కంప్యూటరు
వికీపీడియా నుండి
ఆటలు - సాఫ్ట్‌వేర్ - హార్డ్‌వేర్- చరిత్ర - ఇంటర్నెట్టు
కంప్యూటరు అనునది సమాచారమును, ప్రోగ్రాముల ద్వారా, వివిద రకములుగా మార్చుకొనుటకు ఉపయోగించు ఒక యంత్రము. మన సమాచారము వివిద రూపములలో ఉండవచ్చును. ఉదాహరణకు అవి సంక్యలుగా, బొమ్మలుగా, శబ్దములుగా లేదా అక్షరములుగా ఉండవచ్చు.
కంప్యూటర్లను మనము విభిన్నమయిన వృత్తులలో ఉపయోగించవచ్చు. అంతెందుకు ఎటువంటి సమాచారమునయినా సంవిధానపరుచుటకు మనము కంప్యూటర్లను ఉపయోగించవచ్చు. చర్చి-ట్యూరింగు సిద్దాంతం ప్రకారం, ఒక నిర్దేశిత కనీస సామర్ధము ఉన్న కంప్యూటరుతో మనము ఇతర ఏ కంప్యూటరు, అది పాకెటు డైరీ కానీవండి లేదా పెద్ద సూపరు కంప్యూటరు కానీవండి, చేయగలిగే ఎటువంటి కార్యమునయినా చేయించవచ్చు. కాబట్టి ఒకే రూపకల్పనను మనము వివిద కర్యములను నెరవేర్చేటందుకు మలచవచ్చు. అవి కంపెనీలో జీతల జాబితాలను నియంత్రించేది కావచ్చు లేదా ఫ్యాక్టరీలలో యంత్రాలను పనిచేయించే రాబోటులను నియంత్రొంచేవి అయినా అవ్వొచ్చు. ఆదునిక ఎలక్ట్రానిక్ కంప్యూటర్ల వేగము మరియు సమాచార సంవిధాన సామర్ద్యము, పాత కాలపు రూపకల్పనలకంటే ఎంతో శక్తివంతముగా తయారు అయినవని చెప్పవచ్చు. ఈ విషయమును మూరు సిద్దాతముతో పిలవబడుచున్నది.
కంప్యూటర్లు చాలా రూపములలో లభించును. అసలయిన కంప్యూటర్లు ఒక పెద్ద గది మొత్తము నిండిపోయి ఉంటుంది. ఇవి అపరిమితమయిన గణన సౌకర్యాలు కలిగియుండును. వీటిని ప్రత్యేక వైజ్ణానిక అవసరాలకు ఉపయోగించుతున్నప్పుడు సూపరు కంప్యూటరు అని, పెద్దపెద్ద సంస్థల వ్యాపార లావాదేవీలను సంవిధానం(processing) చేస్తున్నప్పుడు మెయిన్ ఫ్రేము కంప్యూటరు అని సంబోదిస్తుంటారు. వ్యక్తిగత అవసరాలకు వాడుకొనే కంప్యూటర్లను పర్సనలు కంప్యూటరు (వ్యక్తిగత కంప్యూటరు)అని, తత్సమమయిన సులువుగా మోసుకు వెళ్ళగలిగే కంప్యూటర్లను నోటుబుక్కు కంప్యూటరుఅని పిలిస్తారు. ఈ చివరి రెండు రకాల కంప్యూటర్లు బాగా వాడుకలో ఉండటం వలన వీటిని సమాచార సంవిధానమునకు మరియు సమాచార వ్యాప్తికి గాను ఉపయోగించ బడుతున్నాయి, వీటి ప్రాచుర్యము వలన చాలా మంది నిపుణులు కానివారు వీటినే కంప్యూటరుగా బావిస్తూన్నారు. అయినప్పటికిన్నీ, మనము రోజూ ఉపయోగించే కంప్యూటరు నిర్మాణాలలో ఎంబెడెడు కంప్యూటరు సర్వసాధారణమయినది. ఇవి ఇతర వస్తువులను నియంత్రించుటకు ఉపయోగిస్తారు. ఉదాహరణకు డిజిటలు కెమెరాలు, వాషింగు మెషిను మొదలగు వాటిలో ఎంబెడెడు కంప్యూటర్లను ఉపయోగిస్తారు, అంతేకాదు పెద్ద పెద్ద రక్షణ విమాణాలను సైతం ఎంబెడెడు కంప్యూటర్లతో నియంత్రిస్తున్నారు.
విషయ సూచిక |
[మార్చు] కంప్యూటింగు యొక్క చరిత్ర
కంప్యూటరు అనే యంత్రాలు రాక మునుపు కంప్యూటరు అనే వ్యక్తి ఉండే వాడు. ఆ వ్యక్తిని మనం గణకుడు అనో ముసద్దీ అనో, గుమస్తా అనో, కరణం అనో అనేవాళ్ళం. ఈ లెక్కలు చెయ్యడానికి ఎలక్‌ట్రానిక్ యంత్రాలు వచ్చిన తర్వాత, ఇంగ్లీషు మాతృ భాషగా కలవాళ్ళు ఆ యంత్రాలని కూడ పూర్వం ఉద్యోగస్తుడికి ఏమి పేరు వాడే వారో అదే పేరుని వాడడంん మొదలు పెట్టేరు. కనుక కావలిస్తే మనం computer ని కలని అనో, గణక్ అనో, ముసద్దీ అనో అనొచ్చు. అలాగే computing machine అన్నమాటని కలన యంత్రం అనొచ్చు.
ఈ కలన యంత్రాలు స్థూలంగా రెండు రకాలు. డిజిటల్ కంప్యూటర్ లేదా అంక కలన యంత్రమ ఒక రకం. Analog Computer లేదా సారూప్య కలన యంత్రం మరొక రకం. ఈ రోజుల్లో అంక కలన యంత్రాల ధాటికి ఆగలేక సారూప్య కలన యంత్రాలు మరుగున పడిపోయాయి.
ఇంకా కొత్త కొత్త రకాల కంప్యూటర్లు పరిశోధన స్థాయిలో ఉన్నాయి. క్వాంటం శాస్త్రపు సూత్రాలని ఉపయోగించి నిర్మాణం జరిగితే అవి క్వాంటం కంప్యూటర్లు. అలాగే DNA (అంటే జీవ కణాలలోని వారసవాహికలు) లో నిబిడీకృతమైన సూత్రాలని ఉపయోగించి నిర్మాణం జరిగితే అవి DNA కంప్యూటర్లు.
[మార్చు] కంప్యూటరు పనిచేయు విధానము: భద్రపరిచిన ప్రోగ్రాము అను నిర్మాణము
కంప్యూటరుకు సంబందించిన చాలా సాంకేతిక అంశాలు ఎన్ని మార్పులు చెందినా, 1940ల నుండి మొదలుకొని ఇప్పటి వరకు మార్పు చెందనిది ఈ "స్టోర్డ్ ప్రోగ్రాము ఆర్కిటెక్చరు" (భద్రపరిచిన ప్రోగ్రాము నిర్మాణము) మాత్రమే. దీనిని "వాన్ న్యూమాన్ ఆర్కిటెక్చరు" అని కూడా పిలుస్తారు. ఈ రూపకల్పన వలన కంప్యూటరు అనేది ఒక వాస్తవరూపము దాల్చగలిగింది. ఈ నిర్మాణము ప్రకారము మనము కంప్యూటరును నాలుగు ముఖ్య భాగములుగా విభజించవచ్చును. ఈ భాగములనన్నిటినీ అనుసంధానించుటకు బస్ అను వైర్లకట్టను ఉపయోగిస్తాము. వీటిని ఒక క్రమపద్దతిలో నడిపించుటకు టైమరు లేదా గడియారము అను ఒక వ్యవస్తను ఉపయోగిస్తాము.
[మార్చు] గణిత మరియు తర్క విభాగము - అరిత్మాటిక్ అండ్ లాజికల్ యూనిట్ (ఏ ఎల్ యు)
ఏ ఎల్ యు కంప్యూటరుకు గుండెవంటిది. ఇది రెండు రకాల పనులు నిర్వర్తించును: గణితము, కూడికలు లేదా తీసివేతలు అనునవి మూలాంశములు, గుణకములు భాగాహారములు మొదలగు కార్యములు కూడా ఉండవచ్చు. రెండవ రకమయిన కార్యములు తర్కమునకు సంబందించినది, ఇది తనకు ఇచ్చిన రెండు సంఖ్యల మద్యన ఉన్న పోలికలను లేదా భేదములను గుర్తించి అవి రెండూ సమానమా, కాకపోతే ఏది పెద్దదో తెలుపును.
[మార్చు] నియంత్రించు విభాగము - కంట్రోలు యూనిట్
నియంత్రన వ్యవస్త మిగిలిన అన్ని విభాగములను జతపరుచును. దీనికి కేటాయించిన ముఖ్యమయిన పనులు: ఆదేశములను మరియు డేటాను మెమరీ నుండి లేదా ఐ/ఓ నుడి చదవటం, తనుకు ఇచ్చిన ఆదేశములను అర్ధం చేసుకోవటం, ఏ ఎల్ యు కు ఆదేశానుసారము సరిఅయిన సంఖ్యలను అందించటం, ఏ ఎల్ యు కు ఆ సంఖ్యలతో ఏమి చేయాలో చెప్పటం, వచ్చిన ఫలితములను తెరిగి మెమరీ వద్దకు గానీ ఐ/ఓ వద్దకు గానీ పంపించటం. ఈ విభాగములో కౌంటరు అను ఒక లెక్కపెట్టే పరికరము ప్రస్తుత ఆదేశము నిలువ ఉన్న చిరునామా యొక్క జాడను ఎల్లప్పుడూ తెలుపుతూ ఉంటుంది. సాధారనముగా ఒక ఆదేశము నిర్వర్తించగానే ఈ కౌంటరు యొక్క లెక్క పెరుగును. దీని వలన తరువాతి ఆదేశమును చదువుటకు వీలగును. అప్పుడప్పుడు ప్రసుత ఆదేశమే తరువాతి ఆదేశము యొక్క చిరునామాను తెలుపును. అటువంటి సమయాలలో కౌంటరు యొక్క లెక్కను సరిచేయటమే ఆదేశముగా భావించవలెను. 1980ల నుండి ఏ ఎల్ యు మరియు నియంత్రించు విభాగము బౌతికముగా ఒకే చిన్న ఇంటిగ్రేటెడ్ సర్క్యూటులో ఉంచబడినవి. దానిని కేంద్రీయ సంవిధాన విభాగము - సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ (సి పి యు).
[మార్చు] జ్ణాపక విభాగము - మెమొరీ యూనిట్
కంప్యూటరు యొక్క జ్ణాపకశక్తిని వరుసగా పేర్చిన ఖాళీలుగా భావించవచ్చు. ప్రతీ ఖాళీకి ఒక ప్రత్యేక సంఖ్యను చిరునామాగా ఉంటుంది. ప్రతీ ఖాళీలో స్థిరమయిన కొలతగల, చిన్న సమాచారమును బద్రపరచవచ్చు. ఈ సమాచారము కంప్యూటరుకు ఇవ్వవలసిన ఆదేశములు అయి ఉండవచ్చు, లేదా డేటా(కంప్యూటరుకు అందించిన ఆదేశాలను నిర్వర్తించుటకు కావలిసిన సమాచారము) అయినా అయిఉండవచ్చు. శాస్త్ర ప్రకారం మనము ఆదేశాలను కానీ డేటాను కానీ భద్రపరుచుటకు ఏ ఖాళీనయినా ఉపయోగించవచ్చు.
[మార్చు] ప్రవేశ/బహిర్గ విభాగము - ఇన్పుట్/ఔట్పుట్ యూనిట్ (ఐ/ఓ)
ఈ విభాగము బయట ప్రపంచము నుండి సమాచారము సేకరించుటకు, మరియు ఫలితములను బయట ప్రపంచమునకు తెలుపుటకు ఒక సాధనముగా ఉపయోగపడును. ఒక మామూలు వ్యక్తిగత కంప్యూటరులో సమాచారమును ప్రవేశపెట్టుటకు కీబోర్డు మరియు మౌసులను, బహిర్గపరుచుటకు కంప్యూటరు మానిటరు, ప్రింటరు మొదలగు వాటిని ఉపయోగిస్తాము. ఇవి కాక ఇంకా ఎన్నో సాధనములను కంప్యుటరుకు బయట ప్రపంచమునకు మధ్య మార్పిడికి ఉపయోగిస్తారు.
సాదారనముగా ఇటువంటి కంప్యూటరు యొక్క పనిచేయు విధానము చాలా సూటిగా ఉంటుంది. కౌంటరుయోక్క లెక్క పెరిగిన ప్రతీసారి ఒక క్రొత్త ఆదేశమును, దానికి సంబందించిన డేటాను మెమరీ నుండి చదివి దనిని నిర్వర్తించడము, తిరిగి ఫలితములను మెమరీలో బద్రపరచటం, మళ్ళీ తరువాతి ఆదేశమును స్వీకరించటం. ఈ విధముగా హాల్ట్(ఆగుము) అను ఆదేశము వచ్చు వరకు జరుగుతూనే ఉంటుంది.
పెద్ద పెద్ద కంప్యూటర్లలో ఈ నమూనాలో కొంచం తేడా ఉండును. వాటిలో ఒక సిపియు బదులుగా అనేక మయిన సిపియులు ఉండును. సూపరు కంప్యూటర్లలో ఈ నిర్మాణము మరింత తేడాగా ఉండును. వాటిలో కొన్ని వేల సిపియులు ఉండును, అట్టి నిర్మాణములు ప్రత్యేకమయిన కార్యములకు మాత్రమే ఉపయోగించుతారు.
[మార్చు] కంప్యూటింగు వృత్తులు మరియు నియమములు
ప్రస్తుత సమాజములో దాదాపుగా అన్ని వృత్తుల వారు కంప్యూటర్లను ఉపయోగించుచున్నారు. కాకపోతే విద్యాలయాలలో, కంప్యూటర్లను ఉపయోగించుటకుగాను, వాటిని నడుపుటకు కావలిసిన ప్రోగ్రాములను వ్రాయుటకు ప్రత్యేక పద్దతులను నేర్పుటకు గాను, ప్రత్యేక వృత్తివిద్యలు అవతరించినాయి. కానీ ప్రస్తుతానికి ఈ వృత్తివిద్యలకు ఉన్న నామములు, పదజాలము నిలకడగాలేవు అని చెప్పవచ్చును, కొత్త కొత్త విభాగములు పుట్టుకు వస్తూనే ఉన్నాయి. వీటిలో ముఖ్యమయినవిగా ఈ క్రింది వాటిని పేర్కొన వచ్చు:
[మార్చు] కంప్యూటరు ఇంజినీరింగు
దీనిని ఎలక్ట్రానిక్ ఇంజినీరింగుకు ఒక శాఖగా భావించవచ్చు. ఈ విభాగములో మనము కంప్యూటర్ల యొక్క భౌతిక లక్షణాలు, వాటి నిర్మాణ ప్రక్రియ, నిర్మాణమునకు కావలిసిన విడిభాగముల గురించి వివరములు నేర్చుకొనవచ్చును.
- కంప్యూటరు సైన్సు:
- సాఫ్టువేరు ఇంజినీరింగు
- కంప్యూటరుచేత పనులు చేయించే ప్రోగ్రాములకు సంబంధించిన పద్ధతులు నేర్చుకొనుటకు, మరియు ఈ ప్రక్రియను వేగవంతము చేయుటకు, ఖర్చు తగ్గించుటకు మార్గములు, ప్రామాణికమయిన లేదా నాణ్యమయిన ప్రోగ్రాముల వ్యవస్థను సృస్టించుటకు, అవసరమైన వివిధ అచరణీయమయిన పద్ధతుల గూర్చిన అధ్యయనము జరుగును.
- సాఫ్ట్‌వేరు టెస్టు జాబులు: ఈ టెష్టు జాబులు స్థూలంగా మనము రెండు మూడు విధములుగా చెప్పవచ్చు।
- చేతి పరీక్షకులు
- సాధారణ వినియోగదారులు ప్రోగ్రామును ఎలా ఉపయోగిస్తారో.. అలా అన్ని సంయోజనాలలోనూ ఉపయోగించి పరీక్షిస్తారు।
- ఆటోమాటిక్ పరీక్షకులు
- ప్రోగ్రామును ఆటోమాటిగ్గా పరీక్షించేందుకు అవసరమైన ప్రోగ్రాములను వీరు రాస్తారు
- టెష్ట్ టూల్స్ డెవలపరు
- వీరు టెష్టు టీమునకు కావలసిన రక రకాల టూల్సును తయారు చేస్తూ ఉంటారు। ఉదాహరణకు మెమరీ లీకు టెష్టులు, సెక్యూరిటీ టెష్టులు మొదలగున్నవి। ఈ టూల్సును అన్ని ప్రోగ్రాములవారూ ఉయయోగించవచ్చు।
[మార్చు] ఇన్ఫర్మేషను సిస్టంసు
[మార్చు] ఇతరములు