చతుర్భుజి
వికీపీడియా నుండి
చతుర్భుజం లేదా చతుర్భుజి (Quadrilateral), నాలుగు సరళ భుజాలు (straight sides) కల రేఖాగణిత ఆకారం. ఒక చతుర్భుజి లోని నాలుగు కోణాల మొత్తం 360 డిగ్రీలు లేదా "2పై" రేడియనులు.
[మార్చు] వివిధ చతుర్భుజులు
- 'చతుర్భుజం' (quadrilateral), నాలుగు సరళ భుజాలు (straight sides) కల రేఖాచిత్రం.
- 'దీర్ఘచతురస్రం' (rectangle), ఒక చతుర్భుజంలో నాలుగు కోణాలూ లంబ కోణాలు అయి, ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉండి, సమానమైన పొడుగు ఉన్న ఆకారం.
- 'రాంబస్' (rhombus),ఒక చతుర్భుజంలో అన్ని భుజాలూ సమానమైన పొడుగు ఉన్న ఆకారం.
- 'చతురస్రం' (square), ఒక చతుర్భుజంలో నాలుగు కోణాలూ లంబ కోణాలు అయి, ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉండి, అన్ని భుజాలు సమానమైన పొడుగు ఉన్న ఆకారం.
- 'సమాంతర చతుర్భుజం' (parallelogram), ఎదురెదురుగా ఉన్న భుజాలు రెండూ ఒకే కొలత కలిగి ఉండటమే కాకుండా ఆ భుజాలు సమాంతరంగా ఉన్న ఆకారం.
- 'ట్రెపీజియం' (trapezium), ఎదురెదురుగా ఉన్న ఒక జత భుజాలు సమాంతరంగా ఉన్న ఆకారం. దీన్ని అమెరికాలో 'ట్రెపిజోయిడ్' (trapezoid) అంటారు.
రేఖా గణితం - బహుభుజిలు |
---|
త్రిభుజం • చతుర్భుజి • పంచభుజి •షడ్భుజి • సప్తభుజి • అష్టభుజి • Enneagon (Nonagon) • Decagon • Hendecagon • Dodecagon • Triskaidecagon • Pentadecagon • Hexadecagon • Heptadecagon • Enneadecagon • Icosagon • Chiliagon • Myriagon |