Static Wikipedia February 2008 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu

Web Analytics
Cookie Policy Terms and Conditions మంగళగిరి - వికిపీడియా

మంగళగిరి

వికీపీడియా నుండి

మంగళగిరి మండలం
జిల్లా: గుంటూరు
రాష్ట్రము: ఆంధ్ర ప్రదేశ్
ముఖ్య పట్టణము: మంగళగిరి
గ్రామాలు: 12
జనాభా (2001 లెక్కలు)
మొత్తము: 136.26 వేలు
పురుషులు: 69.00 వేలు
స్త్రీలు: 67.25 వేలు
అక్షరాస్యత (2001 లెక్కలు)
మొత్తము: 69.62 %
పురుషులు: 77.39 %
స్త్రీలు: 61.66 %
చూడండి: గుంటూరు జిల్లా మండలాలు

మంగళగిరి గుంటూరు జిల్లాలో గుంటూరు-విజయవాడ జాతీయ రహదారిపై గుంటూరుకు 20 కి మీ ల దూరంలో ఉన్న చారిత్రక పట్టణం. ప్రసిద్ధి చెందిన, అతి పురాతన మైన లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఇక్కడ ఉంది. ఇక్కడి లక్ష్మీ నరసింహ స్వామిని పానకాల స్వామి అని అంటారు. మంగళగిరి అనగానే పానకాల స్వామి స్ఫురణకు రావడం సహజం. మంగళాగిరి గుంటూరు జిల్లా లోని ప్రముఖ పట్టణం. ఇది మంగళగిరి శాసనసభ నియోజకవర్గ కేంద్రం కూడా.

విషయ సూచిక

[మార్చు] పాలకులు

మంగళగిరి క్రీ పూ 225 నాటికే ఉనికిలో ఉన్నట్లు తెలుస్తోంది. ధాన్యకటకం రాజధానిగా క్రీ పూ 225 నుండి క్రీ శ 225 వరకు పాలించిన ఆంధ్ర శాతవాహనుల రాజ్యంలో మంగళగిరి ఒక భాగం. క్రీ శ 225 నుండి క్రీ శ 300 వరకు ఇక్ష్వాకులు పరిపాలించారు. ఆ తరువాత మంగళగిరి పల్లవుల ఏలుబడి లోకి వచ్చింది. పిమ్మట కంతేరు రాజధానిగా పాలించిన ఆనందగోత్రిజుల అధీనంలోకి వచ్చింది. క్రీ శ 420 నుండి క్రీ శ 620 వరకు విష్ణు కుండినులు పాలించారు. రెండవ మాధవ వర్మ విజయవాడ రాజధానిగా పాలించాడు. క్రీ శ 630 నుండి చాళుక్యుల ఏలుబడి సాగింది.


క్రీ శ 1180 నాటి పలనాటి యుద్ధం తరువాత మంగళగిరి కాకతీయుల పాలనలోకి వచ్చింది. 1323 లో, ఢిల్లీ సుల్తానులు కాకతీయులను ఓడించాక మంగళగిరిపై సుల్తానుల పెత్తనం మొదలయింది. 1353 లో, కొండవీడు రాజధానిగా రెడ్డి రాజులు పాలించారు. 1424 లో, కొండవీడు పతనం చెందాక, మంగళగిరి గజపతుల ఏలుబడిలోకి వచ్చింది.


1515 లో ఆంధ్ర భోజుడని ప్రసిద్ధి కెక్కిన శ్రీ కృష్ణదేవ రాయలు గజపతులను ఓడించిన తరువాత మంగళగిరి రాయల అధీనమయింది. విజయనగర రాజ్యంలోని 200 పట్టణాలలో మంగళగిరి ఒకటి. 1565 లో జరిగినతళ్ళికోట యుద్ధంతో విజయనగర రాజ్య పతనం పరిపూర్ణమైన తరువాత, మంగళగిరికి గోల్కొండ కుతుబ్‌ షాహి లు ప్రభువులయ్యారు. కుతుబ్‌ షాహిలు కొండవీడును 14 భాగాలు చేయగా వాటిలో మంగళగిరి ఒకటి. ఆ సమయంలో మంగళగిరి విభాగంలో 33 గ్రామాలు ఉండేవి. 1750 నుండి 1758 వరకు ఫ్రెంచి పాలనలోను, 1758 నుండి 1788 వరకు నిజాము నవాబు పాలనలోను ఉన్నది.


18-9-1788 న, హైదరాబాదు నవాబు అయిన నిజాము ఆలీ ఖాను గుంటూరును బ్రిటిషు వారికి ఇచ్చివేసాడు. బ్రిటిషు వారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు ను ఈ ప్రాంతానికి జమీందారు గా నియమించారు. ఆయన ఇక్కడి దేవాలయానికి గోపురం నిర్మింపజేసాడు. 1788 నుండి 1794 వరకు ఈస్ట్‌ ఇండియా కంపెనీ వారి సర్క్యూట్‌ కమిటీ మంగళగిరిని పాలించింది. 1794 లో, సర్క్యూట్‌ కమిటీ ని రద్దు చేసి, 14 మండలాలతో గుంటూరు జిల్లాను ఏర్పాటు చేసారు. 1859 లో, గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాతో ఏకమై, మళ్ళీ 1-10-1904 న విడివడి ప్రత్యేక జిల్లాగా రూపొందింది. అప్పటినుండి, మంగళగిరి గుంటూరు జిల్లాలో భాగంగా ఉంటూ వచ్చింది.

[మార్చు] ప్రముఖుల సందర్శనలు

ప్రాచీన కాలం నుండీ, చేనేతకు, వైష్ణవ మతానికి ప్రసిద్ధి చెందింది. ఎందరో చారిత్రక ప్రముఖులు మంగళగిరిని సందర్శించారు. వారిలో అద్వైత సిద్ధాంత కర్త ఆది శంకరాచార్య, విశిష్టాద్వైతాన్ని ప్రవచించిన రామానుజాచార్యులు, ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మధ్వాచార్య్లు ప్రముఖులు. వల్లభాచార్య్లు ఇక్కడి నుండే తమ ప్రవచనాలను వినిపించారు. చైతన్య మహాప్రభు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించారు, వారి పాద ముద్రలు కొండ వద్ద కనిపిస్తాయి. తాళ్ళపాక అన్నమాచార్యుని మనుమడు, శ్రీ తాళ్ళపాక చిన తిరుమలయ్య 1561 లో రామానుజ సమాజానికి ఇక్కడ భూమి దానం చేసాడు.


శ్రి కృష్ణదేవ రాయల కాలంలో మహామంత్రి తిమ్మరుసు మంగళగిరిని సందర్శించి, విజయ స్థూపం నిర్మింపజేసాడు. కొండవీటి మంత్రి సిద్ధరాజు తిమ్మరాజు గుడిని అభివృద్ధి చేసి, దానికి భూదానం చేసారు. అబ్బన కవి ఇక్కడి దేవాలయాన్ని అనేక సార్లు సందర్శించాడు. తన అనిరుద్ధ చరితను నరసింహ స్వామికి అంకితమిచ్చాడు.


1594 లో గోల్కొండ సుల్తాను కుతుబ్‌ ఆలీ మంగళగిరిని సందర్శించాడు. రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు జమీందారు హోదాలో అనేక పర్యాయాలు పర్యటించారు. మొహమ్మదు ఆలీ కుతుబ్‌ షా మంగళగిరికి వచ్చినపుడు పన్ను భారాన్ని తగ్గించి, శాసన స్థంభాన్ని నిర్మించాడు. 22-3-1679 న ఈస్ట్‌ ఇండియా కంపెనీ ముఖ్య అధికారి - స్ట్రైన్‌ షాం మాస్టర్‌ ఇక్కడి దేవాలయాన్ని దర్శించాడు. 20-11-1820తంజావూరు రాజు రాజా సిర్ఫోజి గుడిని దర్శించి, దక్షణావృత శంఖాన్ని బహూకరించాడు.


16-2-1962 న శ్రీ రామానుజ జియ్యరు (పెద జియ్యరు) స్వామి శ్రీ రామనామ క్రతు స్థుపాన్ని స్థాపించారు. 1982 లో మదర్‌ తెరెసా డాన్‌ బోస్కో వికలాంగుల పాఠశాలను దర్శించింది.

[మార్చు] కరువు కాటకాలు

1831 లో అతివృష్టి కారణంగా తైతులు పంటను కోల్పోయారు. మరుసటి యేడాది తుపాను కారణంగా పంటలు నాశనమయ్యాయి. 1833 లో భయంకరమైన కరువు ఏర్పడింది. ఈ కరువును నందన కరువు అనీ, గుంటూరు కరువు అని అనేవారు. డొక్కల కరువు అనీ పెద్ద కరువు అని కూడా అనేవారు. కరువు భీభత్సానికి గుంటూరు జిల్లాలోను చుట్టుపక్కల జిల్లాలలోను ఎక్క్కడ చూసినా శవాల గుట్టలు కనిపించేవి. కంపెనీ వారికి కరువును ఎదుర్కొనే శక్తీ, ఆసక్తి లేక లక్షలాది మంది బలయ్యారు. కేవలం గుంటూరు జిల్లా లోనే 5 లక్షల జనాభాలో 2 లక్షల వరకూ చనిపోయారంటే, కరువు తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. దాదాపు 20 ఏళ్ళ వరకు ప్రజలు, పొలాలు కూడా సాధారణ స్థితికి రాలేక పోయాయి. కరువు భీభత్సం గుంటూరు జిల్లాలో మరీ ఎక్కువగా ఉండటం చేత దీనిని గుంటూరు కరువు అన్నారు.


[మార్చు] దోపిడీలు

1780 లో మైసూరుకు హైదరాలీ రాజుగా ఉండే వాడు. అతని సేనాధిపతి నరసు మంగళగిరిని ఆక్రమించ ప్రయత్నించి, కుదరక, మంగళగిరినీ, చుట్టుపక్కల గ్రామాలైన కడవలకుదురు, వేటపాలెం, నిజాంపట్నం లను దోచుకొని పోయాడు. ఆ సమయంలో మంగళగిరి నిజాము సోదరుడు - బసాలత్‌ జంగు పాలనలో ఉంది.


పిండారీ అనేది ఒక వ్యవస్థీకృత దోపిడీ ముఠా. మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్‌ లలోని ఒక తెగ ఇది. వీరు ముఠాలుగా ఏర్పడి, గుర్రాలపై వచ్చి, గ్రామాలపై మెరుపుదాడి చేసి నగలూ, ధాన్యం దోచుకుపోయే వారు. 1814 లో దాదాపు 25,000 మంది పిండారీలు ఉండేవారు, 20,000 గుర్రాలుండేవి. 1816 లో కేవలం పదకొండున్నర రోజుల్లో 339 గ్రామాలను వారు దోచుకున్నారు. 1816 మార్చిలో 2000 గుర్రాలపై వచ్చి గుంటూరు జిల్లాలో 40 గ్రామాలను దోచుకున్నారు. ఎంతో మందిని చంపి, ఊళ్ళను తగలబెట్టెసారు. స్త్రీలను చెరబట్టి, బానిసలుగా అమ్మేసారు. వారిలో ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఎక్కడ చూసినా శవాలే. మంగళగిరిలోను అదే పరిస్థితి.


బ్రిటిషు వారి పాలనలో అడవులను ఆక్రమించి అక్కడి వారికి జీవన భృతి లేకుండా చేసారు. వారు చివరికి దొంగలుగా మారారు. బ్రిటిషు ప్రభుత్వం వివిధ ప్రదేశాల్లో వీరికి ప్రత్యేకంగా ఆవాసం కల్పించింది. 1913 లో అటువంటిదే ఒక స్థావరం మంగళగిరి వద్ద కృష్ణానదికి బకింగ్‌హాం కాలువకు మధ్య ఏర్పాటు చేసారు. అప్పటినుండి 1932 వరకు శాల్వేషను ఆర్మీ అనే సంస్థ దీనిని నిర్వహించేది. 1932 నుండి 1956 వరకు పోలీసు శాఖ నిర్వహణలో ఉండేది. 1956 లో సాంఘిక సంక్షేమ శాఖ్‌ అధీనంలో కి వచ్చింది. 1962 లో ప్రభుత్వం వారికి నేరస్తులనే ముద్రను తొలగించి, వారి జీవనార్ధమై 156 ఎకరాల భూమిని పంచింది.

[మార్చు] శాసన స్థంభం

ప్రధాన వీధిలో, రామాలయం వద్ద శాసన స్థంభం వీధి అనే వీధి ఉంది. ఈ వీధిలో ఎనిమిది మొఖాలు కలిగిన ఒక శాసనం ఉంది. ఈ కారణం చేత ఈ వీధికి ఆ పేరు వచ్చింది. ఈ శాసనంలో 46 లైన్లు తెలుగు లోను, 4 పెర్సియను లోను రాసి ఉన్నాయి. 1565 నుండి మంగళగిరి గోల్కొండ కుతుబ్‌ షాహిల పాలనలో ఉండేది. 1593 లో కుతుబ్‌ షాహి వృత్తి పన్ను బాగా పెంచేసాడు. అది కట్టలేని చేనేత కార్మికులు మచిలీపట్నం వంటి ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు. ఈ విషయం తెలిసిన సుల్తాను వాళ్ళను వెనక్కి రప్పించమని తన సేనాధిపతి ఖోజా ఆలీ ని ఆదేశించాడు. ఖోజా ఆలీ పుల్లరి తీసివేస్తున్నట్లు, ఇతర పన్నులను నాలుగు వాయిదాలలో కట్టవచ్చని ప్రకటించి అదే విషయాన్ని ఈ శాసనంపై రాయించాడు.

[మార్చు] పెద్ద కోనేరు

మంగళగిరి మధ్యలో, అర ఎకరం వైశాల్యంలో కోనేరొకటుంది. దీని పేరు కళ్యాణ పుష్కరిణి. 1558 లో విజయనగర రాజుల అధీనంలో ఉన్నపుడు దీనిని తవ్వించారు. చాలా లోతైన ఈ కోనేటికి నాలుగు వైపుల మెట్లు ఉన్నాయి. లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయానికి చెందిన ఈ కోనేటిలో రెండు బావులు ఉన్నట్లుగా చెబుతారు. గుడికి తూర్పున శివలింగం కలదు. 1832 నాటి కరువులో కోనేరు ఎండిపోయి, 9,840 తుపాకులు, 44 గుళ్ళు బయట పడ్డాయి. ఇవి పిండారీలకు చెందినవి. కోనేటి అడుగున బంగారు గుడి ఉందని ప్రజలు అనుకుంటారని 1883లో గార్డన్‌ మెకెంజీ కృష్ణా జిల్లా మాన్యువల్‌న్‌ లో రాసాడు. 19 వ శతాబ్దిలో శ్రీ మారెళ్ళ శినయ్య దాసు కోనేటిలో ఆంజనేయ స్వామి గుడిని నిర్మించి రెండెకరాల స్థలాన్ని దానమిచ్చాడు. ఎన్నో శతాబ్దుల పాటు ప్రజలీ కోనేటి నీటితో దేవునికి అభిషేకం జరిపించారు. 2004 లో కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రహరీ గోడ నిర్మించారు.

[మార్చు] రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు

రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు 1761 ఏప్రిల్‌ 20 న జగ్గన్న, అచ్చమ్మ దంపతులకు జన్మించాడు. 1788 నుండి 1817 వరకు మంగళగిరికి జమీందారుగా ఆయన వ్యవహరించాడు. ఆయన అధీనంలో 551 గ్రామాలు ఉండేవి. ఆ కాలంలో చెంచులుగ్రామాలపై బడి దోచుకుంటూ ఉండే వారు. ఈ దోపిడీలను అరికట్టడానికి ఆయన 150 మంది చెంచు నాయకులను ఆహ్వానించి, వారిని మట్టు పెట్టించాడు. దానితో ప్రజలకు దోపిడీల బెడద తగ్గినా, ఆయన అశాంతికి లొనై, పాప పరిహారార్ధం దేవాలయాల నిర్మాణం చెయ్యమన్న కొందరు పెద్దల సూచన మేరకు అనేక దేవాలయాలను కట్టించాడు. 1807-09 లో నరసింహ స్వామి దేవాలయానికి 11 అంతస్థుల గాలి గోపురాన్ని నిర్మింపజేసి ప్రజల జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఆయన 17-8-1817 న మరణించాడు.

[మార్చు] జయ స్థంభం - శ్రీ కృష్ణదేవ రాయల శాసనం

పానకాల స్వామి దేవాలయ మెట్ల మొదట్లో ఈ శాసనం ఉంది. శ్రీ కృష్ణదేవ రాయలచే ఈ శాసనం ప్రతిష్ఠింపబడినదని చెబుతారు. వాస్తవానికి ఇది రాయల మహామంత్రి తిమ్మరుసుకు చెందినది. 1515 జూన్‌ 23 న శ్రీ కృష్ణదేవ రాయలు కొండవీటిని జయించి ఈ శాసనం రాయించాడు. రాయల విజయాన్ని సూచించే ఈ స్థంభాన్ని జయ స్థంభం అన్నారు. అమరావతి పాలకుడైన నాదెండ్ల తిమ్మయ్య ఇచ్చిన 19 దాన శాసనాల ప్రసక్తి కూడా దీనిపై ఉన్నది. దీని లోని 198 వ వరుస నుండి 208 వ వరుస వరకు మూడు ముఖ్యమైన చారిత్రక సమాచారం కలిగి ఉంది.

198. గతి మిధున క్రోధఖెలా మనోగ్నం ప 199. రా వారాంకాకారం తటపుట ఘటితొత్థ 200. లతాలం థటాకం కృత్వా నాదిండ్లయప్ప ప్ర 201. భు రక్రుతతరాం విప్రసాధాథుకూరౌ 202. శాకాబ్దే గజరామ వార్ధిమహిగే ధాథ్రా 203. ఖ్యవర్షే ఘనం ప్రాసాదం నవహేమకుం 204. భకలిథం రమ్యం మహామంతపం స్రిమన్మం 205. గళ షైల నఢ హరయే నాదింద్లయప్ప ప్రభు 206. గ్రామం మంగళ శైలవామకమపి ప్రాధాత్‌ 207. నృసింహాయచ శాకబ్దే బ్రహ్మవహ్ని శృ 208. తిశశిగణితే చేశ్వరాఖ్యే వర్షే రేటూరి గ్రామ

1516 లో ఒక మండపం తొమ్మిది కుంభాలను నిర్మించారు. ఇప్పటి 11 అంతస్తుల గాలి గొపురానికి అప్పట్లో మూడే ఉండేవి. ఆ మూడింటిని తిమ్మయ్య కట్టించాడని ప్రతీతి. శాసనం ప్రకారం నరసింహ స్వామి గుడికి ఈ పట్టణాన్ని దానమిచ్చారు. దేవునికి దానమిచ్చిన ఈ భాగాలను దేవ భూమి లేదా దేవస్థాన గ్రామం గా పిలిచేవారు కనుక విజయనగర రాజ్యంలో మంగళగిరి ఒక దేవభూమి.


[మార్చు] దేవాలయంపై నున్న చెక్కడాలు

లక్ష్మీ నరసింహ స్వామి గుడిపై రాతి చెక్కడాలకు చారిత్రక ప్రాధాన్యత ఉంది. 1558 లో సదాశివ రాయలు విజయనగర రాజ్యాన్ని పాలించేటపుడు, అప్పటి కొండవీటి సామంతుడు తిమ్మరాజయ్య చే ఈ చెక్కడం లిఖించబడింది. అప్పట్లో రాజ్యంలోని వారసుల్లో తిరుమల రాజు ఒకడు. అతడు తిమ్మరాజయ్యకు మేనమామ. ఈ 143 లైన్ల చెక్కడంలో తిమ్మరాజయ్య ఇచ్చిన దానాల వివరాలు ఉన్నాయి. అందుకే దీనిని ధర్మ శాసనం అని అంటారు.


చెక్కడాలపై నున్న వివరాలు ఇలా ఉన్నాయి: పన్నులు తొలగించబడ్డాయి. విజయనగర సామంత రాజైన తిరుమల రాజు 28 గ్రామాల లోని 200 కుంచాల భూమిని (10 ఎకరాలు) గుడికి దానమిచ్చాడు. నంబూరు, తాళ్ళూరు, నల్లపాడు, మేడికొండూరు, వీరంభొట్ల పాలెం (రాంభొట్ల వారి పాలెం?), తాడికొండ, పెదకొండూరు, గొడవర్తి, దుగ్గిరాల, ఉప్పలపాడు, వడ్లమాను, కుంచెన పల్లి, కొలనుకొండ, ఆత్మకూరు, లాం, గోరంట్ల, గోళ్ళమూడిపాడు, నిడమర్రు, కురగల్లు, ఐనవోలు, శాఖమూరు గ్రామాల్లో భూమిని దానం చేసాడు. వాణిజ్య మండలి ముఖ్యుడైన పాపి శెట్టిని మంగళాగిరికి అధికారిగా నియమించారు. ఈ చెక్కడంపై ముగ్గురు రాజ వంశీకుల ప్స్తావన ఉన్నది. వారు: సదాశివ రాయలు, తిరుమల రాజు, తిమ్మరాజు. వారు జరిపిన ఉత్సవాలు, గుడికి చేసిన అభివృద్ధి గురించి కూడా ప్సక్తి ఉన్నది. గుడి కొరకు 5 విధాల విగ్రహాలను, 10 రకాలౌత్సవ రథాలను తయారు చేయించారు, కోనేటిని తవ్వించారు, పూల తోటలను పెంచారు.


[మార్చు] మండలంలోని గ్రామాలు

[మార్చు] మంగళగిరి పట్టణ జనాభా

మంగళగిరి జనాభా
సంవత్సరం జనాభా
1881 5,617
1893 6,426
1967 22,182
1969 29,000
1971 32,850
1991 58,289
1994 59,152
2001 63,246

[మార్చు] గుంటూరు జిల్లా మండలాలు

మాచెర్ల | రెంటచింతల | గురజాల | దాచేపల్లి | మాచవరం | బెల్లంకొండ | అచ్చంపేట | క్రోసూరు | అమరావతి | తుళ్ళూరు | తాడేపల్లి | మంగళగిరి | తాడికొండ | పెదకూరపాడు | సత్తెనపల్లి | రాజుపాలెం(గుంటూరు) | పిడుగురాళ్ల | కారంపూడి | దుర్గి | వెల్దుర్తి(గుంటూరు) | బోళ్లపల్లి | నకరికల్లు | ముప్పాళ్ల | ఫిరంగిపురం | మేడికొండూరు | గుంటూరు | పెదకాకాని | దుగ్గిరాల | కొల్లిపర | కొల్లూరు | వేమూరు | తెనాలి | చుండూరు | చేబ్రోలు | వట్టిచెరుకూరు | ప్రత్తిపాడు | యడ్లపాడు | నాదెండ్ల | నరసరావుపేట | రొంపిచెర్ల | ఈపూరు | శావల్యాపురం | వినుకొండ | నూజెండ్ల | చిలకలూరిపేట | పెదనందిపాడు | కాకుమాను | పొన్నూరు | అమృతలూరు | చెరుకుపల్లి | భట్టిప్రోలు | రేపల్లె | నగరం | నిజాంపట్నం | పిట్టలవానిపాలెం | కర్లపాలెం | బాపట్ల

Static Wikipedia 2008 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2006 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu