్రామాలు
- చెల్లయపాలెం
- దామరమడుగు
- ఇసకపాలెం
- జొన్నవాడ
- కలయకగల్లు
- కావేటిపాలెం
- మినగల్లు
- మునులపూడి
- నాగమాంబాపురం
- పంచేడు
- పెనుబల్లి
- రేబాల
- శ్రీరంగరాజాపురం
- వవ్వేరు
[మార్చు] నెల్లూరు జిల్లా మండలాలు
సీతారాంపురము | వరికుంటపాడు | కొండాపురం | జలదంకి | కావలి | బోగోలు | కలిగిరి | వింజమూరు | దుత్తలూరు | ఉదయగిరి | మర్రిపాడు | ఆత్మకూరు | అనుమసముద్రంపేట | దగదర్తి | ఆల్లూరు | విడవలూరు | కొడవలూరు | బుచ్చిరెడ్డిపాలెము | సంగం | చేజెర్ల | అనంతసాగరం | కలువోయ | రాపూరు | పొదలకూరు | నెల్లూరు | కోవూరు | ఇందుకూరుపేట | తోటపల్లిగూడూరు | ముత్తుకూరు | వెంకటాచలము | మనుబోలు | గూడూరు | సైదాపురము | దక్కిలి | వెంకటగిరి | బాలాయపల్లె | ఓజిలి | చిల్లకూరు | కోట | వాకాడు | చిత్తమూరు | నాయుడుపేట | పెళ్లకూరు | దొరవారిసత్రము | సూళ్లూరుపేట | తడ