Static Wikipedia February 2008 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu

Web Analytics
Cookie Policy Terms and Conditions అరటి - వికిపీడియా

అరటి

వికీపీడియా నుండి

అరటి
అరటి చెట్టు
అరటి చెట్టు
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: Plantae
విభాగము: Magnoliophyta
తరగతి: Liliopsida
వర్గము: Zingiberales
కుటుంబము: Musaceae
జీనస్: Musa
Species
Hybrid origin; see text

అరటి ఒక చెట్టులా కనిపించే మొక్క ( నిజం చెప్పాలంటే ఇది ఒక హెర్బ్ మాత్రమే ఇది మూసా అను వర్గానికి చెందినది<?> , మరియూ మూసాసీ కుటుంబానికి చెందినది , కూర అరటి కి దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది . అరటి చెట్టు కాండము, చాలా పెద్ద పెద్ద ఆకులతో (సుమారుగా రెండు నుండి మూడు మీటర్లు పొడుగు) నాలుగు నుండి ఎనిమిది మీటర్లు ఎత్తు పెరుగును. అరటి పండ్లు సాధారణంగా 125 నుండి 200 గ్రాములు బరువు తూగుతాయి. ఈ బరువు వాటి పెంపకం, వాతావరణము, ప్రాంతముల వారీగా మారుతుంది. ఈ బరువులో 80% లోన ఉన్న తినగల పదార్థము, 20% పైన ఉన్న తోలు.

వ్యాపార ప్రపంచములోనూ, సాధారణ వాడకములోనూ వేలాడే అరటికాయల గుంపును ఓ గెల అంటారు. గెలలోని ఒక్కొక్క గుత్తిని అత్తము అంటారు. చరిత్ర పరంగా అరటిచెట్లను పశ్చిమ పసిఫిక్ మరియూ దక్షిణ ఆసియా దేశాలలో, భారత దేశంతో కలిపి, సాగుచేసినారు.

చాలా రకాల అరటి పండ్ల రంగూ, రుచీ, వాసన, అవి పక్వానికి వచ్చే దశలోని ఉష్ణోగ్రతల ఆధారంగా మారుతుంటాయి. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద అరటిపండ్లు పాడయిపోయి పాలిపోతాయి, అందువల్లనే వీటిని ఇళ్ళల్లో ఫ్రిజ్జులలో పెట్టరు, అలాగే రవాణా చేసేటప్పుడు కూడా 13.5 డెగ్రీ సెల్సియసు కన్నా తక్కువ ఉష్ణోగ్రతకు తీసుకొనిరారు.

కేవలం 2002 వ సంవత్సరములోనే 6.8 కోట్ల టన్నుల అరటిపండ్లు ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి చేయబడినాయి. ఇందులో 1.2 కోట్ల టన్నులు దేశాల మధ్య వ్యాపారంగా రవాణా చెయ్యబడినాయి. ఈక్వడార్, కోస్టారికా , కొలంబియా మరియూ ఫిలిప్పైన్సు దేశాలు ప్రతి ఒక్కటీ పది లక్షల టన్నుల కన్నా ఎక్కువ అరటి పండ్లు ఎగుమతి చేస్తున్నాయి.

అరటిలో పిండిపదార్థాలు/చక్కెరలు (కార్బోహైడ్రేటులు) ఎక్కువ. ప్రతి 100 గ్రాముల అరటి లో 20 గ్రాముల కార్బోహైడ్రేటులు, 1గ్రాము మాంసకృత్తులు (ప్రోటీనులు), 0.2 గ్రాములు కొవ్వు పదార్థాలు, 80 కిలోక్యాలరీల శక్తి ఉన్నవి. అరటి సులభంగా జీర్ణమై, మలబద్ధకం రాకుండా శరీరాన్ని కాపాడుతుంది.

భారతదేశములో మొత్తం 50 రకాల అరటిపండ్లు లభిస్తున్నాయి. వాటిలో కొన్ని రకాలు పచ్చ అరటిపండ్లు, చక్కరకేళి, పసుపు పచ్చవి, కేరళ అరటిపండ్లు, కొండ అరటిపండ్లు. వీటినుండి చిప్సు తయారు చేస్తారు

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

అరటి చెట్ల పుట్టుక అనునది ఆసియా వాయువ్య దేశాలలో సంభవించినది. ఇప్పటికీ కూడా చాలా రకాల అడవి అరటి చెట్లు న్యూ గినియా, మలేసియా, ఇండోనేషియా మరియూ ఫిలిప్పైన్సు లలో కనపడతాయి. ఇటివల దొరికిన పురావస్తు మరియూ శిలాజవాతావరణ శాస్త్ర ఆధారలను బట్టి పౌపా న్యూ గినియా లోని పశ్చిమ ద్వీప ఖండములోని కుక్‌ స్వాంపు వద్ద క్రీస్తుకు పూర్వం 5000, లేదా క్రీస్తు పూర్వం 8000 సంవత్సరాల నుండే అరటి తోటల పెంపకం సాగినట్లు నిర్ధారించినారు. దీని వల్ల న్యూ గినియాలో తొలి అరటి తోటల పెంపకం జరిగినట్లు నిర్ధారించవచ్చు. తరువాత తరువాత ఇతర అడవి అరటి జాతులు దక్షిణ ఆసియా ఖండములో పెంపకము చేసినట్లు తోచుచున్నది.

వ్రాత ప్రతులలో మొదటిసారిగా అరటి ప్రస్తావన మనకు క్రీస్తు పూర్వం 600 సంవత్సరములో వ్రాసిన బౌద్ధ సాహిత్యమునందు కనపడుతుంది. అలెగ్జాండరు తొలిసారిగా వీటి రుచిని క్రీస్తు పూర్వం 327 వ సంవత్సరములో భారత దేశంనందు చూసినాడు. చైనాలో క్రీస్తు శకం 200 సంవత్సరము నుండి అరటి తోటల పెంపకం సాగినట్లుగా మనకు ఆధారాలు లభ్యమవుతున్నాయి. క్రీస్తు శకం 650 వ సంవత్సరములో ముస్లిం దండయాత్రల వల్ల అరటి పాలస్తీనా ప్రాంతానికీ తరువాత ఆఫ్రికా ఖండానికీ వ్యాప్తి చెందింది.

క్రీస్తు శకం 1502 వ సంవత్సరాన పోర్చుగీసు వారు తొలిసారిగా అరటి పెంపకాన్ని కరేబియను మరియూ మధ్య అమెరికా ప్రాంతములలో మొదలుపెట్టినారు.

[మార్చు] ధర్మాలు

కావెండిష్ అరటి రకము
కావెండిష్ అరటి రకము
'ఆంధ్ర ప్రదేశ్లో  అరటి తోట'
'ఆంధ్ర ప్రదేశ్లో అరటి తోట'

అరటిపండ్లు రకరకాల రంగులలో మరియు ఆకారాల్లో లభిస్తున్నాయి. పండిన పండ్లు తేలికగా తొక్క వలుచుకోని తినడానికీ, పచ్చి పండ్లు తేలికగా వంట చేసుకుని తినడానికీ అనువుగా వుంటాయి. పక్వ దశను బట్టి వీటి రుచి వగరు నుండి తియ్యదనానికి మారుతుంది. మాగని 'పచ్చి' అరటికాయలు మరియు అరటిపండ్లు వండటానికి ఉపయోగిస్తారు. కొన్ని ఉష్ణమండల ప్రాంతాల్లోని ప్రజలకు ఇది ప్రధాన ఆహారం.

నిఖార్సయిన అరటి పండ్లు చాలా పెద్ద పెద్ద విత్తనాలను కలిగి ఉంటాయి, కానీ విత్తనాలు లేకుండా రకరకాల అరటి పండ్లను ఆహారం కోసం అభివృద్ధి చేసినారు. వీటి పునరుత్పత్తి కాండం యొక్క తొలిభాగాల ద్వారా జరుగుతుంది. వీటిని పిలకలు అంటారు. కొన్ని పర్యాయములు ఈ పిలకలను పూలు అనికూడా పిలవడం పరిపాటి. ఒక సారి పంట చేతికి వచ్చిన తరువాత అరటి చెట్టు కాండాన్ని నరికివేసి, ఈ పిలకలను తరువాతి పంటగా వాడుకొంటారు. ఇలా నరికిన కాండం బరువు సుమారుగా 30 నుండి 50 కేజీలు ఉంటుంది. ఈ అరటి ఆకులను రక రకాల పనులకు ఉపయోగిస్తారు, ముఖ్యముగా భోజనము చెయ్యడానికీ, పెండ్లిళ్ళలో మండపాల అలంకరణకు వాడతారు.



బనానా చిప్స్‌ అనునది అరటి పండ్ల నుండి తయారు చేయు ఓ అల్పాహారం. ఇది ప్రపంచ వ్యాప్తంగా బహు ప్రసిద్ధి. చాలా కంపెనీలు దీనిని వ్యాపారం లాభదాయకంగా నిర్వహిస్తున్నాయి. భారతదేశంలో, ముఖ్యముగా ఆంధ్ర ప్రదేశు నగరాలు, మరియూ పట్టణాలలో ఇవి చాలా విరివిగా లభిస్తాయి. మామూలు ఆలూ చిప్స్‌ కన్నా కొద్దిగా మందంగా ఉంటాయి. కేరళ వాళ్ళు వీటిని కొబ్బరి నూనెతో వేయించి తయారు చేస్తారు. అవి ఓ ప్రత్యేకమైన వాసన, రుచి కలిగి ఉంటాయి. అరటి పండ్లను జాం తయారు చెయ్యడంలో కూడా ఉపయోగిస్తారు. అరటి పండ్లను పండ్ల రసాలు తయారు చేయడంలోనూ, ఫ్రూట్‌ సలాడ్‌ లలోనూ, ఉపయోగిస్తారు. అరటి పండ్లలో సుమారుగా 80% నీళ్ళు కలిగి ఉన్నప్పటికీ, చారిత్రికంగా వీటినుండి జ్యూసు తీయడం అసాధ్యంగా ఉండినది, ఎందుకంటే వీటిని మిక్సీలో పట్టినప్పుడు అది గుజ్జుగా మారిపోతుంది. కానీ 2004 వ సంవత్సరంలో భాభా ఆటామిక్‌ పరిశోధనా సంస్థ (బార్క్‌) వారు ఓ ప్రతేకమైన పద్ధతి ద్వారా అరటి పండ్లనుండి రసాలు తయారు చేయడం రూపొందించి, పేటెంటు పొందినారు. ఈ పద్దతిలో అరటి పండ్ల గుజ్జును సుమారుగా నాలుగు నుండి ఆరు గంటల పాటు ఓ పాత్రలో చర్యకు గురిచేయడం ద్వారా పండ్ల రసాన్ని వెలికితీస్తారు. [1].

అరటి చెట్లతో పాటు అరటి పువ్వును (దీనిని తరచూ అరటి పుష్పం లేదా అరటి హృదయం అని అంటారు) బెంగాలీ వంటలలో మరియూ కేరళ వంటలలో ఉపయోగిస్తారు. అరటి కాండములోని సున్నితమైన మధ్య భాగం (దూట) కూడా వంటలలో ఉపయోగిస్తారు - ముఖ్యముగా బర్మా మరియూ కేరళ, బెంగాలులో.


అరటి ఆకులు చాలా సున్నితంగా, పెద్దగా సౌలభ్యంగా ఉంటాయి. ఇవి తడి అంటకుండా ఉంటాయి, అందువల్ల వీటిని గొడుగుకు బదులుగా వాడతారు. మరియూ చైనా, జోంగ్జీ, మధ్య అమెరికా లలో వీటిని వంటకాలు చుట్టడానికి ఉపయోగిస్తారు. మనము ఇంతక్రితమే చెప్పుకున్నట్లు వీటిని ఆంధ్రాలో చక్కని భోజనమునకు పళ్ళెరము బదులుగా ఉపయోగిస్తారు.

[మార్చు] కూర అరటిలోని రకాలు

  • పచ్చబొంత
  • బూడిద బొంత
  • పచ్చబొంత బత్తీసా
  • బూడిద బొంత బత్తీసా
  • పచ్చగుబ్బబొంత
  • పలకల బొంత
  • నూకల బొంత
  • సపోటా బొంత
  • నేంద్రం
  • సిరుమల అరటి
  • వామనకేళి

[మార్చు] అరటి చీడ పీడలు

చీకటిగల కోసము అరటిచెట్ల పరిశీలన
చీకటిగల కోసము అరటిచెట్ల పరిశీలన

అరటికి చీడపీడల బెడద కొద్దిగా ఎక్కువే। దానికి కారణాలలో ఒకటిగా జన్యుపరమైన వైవిధ్యములేకపోవడము చెపుతారు. జన్యుపరమైన వైవిధ్యము లేకపోవడానికి కారణము ఇవి ఎక్కువగా స్వపరాగసంపర్కము వల్ల వృద్దిపొందటము అని చెపుతారు. కాండము ద్వారా ఫలదీకరణము చేయుపద్దతి వల్ల వైరసులు చాలా తేలికగా వ్యాపిస్తాయి. బనానా బంచీ అనునది ఆసియాలో చాలా ప్రమాదకరమైన బనానా వైరసు. ఇది వ్యాపించిన చేయగలిగినదేమీ లేదు - పంటను తగలబెట్టి మిగిలిన పొలాలకు వ్యాప్తిచెందకుండా చూడటము తప్ప.

[మార్చు] పోషక విలువలూ, ఆహార పద్ధతుల మీద ప్రభావము

శ్రీలంకలోని ఎర్ర అరటి రకము
శ్రీలంకలోని ఎర్ర అరటి రకము

అరటిపండులో ముందే చెప్పుకున్నట్లు 74% కన్నా ఎక్కువగా నీరు ఉంటుంది. 23% కార్బోహైడ్రేటులు, ౧% ప్రోటీనులు, 2.6% ఫైబరు ఉంటుంది. ఈ విలువలు వాతావరణాన్ని, పక్వదశనుబట్టి, సాగు పద్దతిని బట్టి, ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. పచ్చి అరటిపండులో కార్బోహైడ్రేటులు స్టార్చ్ రూపములో ఉంటాయి, పండుతున్న కొద్దీ ఇవి చక్కరగా మార్పుచెందబడతాయి. అందుకే పండు అరటి తియ్యగా ఉంటుంది. పూర్తిగా మాగిన అరటిలో 1-2% చక్కర ఉంటుంది. అరటిపండు మంచి శక్తిదాయకమైనది. అంతే కాకుండా ఇందులో పొటాషియం కూడా ఉంటుంది. అందువల్ల ఇది రక్తపోటుతో బాధపడుతున్నవారికి చాలా విలువైన ఆహారం.

అరటిపండు, పెద్ద పేగు వ్యాధిగ్రస్తులకు చాలా చక్కని ఆహారం. అరటితోపాటు మామిడి, పైనాపిలు, బొప్పాయి, మేడిపండులు కూడా శ్రేష్టమైనవి.

[మార్చు] వందగ్రాముల అరటిలో

  • నీరు - 70.1 గ్రా.
  • ప్రోటీన్ - 1.2 గ్రా.
  • కొవ్వుపదార్థాలు - 0.3 గ్రా.
  • పిండిపదార్థాలు - 27.2 గ్రా.
  • కాల్షియం - 17 మి.గ్రా.
  • ఇనుము - 0.4మి.గ్రా.
  • సోడియం - 37 మి.గ్రా.
  • పొటాషియం - 88 మి.గ్రా.
  • రాగి - 0.16 మి.గ్రా.
  • మాంగనీసు - 0.2 మి.గ్రా.
  • జింక్ - 0.15 మి.గ్రా.
  • క్రోమియం - 0.004 మి.గ్రా.
  • కెరోటిన్ - 78 మైక్రో గ్రా.
  • రైబోఫ్లెవిన్ - 0.08 మి.గ్రా.
  • సి విటమిన్ - 7 మి.గ్రా.
  • థయామిన్ - 0.05 మి.గ్రా.
  • నియాసిన్ - 0.5 మి.గ్రా.
  • శక్తి - 116 కిలోకాలరీలు
బొమ్మ:NutritionFacts banana.png
పోషకవిలువల సమాచారము

[మార్చు] అరటి వ్యాపారం

అరటి ప్రపంచంలో ఎక్కువగా తినే పండు. కానీ చాలామంది అరటి సాగుబడిదారులకు మాత్రం మిగిలేది, లేదా గిట్టుబాటయ్యేది చాలా స్వల్ప మొత్తాలలోనే. మధ్య అమెరికా ఎగుమతులలో అరటి, కాఫీ సింహభాగాన్ని ఆక్రమిస్తున్నాయి. ఎగుమతులలో ఇవి రెండు కలిపి 1960 లో 67 శాతం వాటా కలిగిఉన్నాయి. బనానా రిపబ్లికు అను పదం స్థూలంగా మధ్య అమెరికాలోని అన్ని దేశాలకూ వర్తించినప్పటికీ నిజానికి కోస్టారికా, హోండూరస్, పనామా లు మాత్రమే నిజమైన బనానా రిపబ్లికులు. ఎందుకంటే వీటి ఆర్ధికవ్యవస్థ మాత్రమే అరటి వ్యాపారంపై ఆధారపడి ఉన్నది.

[మార్చు] అరటిపండు పట్ల జనాల వైఖరి

అరటి పండు చాలా ప్రముఖమైన, ప్రసిద్ది పొందిన పండు. ఇది చాలా మందికి ఇష్టమైన పండు. కానీ కోతులు, కొండముచ్చులు అరటిపండును రకరకాల పద్దతిలో తినే ఫోటోలు చాలా ప్రసిద్ది పొందటంవల్ల ఈ అరటి పండు అనే పదాన్ని కొన్ని ప్రాంతాలలో జాతిపరమైన అపహాస్యములకు ఉపయోగించినారు. ముఖ్యముగా ఆటగాళ్ళపై అరటిపండు తొక్కలు విసిరివేయడం, కుళ్ళిన టమాటాలు, కోడిగుడ్లు అంత ప్రసిద్ది. ఆకారంలోనూ, పరిమాణంలోనూ ఉన్న సమానతల కారణంగా కొన్ని పర్యాయములు హాస్యానికి అరటిపండ్లను పురుషాంగానికి పర్యాయపదంగా కూడా వాడతారు.

మలేషియాలోనూ, సింగపూరులోనూ అరటిపండును చైనీసు బాషరానీ, లేదా ఎక్కువగా ఆంగ్లేయుడి లాగా ప్రవర్తిస్తున్న చైనీయునికి పర్యాయపదంగా వాడతారు. ఎందుకంటే అరటిపండుకూడా పైన పసుపు, లోన తెలుపు కదా!

ఇహ అరటితొక్కపై కలు జారిపడటం తరతరాలనుండి వస్తున్న ఓ పెద్ద కామెడీ సీను. ఇహ హీరోనో, హీరోయినో అరటితొక్కమీద కాలు జారడం ఓ పెద్ద శృంగార సన్నివేశానికి ఆరంభం మన డైరెక్టర్లకు!

[మార్చు] గృహవైద్యము, చిట్కా వైద్యము

  • అమెరికాలో పాయిజన్ ఐవీ (poison ivy) అనబడే చెట్లు చర్మానికి తగిలిన వచ్చే ఓ రకమైన చర్మ వ్యాధిని అరటిపండు తోలు లోపలి భాగంతో రుద్ది నయం చేస్తుంటారు

[మార్చు] ఉపయోగాలు

  • దీనిలో అత్యధికంగా ఉండే పొటాషియం బీపీ, అధిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
  • శరీరంలోని విషపదార్థాల (టాక్సిన్స్)ను తొలగిస్తుంది.
  • అరటిపండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ శరీరంలో ప్రవేశించగానే సెరటోనిన్‌గా మారి ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకే రాత్రిపూట పాలు, అరటిపండు తీసుకుంటే నిద్ర బాగా పడుతుందని చెబుతారు.
  • అరటిపండులోని పొటాషియం శరీరకండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. డైటింగ్ చేస్తున్నవాళ్లు ఒకపూట భోజనం లేదా టిఫిన్ మానేసి అరటిపండు, వెన్న తీసిన పాలు తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి.
  • జీర్ణసంబంధమైన సమస్యలకూ అరటిపండు మంచి ఔషధంలా పనిచేస్తుంది. జబ్బుపడినవాళ్లు దీన్ని తింటే తొందరగా కోలుకుంటారు.
  • పచ్చి అరటిపండ్లు విరేచనాలనూ పండిపోయినవి మలబద్ధకాన్నీ అల్సర్ల్‌నూ అరికడతాయి.
  • అరటిపండ్లలో కణోత్పత్తిని ప్రోత్సహించే గుణం, జీర్ణాశయం గోడలకున్న సన్నటి పొర నాశనం కాకుండా కాపాడుతుంది.

[మార్చు] లుప్తమవునవి

ఓ దశాబ్దంలో ఆహారంగా స్వీకరించు అరటి జాతి అంతరించు ప్రమాదంలో ఉన్నది. ప్రస్తుతము ప్రపంచ వ్యాప్తముగా తిను కావెండిషు అరటి (మన పచ్చ అరటి ?) జన్యుపరంగా ఎటువంటి వైవిధ్యాన్నీ చూపలేకపోవడం వల్ల వివిధ రకాల వ్యాధులకు గురిఅవుతుంది, ఉదాహరణకు 1950 లో పనామా వ్యాధి, ఇది నేల శిలీంధ్రము (ఫంగస్) వల్ల వచ్చి ‌బిగ్ మైక్ రకానికి చెందిన అరటి జాతిని పూర్తిగా తుడిచిపెట్టినది. నల్ల సిగటోక (black sigatoka) ఇది కూడా మరో రకం శిలీంధ్రము వల్ల వచ్చిన వ్యాధే కానీ చాలా త్వరితగతిన వ్యాపించినది. ముఖ్యముగా మధ్య అమెరికా లోనూ ఆఫ్రికా మరియూ ఆసియా ఖండములలో ఇది వ్యాపించినది.

ట్రోపికల్ జాతి 4 అనబడు ఓ క్రొత్త వ్యాధికారకము కావెండిషు (పచ్చ అరటి?) జాతికి చెందిన అరటితోటలపై ఆశించుతుంది. దీని ప్రభావము వల్ల... వాయువ్య ఆసియాలో అందువల్ల ఇక్కడినుండి వచ్చే అరటి ఎగుమతులపై కొద్దిగా జాగ్రత్త వహించడం ప్రారంభం అయినది. ఈ వ్యాధి వ్యాపించకుండా ఇతర దేశాలవాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకొంటూ మట్టినీ, మరియూ అరటి పండ్లను జాగ్రత్తగా పరిశీలించసాగినారు.

గ్రాస్ మికేలు లేదా బిగ్ మైక్ అను రకానికి చెందిన అరటిది ఒక విషాద కథ. ఇది పనామా వ్యాధి వల్ల 1950 లో పూర్తిగా తుడిచిపెట్టబడినది. ఈ బిగ్ మైక్ రకం సమ శీతల, లేదా శీతల దేశాలకు ఎగుమతి చేయడానికి చాలా అనువుగా ఉండేది. కొంతమంది ఇప్పటికీ దీని రుచిని మరిచిపోలేక ప్రస్తుతము లభిస్తున్న పచ్చ అరటి కన్నా బిగ్ మైక్ రుచికరంగా ఉంటుంది అంటూ వాదిస్తుంటారు! అంతే కాకుండా రవాణాకు కూడా బిగ్ మైక్ చాలా అనుకూలంగా ఉండేది, అదే పచ్చ అరటి రవాణా విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఉంది.

[మార్చు] చూడండి

  • బనానా పాట
  • బనానా రిపబ్లికు - అవినీతిలో కూరుకునిపోయిన దేశాన్ని (సాధారణంగా ఓ మిలటరీ నియంత ఆధీనంలోని దేశాన్ని) పిలిచే ఓ హీనమైన పేరు

[మార్చు] మూలములు

  • తరచూ అడిగే ప్రశ్నలు. Bananas Commodity notes: Final results of the 2003 season, 2004
  • Denham, T., Haberle, S. G., Lentfer, C., Fullagar, R., Field, J., Porch, N., Therin, M., Winsborough B., and Golson, J. (2003) Multi-disciplinary Evidence for the Origins of Agriculture from 6950-6440 Cal BP at Kuk Swamp in the Highlands of New Guinea. Science June Issue.

[మార్చు] బయటి లింకులు

ఈ వ్యాసం 2006 నవంబర్ 10 వ తేదీన విశేషవ్యాసంగా ప్రదర్శించబడింది.
Static Wikipedia 2008 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2006 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu