మధ్య ప్రదేశ్
వికీపీడియా నుండి
మధ్య ప్రదేశ్ | |
రాజధాని - Coordinates |
భోపాల్ - |
పెద్ద నగరము | ఇండోర్ |
జనాభా (2001) - జనసాంద్రత |
60,385,118 (7వ) - 196/చ.కి.మీ |
విస్తీర్ణము - జిల్లాలు |
308,144 చ.కి.మీ (2nd) - 48 |
సమయ ప్రాంతం | IST (UTC +5:30) |
అవతరణ - గవర్నరు - ముఖ్యమంత్రి - చట్టసభలు (సీట్లు) |
1956 నవంబర్ 1 - బలరామ్ జాఖర్ - శివరాజ్ సింగ్ చౌహాన్ - ఒకేసభ (231) |
అధికార బాష (లు) | హిందీ |
పొడిపదం (ISO) | IN-MP |
వెబ్‌సైటు: www.mp.nic.in | |
మధ్య ప్రదేశ్ రాజముద్ర |
మధ్య ప్రదేశ్ (Madhya Pradesh) (హిందీ:मध्य प्रदेश) - పేరుకు తగినట్లే భారతదేశం మధ్యలో ఉన్న ఒక రాష్ట్రం. దీని రాజధాని నగరం భోపాల్. ఇంతకు పూర్వం దేశంలో వైశాల్యం ప్రకారం మధ్యప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రంగా ఉండేది. కాని 2000 నవంబరు 1 న మధ్యప్రదేశ్‌లోని కొన్నిభాగాలను వేరుచేసి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు.
విషయ సూచిక |
[మార్చు] భౌగోళికం
మధ్యప్రదేశ్ భౌగోళిక స్వరూపంలో నర్మదా నది, వింధ్య పర్వతాలు, సాత్పూరా పర్వతాలు ప్రధాన అంశాలు. తూర్పు, పడమరలుగా విస్తరించిన ఈ రెండు పర్వతశ్రేణుల మధ్య నర్మదానది ప్రవహిస్తున్నది. ఉత్తర, దక్షిణ భారతదేశాలకు తరతరాలుగా ఈ కొండలు, నది హద్దులుగా పరిగణింపబడుతున్నాయి. మధ్యప్రదేశ్‌కు పశ్చిమాన గుజరాత్, వాయువ్యాన రాజస్థాన్, ఈశాన్యాన ఉత్తర ప్రదేశ్, తూర్పున ఛత్తీస్‌గఢ్, దక్షిణాన మహారాష్ట్ర రాష్ట్రాలతో హద్దులున్నాయి.
భాషా(యాస) పరంగాను, సాంస్కృతికంగాను మధ్యప్రదేశ్‌ను ఈ ప్రాంతాలుగా విభజింపవచ్చును.
- మాల్వా : వింధ్య పర్వతాలకు ఉత్తరాన ఉన్న పీఠభూమి. విశిష్టమైన భాష, సంస్కృతి కలిగి ఉన్నది. పెద్ద నగరం ఇండోర్. బుందేల్‌ఖండ్ ప్రాంతపు అంచున భోపాల్ నగరం ఉంది. మాల్వా ప్రాంతంలో ఉజ్జయిని ఒక చారిత్రాత్మక పట్టణం.
- నిమర్ (నేమార్): నర్మదానదీలోయ పశ్చిమభాగం, వింధ్యపర్వతాలకు దక్షిణాన ఉన్నది.
- బుందేల్‌ఖండ్: రాష్ట్రానికి ఉత్తరభాగాన ఉన్న కొండలు, సారవంతమైన మైదానాలు. ఈ ప్రాంతం క్రమంగా ఉత్తరాన ఉన్న గంగామైదానం వైపు ఏటవాలుగా ఉంటుంది. బుందేల్‌ఖండ్‌లో గ్వాలియర్ ముఖ్య నగరం.
- బాగెల్‌ఖండ్: రాష్ట్రానికి ఈశాన్యాన ఉన్న పర్వతమయప్రాతం. వింధ్యపర్వతాల తూర్పుభాగం బాగెల్‌ఖండ్‌లోనే ఉన్నాయి.
- మహాకోషల్ (మహాకౌశాల్): ఆగ్నేయ ప్రాంతం - నర్మదానది తూర్పు భాగం, తూర్పుసాత్పూరా పర్వతాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. మహాకోషల్‌లో ముఖ్యనగరం జబల్‌పూర్.
[మార్చు] జిల్లాలు
మధ్య ప్రదేశ్‌లోని 48జిల్లాలను 9 డివిజన్‌లుగా విభజించారు. ఆ డివిజన్లు: భోపాల్, చంబల్, గ్వాలియర్, హోషంగాబాద్, ఇండోర్, జబల్‌పూర్, రేవా, సాగర్, ఉజ్జయిన్.
రాష్ట్రము. | కోడ్ | జిల్లా | ముఖ్య పట్టణము | జనాభా (2001) | విస్తీర్ణము (కి.మీ.²) | జన సాంద్రత (/కి.మీ.²) |
---|---|---|---|---|---|---|
MP | BD | అశోక్‌నగర్ | అశోక్‌నగర్ | 688920 | 4674 | |
MP | BD | బింద్ | బింద్ | 1426951 | 4459 | 320 |
MP | BE | బెతుల్ | బెతుల్ | 1394421 | 10043 | 139 |
MP | BL | బలగట్ | బలగట్ | 1445760 | 9229 | 157 |
MP | BP | భోపాల్ | భోపాల్ | 1836784 | 2772 | 663 |
MP | BR | బర్వాని | బర్వాని | 1081039 | 5432 | 199 |
MP | CN | ఛింద్వారా | ఛింద్వారా | 1848882 | 11815 | 156 |
MP | CT | ఛాతర్‌పూర్ | ఛాతర్‌పూర్ | 1474633 | 8687 | 170 |
MP | DE | దేవాస్ | దేవాస్ | 1306617 | 7020 | 186 |
MP | DH | ధార్ | ధార్ | 1740577 | 8153 | 213 |
MP | DI | దినోదొరి | దినోదొరి | 579312 | 7427 | 78 |
MP | DM | దమోహ్ | దమోహ్ | 1081909 | 7306 | 148 |
MP | DT | దతియ | దతియ | 627818 | 2694 | 233 |
MP | EN | ఈస్ట్ నిమార్ | ఖండ్వ | 1708170 | 10779 | 158 |
MP | GU | గున | గున | 976596 | 6485 | |
MP | GW | గ్వాలియర్ | గ్వాలియర్ | 1629881 | 5465 | 298 |
MP | HA | హర్ద | హర్ద | 474174 | 3339 | 142 |
MP | HO | హోషంగాబాద్ | హోషంగాబాద్ | 1085011 | 6698 | 162 |
MP | IN | ఇండోర్ | ఇండోర్ | 2585321 | 3898 | 663 |
MP | JA | జబల్‌పూర్ | జబల్‌పూర్ | 2167469 | 5210 | 416 |
MP | JH | ఝాబౌ | ఝాబౌ | 1396677 | 6782 | 206 |
MP | KA | కత్ని | కత్ని | 1063689 | 4947 | 215 |
MP | ML | మండ్ల | మండ్ల | 893908 | 5805 | 154 |
MP | MO | మొరెన | మొరెన | 1587264 | 4991 | 318 |
MP | MS | మంద్సౌర్ | మంద్సౌర్ | 1183369 | 5530 | 214 |
MP | NA | నర్సింగ్‌పూర్ | నర్సింగ్‌పూర్ | 957399 | 5133 | 187 |
MP | NE | నీముచ్ | నీముచ్ | 725457 | 4267 | 170 |
MP | PA | పన్న | పన్న | 854235 | 7135 | 120 |
MP | RE | రెవ | రెవ | 1972333 | 6314 | 312 |
MP | RG | రాజ్‌గర్ | రాజ్‌గర్ | 1253246 | 6143 | 204 |
MP | RL | రత్‌లం | రత్‌లం | 1214536 | 4861 | 250 |
MP | RS | రాయ్‌సేన్ | రాయ్‌సేన్ | 1120159 | 8466 | 132 |
MP | SG | సాగర్ | సాగర్ | 2021783 | 10252 | 197 |
MP | SH | షాదొల్ | షాదొల్ | 1572748 | 9954 | 158 |
MP | SI | సిద్ది | సిద్ది | 1830553 | 10520 | 174 |
MP | SJ | షాజపూర్ | షాజపూర్ | 1290230 | 6196 | 208 |
MP | SO | సెయోని | సెయోని | 1165893 | 8758 | 133 |
MP | SP | షెయోపూర్ | షెయోపూర్ | 559715 | 6585 | 85 |
MP | SR | సెహొర్ | సెహొర్ | 1078769 | 6578 | 164 |
MP | ST | సత్న | సత్న | 1868648 | 7502 | 249 |
MP | SV | షివ్‌పూరి | షివ్‌పూరి | 1440666 | 10290 | 140 |
MP | TI | తికంగర్ | తికంగర్ | 1203160 | 5055 | 238 |
MP | UJ | ఉజెయిన్ | ఉజెయిన్ | 1709885 | 6091 | 281 |
MP | UM | ఉమరియ | ఉమరియ | 515851 | 4062 | 127 |
MP | VI | విదిష | విదిష | 1214759 | 7362 | 165 |
MP | WN | వెస్ట్ నిమర్ | ఖర్‌గొన్ | 1529954 | 8010 | 191 |
[మార్చు] చరిత్ర
[మార్చు] ప్రాచీన చరిత్ర
ఉజ్జయిని ("అవంతీ నగరం" అనికూడా పేరు) ఒకప్పటి "మాల్వా" రాజ్యానికి రాజధాని. క్రీ.పూ. 6వ శతాబ్దిలోనే భారతదేశంలో నగరాలు, నాగరికత రూపుదిద్దుకొటున్న సమయంలో ఇది ఒక ప్రధాన నాగరిక కేంద్రంగా వర్ధిల్లింది. ధానికి తూర్పున బుందేల్‌ఖండ్ ప్రాంతంలో "ఛేది" రాజ్యం ఉండేది. క్రీ.పూ. 320లో చంద్రగుప్త మౌర్యుడు ఉత్తరభారతాన్ని అంతటినీ మౌర్య సామ్రాజ్యం క్రిందికి తెచ్చాడు. అందులో ఇప్పటి మధ్యప్రదేశ్ అంతా కలిసి ఉంది. క్రీ.పూ. 321 నుండి 185 వరకు సాగిన మౌర్యసామ్రాజ్యం అశోక చక్రవర్తి అనంతరం పతనమయ్యింది. అప్పుడు మధ్యభారతంపై ఆధిపత్యంకోసం శకులు, కుషాణులు, స్థానిక వంశాలు పోరుసాగించాయి.
క్రీ.పూ.1వ శతాబ్దం నాటికి పశ్చిమభారతంలో ఉజ్జయిని ప్రధాన వాణిజ్యకేంద్రం. గంగామైదానం ప్రాంతాలకు, అరేబియా సముద్రం తీరానికి మధ్యనున్న వాణిజ్యమార్గంలో ఉన్న నగరం. హిందూ, బౌద్ధ మతాల కేంద్రం. క్రీ.శ. 1 నుండి మూడవ శతాబ్దం వరకు మధ్యప్రదేశ్‌లో కొంతభాగం శాతవాహనుల అధీనంలో ఉండేది. 4, 5 శతాబ్దాలలో ఉత్తరభారతదేశం గుప్త సామ్రాజ్యంలో స్వర్ణ యుగంగా వర్ధిల్లింది. అప్పుడు బంగాళాఖాతం, అరేబియా సముద్రం మధ్యభాగమైన దక్కన్ పీఠభూమిని పాలించే వాకాటకుల రాజ్యం గుప్తుల రాజ్యానికి దక్షిణపు హద్దు. 5వ శతాబ్దాంతానికి ఈ సామ్రాజ్యాలు పతనమయ్యాయి.
[మార్చు] మధ్యయుగం చరిత్ర
"తెల్ల హూణుల" (Hephthalite) దండయాత్రలతో గుప్తసామ్రాజ్యం కూలిపోయింది. దానితో భారతదేశం చిన్న చిన్న దేశాలుగా విడిపోయింది. 528లో యశోధర్ముడు అనే మాళ్వా రాజు హూణులను ఓడించి, వారి రాజ్యవిస్తరణకు అడ్డుకట్టవేశాడు. తానేసార్‌కు చెందిన హర్షుడు అనే రాజు ఉత్తరభారతాన్ని కొద్దికాలం ఒకటిగా చేయగలిగాడు. ఆయన 647లో మరణించాడు. తరువాతికాలంలో రాజపుత్ర వంశాల ప్రాభవం మొదలయ్యింది. మాళ్వా పారమారులు, బుందేల్‌ఖండ్ చందేలులు వీరిలో ముఖ్యులు. సుమారు 1010-1060 మధ్య పాలించిన పారమఅర రాజు భోజుడు గొప్ప రచయిత, విజ్ఞాని (polymath). 950-1050 మధ్యలో చందేలులు ఖజురాహో మందిరాలను నిర్మించారు.
మహాకోసలలోని "గొండ్వానా"లో గోండ్ రాజ్యాలు నెలకొన్నాయి. 13వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానులు మధ్యప్రదేశ్‌ను జయించారు. ఢిల్లీ సుల్తానుల పతనం తరువాత మళ్ళీ కొంతకాలం స్థానిక స్వతంత్రరాజుల పాలన సాగింది. గ్వాలియర్‌లో తోమార రాజపుత్రులు, మాళ్వాలో ముస్లిం సులతానులు (వీరి రాజధాని "మండూ") రాజ్యం చేశారు. 1531లో మాళ్వా సులతానులను గుజరాత్ సుల్తానులు జయించారు.
[మార్చు] ఆధునిక యుగ చరిత్ర
అక్బరు చక్రవర్తి (1542-1605) కాలంలో మధ్యప్రదేశ్‌లో అధికభాగం ముఘల్ సామ్రాజ్యం క్రిందికి వచ్చింది. గొండ్వానా, మహాకోసల రాజ్యాలు గోండ్‌రాజుల పాలనలోనే ఉన్నాయి. వీరు ముఘల్ సామ్రాజ్యానికి నామమాత్రంగా సామంతులుగా ఉండేవారు. 1707లో ఔరంగజేబు మరణానంతరం ముఘల్ సామ్రాజ్యం బలహీనపడింది. అప్పుడే మధ్యభారతంలో మరాఠాలు తమ ప్రాభవాన్ని విస్తరింపజేసుకొనసాగారు. 1720-1760 మధ్య మధ్యప్రదేశ్ చాలాభాగం మరాఠాల అధీనంలోకి వచ్చింది. మరాఠా పేష్వాల అనుజ్ఞలకు లోబడి స్వతంత్ర మరాఠా రాజ్యాలు మధ్యప్రదేశ్‌లో నెలకొన్నాయి. ఇండోర్‌కు చెందిన హోల్కర్‌లు మాళ్వాను పాలించారు. నాగపూర్‌కు చెందిన భోంసలేలు మహాకోసల, గొండ్వానాలను, మహారాష్ట్రలోని విదర్భను పాలించారు. ఒక మరాఠా సేనాధిపతి ఝాన్సీ రాజ్యాన్ని స్థాపించాడు. ఆఫ్ఝన్ సేనాధిపతి దోస్త్ మొహమ్మద్ ఖాన్‌వంశానికి చెందిన వారు భోపాల్‌ను పాలించారు. 1761లో మూడవ పానిపట్టు యుద్ధం తరువాత మరాఠా విస్తరణకు కళ్ళెం పడింది.
ఆ కాలంలో బ్రిటిష్‌వారు బెంగాల్, బొంబాయి, మద్రాసులలో స్థావరాలు ఏర్పరచుకొని భారతదేశంలో తమ అధీనాన్ని విస్తరించుకొనసాగారు. తత్కారణంగా 1775 - 1818 మధ్య మూడు ఆంగ్ల-మరాఠా యుద్ధాలు జరిగాయి. మూడవ యుద్ధం తరువాత బ్రిటిష్‌వారి అధిపత్యానికి దాదాపు ఎదురులేకుండా పోయింది. మహాకోసల ప్రాంతం (సౌగార్, నెర్బుద్ద విభాగాలు) బ్రిటిష్ రాజ్యంలో కలిసిపోయింది. దీనిని మధ్య పరగణాలు (Central Provinces) అని పిలచేవారు. ఇండోర్, భోపాల్, నాగపూర్, రేవా, మరి చాలా చిన్న సంస్థానాలు బ్రిటిష్‌వారికి లోబడిన రాజ్య సంస్థానాలయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని ఉత్తరభాగరాజసంస్థానాలు Central India Agency పాలనలో నడచేవి.
[మార్చు] స్వాతంత్ర్యానంతర చరిత్ర
1950లో నాగపూర్ రాజధానిగా - మధ్యపరగణాలు, బేరార్, మక్రాయ్ సంస్థానాలు, ఛత్తీస్‌గఢ్‌లను కలిపి - మధ్యప్రదేశ్‌ను ఏర్పరచారు. Central India Agency ప్రాంతాన్ని మధ్యభారత్, వింధ్యప్రదేశ్‌రాష్ట్రాలుగా ఏర్పరచారు. 1956లో భోపాల్, మధ్యభారత్, వింధ్యభారత్‌లను కలిపి మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. మరాఠీ భాష మాట్లాడే దక్షిణప్రాంతమైన విదర్భను , నాగపూర్‌తో సహా, వేరుచేసి బొంబాయి రాష్ట్రంలో కలిపారు.
200 నవంబరులో మధ్యప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం (Madhya Pradesh Reorganization Act) క్రింద, మధ్యప్రదేశ్‌లోని ఆగ్నేయ భాగం కొంత విడదీశి, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని ఏర్పరచారు.
[మార్చు] చారిత్రిక నిర్మాణాలు
మధ్యప్రదేశ్‌లో ఎన్నో ప్రదేశాలు సహజసౌందర్యానికి, అద్భుతమైన నిర్మాణాలకు ప్రసిద్ధి చెందాయి. మూడు స్థలాలు ప్రపంచ వారసత్వ స్థలాలుగా (World Heritage Sites) ఐక్యరాజ్యసమితి విద్యా సాంస్కృతిక సంస్థ (UNESCO)చే గుర్తింపబడ్డాయి. అవి
- ఖజురాహో మందిరాలు (1986)
- సాంచి బౌద్ధారామాలు (1989)
- భింబెటక శిలావాసాలు (2003)
ఇంకా చారిత్రిక నిర్మాణాలకు పేరుపొందిన స్థలాలు
- అజయ్‌ఘర్
- అసిర్‌ఘర్
- భోపాల్
- ధార్
- గ్వాలియర్
- ఇండోర్
- మహేశ్వర్
- మండూ
- ఓర్చా
- పంచమర్హీ
- శివపురి
- ఉజ్జయిని
మధ్యప్రదేశ్‌లో పర్యటనకు సంబంధించిన వివరాలకోసం వికిట్రావెల్ చూడండి.
[మార్చు] ప్రకృతి దృశ్యాలు
మధ్యప్రదేశ్‌లో ఎన్నో జాతీయ ఉద్యానవనాలు(National Parks)ఉన్నాయి. వాటిలో కొన్ని:
- బాంధవఘర్ నేషనల్ పార్క్
- కన్హా నేషనల్ పార్క్
- సాత్పూరా నేషనల్ పార్క్
- సంజయ్ నేషనల్ పార్క్
- మాధవ్ నేషనల్ పార్క్
- వనవిహార్ నేషనల్ పార్క్
- ఫాస్సిల్ నేషనల్ పార్క్ (Fossil National Park)
- పన్నా నేషనల్ పార్క్
- పెంచ్ నేషనల్ పార్క్
ఇంకా కొన్ని ప్రకృతిసహజ విశేషాలున్న స్థలాలు:
- బాఘ్ గుహలు
- బోరి
- పంచ్‌మర్హి
- పన్‌పఠా
- షికార్‌గంజ్
- కెన్ ఘరియల్
- ఘటీగావ్
- కునో పాల్‌పూర్
- నర్వార్
- చంబల్
- కుక్‌దేశ్వర్
- నర్సింగ్‌ఘర్
- నొరాదేహి
[మార్చు] సంస్కృతి
[మార్చు] భాష
మధ్యప్రదేశ్‌లో ప్రధానంగా మాట్లాడే భాష హిందీ. ప్రామాణికమైన హిందీతోబాటు ఒకోప్రాంతంలో ఒకో విధమైన భాష మాట్లాడుతారు. ఈ భాషలను హిందీ మాండలికాలు అని కొందరూ, కాదు హిందీ పరివారానికి చెందిన ప్రత్యేకభాషలని కొందరూ భావిస్తారు. ఇలా మాట్లాడే భాషలు (యాసలు): మాళ్వాలో మాల్వి, నిమర్‌లో నిమడి, బుందేల్‌ఖండ్‌లో బుందేలి, బాగెల్‌ఖండ్‌లో బాఘేలి. ఇంకా మధ్యప్రదేశ్‌లో మాట్లాడే భాషలు - భిలోడి భాష, గోండి భాష, కాల్తో భాష; ఇవన్నీ ఆదిమవాసుల భాషలు. మరాఠీ భాష మాట్లాడేవారు కూడా మధ్యప్రదేశ్‌లో గణనీయంగా ఉన్నారు.
[మార్చు] ఇవికూడా చూడండి
[మార్చు] బయటి లింకులు
- మధ్య ప్రదేశ్ పోర్టల్
- మధ్యప్రదేశ్ ప్రరభుత్వం
- మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ
- మధ్యప్రదేశ్ పోలీసు
- మధ్యప్రదేశ్ మ్యాపు
భారతదేశ రాష్ట్రములు మరియు ప్రాంతములు | ![]() |
---|---|
ఆంధ్ర ప్రదేశ్ | అరుణాచల్ ప్రదేశ్ | అసోం | బీహార్ | ఛత్తీస్‌గఢ్ | గోవా | గుజరాత్ | హర్యానా | హిమాచల్ ప్రదేశ్ | జమ్మూ కాశ్మీరు | జార్ఖండ్ | కర్నాటక | కేరళ | మధ్య ప్రదేశ్ | మహారాష్ట్ర | మణిపూర్ | మేఘాలయ | మిజోరాం | నాగాలాండ్ | ఒరిస్సా | పంజాబ్ | రాజస్థాన్ | సిక్కిం | తమిళనాడు | త్రిపుర | ఉత్తరాంచల్ | ఉత్తర ప్రదేశ్ | పశ్చిమ బెంగాల్ | |
కేంద్రపాలిత ప్రాంతములు: అండమాన్ నికోబార్ దీవులు | చండీగఢ్ | దాద్రా నగరు హవేలీ | డామన్ డయ్యు | లక్షద్వీపములు | పుదుచ్చేరి | |
జాతీయ రాజధాని ప్రాంతము: ఢిల్లీ |