మాచెర్ల
వికీపీడియా నుండి
మాచర్ల పేరుతో ఉన్న ఇతర పేజీల కొరకు మాచర్ల (అయోమయ నివృత్తి) పేజీ చూడండి.
మాచెర్ల మండలం | |
జిల్లా: | గుంటూరు |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | మాచర్ల |
గ్రామాలు: | 12 |
జనాభా (2001 లెక్కలు) | |
---|---|
మొత్తము: | 100.21 వేలు |
పురుషులు: | 50.83 వేలు |
స్త్రీలు: | 49.38 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 56.98 % |
పురుషులు: | 68.29 % |
స్త్రీలు: | 45.43 % |
చూడండి: గుంటూరు జిల్లా మండలాలు |
మాచర్ల, గుంటూరుకు 110 కి.మీ. దూరంలోనూ, నాగార్జునసాగర్ కు 25 కి.మీ. దూరంలోనూ ఉన్న ఓ పట్టణము. ఈ పట్టణము హైహవ రాజుల కాలంలో నిర్మించిన చెన్నకేశవస్వామి దేవాలయమునకు ప్రసిద్ది. పురాతన కాలములో దీనిని మహాదేవిచర్ల అని పిలిచేవారు. ఇక్కడ జరిగే వార్షిక ఉత్సవము చాలా ఘనముగా నిర్వహింపబడును, ఆ సమయములో ఇక్కడికి చాలా దూరమునుండి యాత్రికులూ, భక్తులూ వస్తుంటారు. ఈ దేవాలయము 12-13 వ శతాబ్దాలలో నిర్మించబడినది. ఈ దేవాలయము ఎదురుగా ఓ పెద్ద ధ్వజస్థంభము చెక్కతో చేయబడి ఇత్తడితో కప్పబడినదై వెలుగొందుతుంది. గుడికి ఎదురుగా నాలుగుస్థంభాల మంటపాలు కలవు.
ఈ పట్టణము హైదరాబాదు నుండి 160 కి.మీ. దూరంలో ఉంది. వివిధ ప్రాంతాల నుండి మాచర్లను కలుపుతూ రోడ్డు మార్గాలు, రైలు మార్గం ఉన్నాయి. ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులే కాక, ప్రైవేటు బస్సులు కూడా నడుస్తూ ఉన్నాయి.
విషయ సూచిక |
[మార్చు] చూడదగ్గ ప్రదేశాలు
మాచర్లకు 25 కి.మీ. దూరంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు, 16 కి.మీ. దూరంలో ఎత్తిపోతల జలపాతం ఉన్నాయి.
[మార్చు] మండలంలోని గ్రామాలు
దక్షిణ విజయపురి, గన్నవరం (మాచర్ల మండలం), నాగులవరం, కొప్పునూరు, పసువేముల, తాళ్ళపల్లె, కొత్తపల్లె(మాచర్ల), ఆమని జమ్మలమడక, కంభంపాడు (మాచర్ల మండలం), ముత్యాలంపాడు (మాచర్ల మండలం), రాయవరం(మాచర్ల), మాచర్ల (గ్రామీణ), మాచర్ల (పట్టణ)
[మార్చు] బయటి లింకులు
[మార్చు] గుంటూరు జిల్లా మండలాలు
మాచెర్ల | రెంటచింతల | గురజాల | దాచేపల్లి | మాచవరం | బెల్లంకొండ | అచ్చంపేట | క్రోసూరు | అమరావతి | తుళ్ళూరు | తాడేపల్లి | మంగళగిరి | తాడికొండ | పెదకూరపాడు | సత్తెనపల్లి | రాజుపాలెం(గుంటూరు) | పిడుగురాళ్ల | కారంపూడి | దుర్గి | వెల్దుర్తి(గుంటూరు) | బోళ్లపల్లి | నకరికల్లు | ముప్పాళ్ల | ఫిరంగిపురం | మేడికొండూరు | గుంటూరు | పెదకాకాని | దుగ్గిరాల | కొల్లిపర | కొల్లూరు | వేమూరు | తెనాలి | చుండూరు | చేబ్రోలు | వట్టిచెరుకూరు | ప్రత్తిపాడు | యడ్లపాడు | నాదెండ్ల | నరసరావుపేట | రొంపిచెర్ల | ఈపూరు | శావల్యాపురం | వినుకొండ | నూజెండ్ల | చిలకలూరిపేట | పెదనందిపాడు | కాకుమాను | పొన్నూరు | అమృతలూరు | చెరుకుపల్లి | భట్టిప్రోలు | రేపల్లె | నగరం | నిజాంపట్నం | పిట్టలవానిపాలెం | కర్లపాలెం | బాపట్ల