భారత ఎన్నికల కమిషను
వికీపీడియా నుండి
భారత రాజకీయ వ్యవస్థ |
రాజ్యాంగం |
భారత దేశం |
శాసన వ్యవస్థ |
కార్య నిర్వాహక వ్యవస్థ |
న్యాయ వ్యవస్థ
|
రాష్ట్రాలు |
ఎన్నికలు |
|
స్వతంత్ర భారత దేశంలో ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్యాంగం ఏర్పాటు చేసిన సంస్థ, భారత ఎన్నికల కమిషను. 1950 జనవరి 25 న ఏర్పాటు చేయబడిన ఈ కమిషను సుప్రీం కోర్టు వలెనే, రాజ్యాంగం ఏర్పరచిన వ్యవస్థ, ప్రభుత్వ నియంత్రణకు లోబడి ఉండదు.
విషయ సూచిక |
[మార్చు] కమిషను వ్యవస్థ
దేశంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసన సభలు, శాసన మండళ్ళకు జరిగే ఎన్నికలను కమిషను నిర్వహిస్తుంది. ఈ ఎన్నికల నిర్వహణలో పర్యవేకషణ, మార్గ నిర్దేశకత్వం, నియంత్రణ చేయవలసిన బాధ్యతను రాజ్యాంగం కమిషనుపై ఉంచింది.
ఎన్నికల కమిషను అధినేతను ప్రధాన ఎన్నికల కమిషనర్ అంటారు. మొదట్లో ఒక కమిషనరు ఉండేవారు. 1989 అక్టోబర్ 16 న మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నియమించారు. అయితే అది కేవకం 1990 జనవరి 1 వరకు మాత్రమే కొనసాగింది. మళ్ళీ 1993 అక్టోబర్ 1 న ఈ నియామకాలు జరిగాయి. అప్పటి నుండి ముగ్గురు సభ్యుల కమిషను బాధ్యతలు నిర్వహిస్తూ వస్తూంది.
ముగ్గురు కమిషనర్లతో పాటు ఢిల్లీ లోని కమిషను కార్యాలయంలో కొంత మంది డిప్యూటీ కమిషనర్లు, 300 మంది ఇతర అధికారులు, సిబ్బంది ఉంటారు. రాష్ట్రాల్లో, ప్రధాన ఎన్నికల కమిషనరుచే నియమించబడే ముఖ్య ఎన్నికల అధికారి, కొందరు సహాయక సిబ్బంది ఉంటారు. అయితే ఎన్నికల సమయంలో మాత్రం, ఎన్నికల నిర్వహణలో పాల్గొనే 50 లక్షల పైచిలుకు సిబ్బంది యావత్తూ తాత్కాలికంగా ఎన్నికలు ముగిసేవరకు కమిషను అదుపాజ్ఞలలో పనిచేస్తారు.
ప్రధాన ఎన్నికల కమిషనరును, ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తారు. పదవీకాలం ఐదేళ్ళు, లేదా ఆ వ్యక్తికి 65 ఏళ్ళ వయసు వచ్చే వరకు -ఏది ముందయితే అది.
[మార్చు] కార్య కలాపాలు
రాజ్యాంగ సంస్థ అయిన కమిషను ఎన్నికలకు సంబంధించినంత వరకు సర్వ స్వతంత్ర సంస్థ. దీని ముఖ్య కార్య కలాపాలు ఇలా ఉన్నాయి.
- రాజకీయ పార్టీలకు గుర్తింపును ఇవ్వడం, రద్దు చేయడం.
- ఎన్నికల షెడ్యూలును నిర్ణయించడం, ప్రక్టించడం, అమలు చేయడం
- ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయడం, అతిక్రమించిన వారిపై చర్యలు చేపట్టడం.
- స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించడం
ఇటీవలి కాలంలో ఎన్నికల నిర్వహణను సంస్కరిస్తూ కమిషను కొన్ని చర్యలు చేపట్టింది. వీటిలో కొన్ని:
- ఎలెక్ట్రానిక్ ఓటింగు మిషన్లను ప్రవేశపెట్టడం
- రాజకీయాల్లో నేరస్థులను అడ్డుకోవడం
- ఓటరు గుర్తింపు పత్రాలను ప్రవేశపెట్టడం
- ఓటరు జాబితాల ఎలెక్ట్రానికీకరణ
[మార్చు] పదునెక్కిన కమిషను
పూర్వపు రోజుల్లో కమిషను కార్యనిర్వాహ వ్యవస్థకు అనుకూలంగా ఉంటూ ఉండేది. ఇటీవలి కాలంలో- ముఖ్యంగా 1990 నుండి - కమిషను మరింత చైతన్యవంతంగా, ప్రభావవంతంగా వ్యవహరిస్తూంది. ఇప్పటికే ఉన్న నియమాలను కఠినంగా అమలు చెయ్యదంతో పాటు, కొన్ని కొత్త నియమాలను కూడా ప్రవేశపెట్టింది. కొన్ని సందర్భాలలో కొన్ని రాజకీయ పార్టీలతో కొందరు కమిషనర్లకు ఘర్షణ నెలకొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నా, మొత్తం మీద కమిషను పనితీరు మాత్రం ఎంతో మెరుగు పడింది
[మార్చు] ప్రధాన ఎన్నికల కమిషనర్లు
పేరు | పదవీకాలం |
---|---|
సుకుమార్ సేన్ | మార్చి 21 1950 నుండి డిసెంబర్ 19 1958 |
కె.వి.కె.సుందరం | డిసెంబర్ 20 1958 నుండి సెప్టెంబర్ 30 1967 |
ఎస్.పి.సేన్‌వర్మ | అక్టోబర్ 1 1967 నుండి సెప్టెంబర్ 30 1972 |
డా.నాగేంద్ర సింగ్ | అక్టోబర్ 1 1972 నుండి ఫిబ్రవరి 6 1973 |
టి.స్వామినాథన్ | ఫిబ్రవరి 7 1973 నుండి జూన్ 17 1977 |
ఎస్.ఎల్.షక్దర్ | జూన్ 18 1977 నుండి జూన్ 17 1982 |
ఆర్.కె.త్రివేది | జూన్ 18 1982 నుండి డిసెంబర్ 31 1985 |
ఆర్.వి.ఎస్.పేరిశాస్త్రి | జనవరి 1 1986 నుండి నవంబర్ 25 1990 |
వి.ఎస్.రమాదేవి | నవంబర్ 26 1990 నుండి డిసెంబర్ 11 1990 |
టి.ఎన్.శేషన్ | డిసెంబర్ 12 1990 నుండి డిసెంబర్ 11 1996 |
ఎం.ఎస్.గిల్ | డిసెంబర్ 12 1996 నుండి జూన్ 13 2001 |
జె.ఎం.లింగ్డో | జూన్ 14 2001 నుండి ఫిబ్రవరి 7 2004 |
టి.ఎస్.కృష్ణ మూర్తి | ఫిబ్రవరి 8 2004 నుండి మే 15 2005 |
బి.బి.టాండన్ | మే 16 2005 నుండి |