బెల్లంకొండ
వికీపీడియా నుండి
బెల్లంకొండ మండలం | |
జిల్లా: | గుంటూరు |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | బెల్లంకొండ |
గ్రామాలు: | 13 |
జనాభా (2001 లెక్కలు) | |
---|---|
మొత్తము: | 30.79 వేలు |
పురుషులు: | 15.6 వేలు |
స్త్రీలు: | 15.19 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 47.06 % |
పురుషులు: | 59.15 % |
స్త్రీలు: | 34.79 % |
చూడండి: గుంటూరు జిల్లా మండలాలు |
పచ్చని పరిసరాలలో అందమైన ప్రకృతి సౌందర్యంలో ఒదిగి పోయిన ఒక పల్లెటూరు - బెల్లంకొండ. గుంటూరు జిల్లాలో గుంటూరు-పొందుగల రహదారి పక్కన సత్తెనపల్లికి 19 కి మీల దూరంలో ఉన్నది ఈ ప్రాచీనమైన గ్రామం. బెల్లంకొండ రైల్వే స్టేషను గుంటూరు మాచర్ల రైలు మార్గంలో ఉంది.
వెలమ దొరలైన మల్రాజు వంశస్తులు బెల్లంకొండ రాజ్యాన్ని పాలించారు. కొండవీటి రెడ్డి రాజులు నిర్మించిన దుర్గం ఈ ఊరిలోని ప్రముఖ ఆకర్షణ. దుర్గంలోని ముఖ్యమైన స్థలాలను కలుపుతూ ఒకే రాతిలో కట్టిన గోడ, వాయవ్యం లోను, నైరుతి లోను నిర్మించిన బురుజులు దుర్గం లోని ముఖ్యాంశాలు. 1511 లో శ్రీ కృష్ణదేవ రాయలు అప్పటివరకు గజపతుల ఆధీనములో ఉన్న బెల్లంకొండ దుర్గమును స్వాధీనం చేసుకున్నాడు. విజయనగర సామ్రాజ్యము పతనమయ్యేవరకు బెల్లంకొండ రాయల పాలనలోనే ఉన్నది. సదాశివ రాయలు కాలములో ఈ ప్రాంతాన్ని మహమండళేశ్వరుడు యారా రామరాజ తిరుమలరాజయ్యదేవ నుండి జిళ్లెళ్ల వేంగళయ్యదేవ నాయంకరముగా పొంది పరిపాలించినాడని నకరికల్లు శాసనము (1554) ద్వారా తెలుస్తున్నది.
వివాదాస్పదమైన పులిచింతల ప్రాజెక్టు వలన ముంపుకు గురయ్యే గ్రామాలు ఎక్కువగా ఈ మండలంలోనివే. అవి: పులిచింతల, కొల్లూరు, చిట్యాల, కేతవరం, బోదనం.
[మార్చు] మండలంలోని గ్రామాలు
పులిచింతల, కొల్లూరు(బెల్లంకొండ), చిట్యాల (బెల్లంకొండ మండలం), కేతవరం (బెల్లంకొండ మండలం), వెంకటాయపాలెం (బెల్లంకొండ మండలం), బోదనం, ఎమ్మాజీగూడెం, మన్నేసుల్తాన్‌పాలెం, పాపయ్యపాలెం, చంద్రాజుపాలెం, వన్నయ్యపాలెం, మచ్చయ్యపాలెం, బెల్లంకొండ
[మార్చు] బయటి లింకులు
[మార్చు] గుంటూరు జిల్లా మండలాలు
మాచెర్ల | రెంటచింతల | గురజాల | దాచేపల్లి | మాచవరం | బెల్లంకొండ | అచ్చంపేట | క్రోసూరు | అమరావతి | తుళ్ళూరు | తాడేపల్లి | మంగళగిరి | తాడికొండ | పెదకూరపాడు | సత్తెనపల్లి | రాజుపాలెం(గుంటూరు) | పిడుగురాళ్ల | కారంపూడి | దుర్గి | వెల్దుర్తి(గుంటూరు) | బోళ్లపల్లి | నకరికల్లు | ముప్పాళ్ల | ఫిరంగిపురం | మేడికొండూరు | గుంటూరు | పెదకాకాని | దుగ్గిరాల | కొల్లిపర | కొల్లూరు | వేమూరు | తెనాలి | చుండూరు | చేబ్రోలు | వట్టిచెరుకూరు | ప్రత్తిపాడు | యడ్లపాడు | నాదెండ్ల | నరసరావుపేట | రొంపిచెర్ల | ఈపూరు | శావల్యాపురం | వినుకొండ | నూజెండ్ల | చిలకలూరిపేట | పెదనందిపాడు | కాకుమాను | పొన్నూరు | అమృతలూరు | చెరుకుపల్లి | భట్టిప్రోలు | రేపల్లె | నగరం | నిజాంపట్నం | పిట్టలవానిపాలెం | కర్లపాలెం | బాపట్ల