లక్షద్వీపములు
వికీపీడియా నుండి
లక్షద్వీపములు భారత దేశములోని అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతము. It consists of 12 coral atolls, three coral reefs, and five banks. ప్రాంతము యొక్క మొత్తము భూ వైశాల్యము 32 కి.మీ². ఈ దీవులు అరేబియా సముద్రములో, కేరళ తీరమునుండి 200 నుండి 300 కిలోమీటర్ల దూరములో ఉన్నవి. ఈ దీవులలో పది దీవులు జనావసము ఉన్న దీవులు. మిగిలిన 17 దీవులు నిర్జనమైన దీవులు. ఇవేకాక ఇంకా ఎన్నో లెక్కలోకి తీసుకోని చిన్న చిన్న దీపఖండములు (islets) ఉన్నవి.
జనావాసమైన దీవులు:
- ఆగట్టి
- అమిని
- ఆండ్రొట్ట్
- బంగారం
- బిట్ర
- చెట్లాట్
- కద్మత్
- కల్పేని
- కవరత్తి
- కిల్తన్
- మినీకాయ్
కవరత్తి (రాజధాని నగరమైన, కవరత్తి ఇక్కడే ఉన్నది), ఆగట్టి, మినీకాయ్ మరియు అమిని ప్రధానమైన దీవులు. 2001 జనాభా లెక్కల ప్రకారము ఈ కేంద్రపాలిత ప్రాంతము యొక్క మొత్తము జనాభా 60,595. ఆగట్టిలో ఒక విమానాశ్రయము ఉన్నది. ఇక్కడికి కొచ్చిన్ నుండి నేరుగా విమాన సౌకర్యము కలదు.
1973 వరకు, ఈ దీవుల సమూహము ఆంగ్లీకరించిన లక్కదీవ్స్ అనే పేరుతో పిలవబడేది. (సంస్కృతములో మాలద్వీపము అని పేరున్న మాల్దీవ్స్ తో పోల్చండి).
ఈ దీవుల యొక్క ప్రజలు మళయాళము యొక్క మాండలికమును మాట్లాడతారు. దాదాపు మొత్తము జనాభా ముస్లిం మతస్తులు. తమ పూర్వీకులు ఒక పెద్ద తూఫాను వలన సముద్రములో ఈ దీవులకు కొట్టుకువచ్చిన కొందరు వర్తకులని ఇక్కడి వాసుల నమ్మకము.
[మార్చు] బయటి లింకులు
భారతదేశ రాష్ట్రములు మరియు ప్రాంతములు | |
---|---|
ఆంధ్ర ప్రదేశ్ | అరుణాచల్ ప్రదేశ్ | అసోం | బీహార్ | ఛత్తీస్‌గఢ్ | గోవా | గుజరాత్ | హర్యానా | హిమాచల్ ప్రదేశ్ | జమ్మూ కాశ్మీరు | జార్ఖండ్ | కర్నాటక | కేరళ | మధ్య ప్రదేశ్ | మహారాష్ట్ర | మణిపూర్ | మేఘాలయ | మిజోరాం | నాగాలాండ్ | ఒరిస్సా | పంజాబ్ | రాజస్థాన్ | సిక్కిం | తమిళనాడు | త్రిపుర | ఉత్తరాంచల్ | ఉత్తర ప్రదేశ్ | పశ్చిమ బెంగాల్ | |
కేంద్రపాలిత ప్రాంతములు: అండమాన్ నికోబార్ దీవులు | చండీగఢ్ | దాద్రా నగరు హవేలీ | డామన్ డయ్యు | లక్షద్వీపములు | పుదుచ్చేరి | |
జాతీయ రాజధాని ప్రాంతము: ఢిల్లీ |