ఏనుకూరు
వికీపీడియా నుండి
ఏనుకూరు మండలం | |
---|---|
జిల్లా: | ఖమ్మం |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | ఏనుకూరు |
గ్రామాలు: | 11 |
విస్తీర్ణము: | చ.కి.మీ |
జనాభా (2001 లెక్కలు) | |
మొత్తము: | 33.151 వేలు |
పురుషులు: | 17.103 వేలు |
స్త్రీలు: | 16.048 వేలు |
జనసాంద్రత: | / చ.కి.మీ |
జనాభా వృద్ధి: | % (1991-2001) |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 51.33 % |
పురుషులు: | 62.29 % |
స్త్రీలు: | 39.62 % |
చూడండి: ఖమ్మం జిల్లా మండలాలు |
ఏనుకూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలము. దీనిని ఆంగ్లములో Enkoor అనిగానీ Enkur అనిగానీ వ్రాస్తుంటారు. ఇది సుజాతనగర్ నియోజకవర్గములో ఉన్నది. ఈ గ్రామము ఒక సాధారణమైనటువంటి గ్రామమే అయినప్పటికీ దీనికి కొన్ని ప్రత్యేకథలు ఉన్నాయి.
- ఇది ఖమ్మం నుండి కొత్తగూడెం (లేదా భధ్రాచలం, మణుగూరు, రాజమండ్రి) వెళ్ళు మర్గములో హైవేపై తల్లాడ దాటిన తరువాత పన్నెండు కిలోమీటర్లకు వస్తుంది.
- అలాగే దీనిని చేరుకోవడానికి ఖమ్మం నుండి పండితాపురం, ముచ్చర్ల, తిమ్మారావుపేట గ్రామాల ద్వార ఇంకో మార్గము ఉన్నది.
- దీని చుట్టు పక్కన చాలా గ్రామాలు ఉండుటం వల్ల ఒక ప్రధాన వ్యాపార కూడలిగా రూపాంతరము చెందినది.
- ముఖ్యముగా వ్యవసాయానికి కావలసిన పరికరములూ, విత్తనములు, పురుగుమందుల కోసం ఇక్కడకి చాలామంది చుట్టు పక్కగ్రామాల నుండి వస్తూ ఉంటారు.
- ఇక్కడ ఆంధ్ర ప్రదేశు గురుకుల పాఠశాల, జిల్ల పరిషత్తు పాఠశాలు, upper primary schoolలు, డిగ్రీ కళాశాల ఉండుతం వల్ల ఇది ఒక విధ్యా కేంద్రముగా వెలుగొందుతున్నది.
- ఏనుకూరు ఏజన్సీ ప్రాంతము క్రిందకు వస్తుంది. బహుశా ఖమ్మం నుంది వస్తుంటే ఏజన్సీ ప్రాంతానికి ఇదే ఆరంభం అనుకుంటాను.
- ఈ గ్రామములో నూతనముగా నిర్మించిన రామాలయము, సాయిబాబా గుడులతో పాటు, దీనికి దగ్గరలోని గ్రామాలలో గార్ల ఒడ్డు నందు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము, నాచారం నందు ఉన్న వేంకటేశ్వర స్వామి దేవస్థానములు చాలా ప్రసిద్ది.
- ఈ గ్రామము ద్వారా నాగార్జున సాగరు ఎడమ కాలువ పోతూ సస్యస్యామలం చేస్తుంది, అలాగే దగ్గరలోని గ్రామాలకు ఇక్కడ ఓ ఎత్తిపోతల ప్రాజెక్టు కూడా ఉన్నది.
ఇంకా ఓ పశువైధ్యశాల, పోష్టాఫీసు, రెండు మూడు ప్రైవేటు ఆసుపత్రులూ, ఓ గవర్నమెంటు ఆసుపత్రి(?) ఉన్నాయి.
కాకపోతే దీనికి ఇంతవరకూ ఓ మంచి బస్టాండు లేకపోవడము ఓ పెద్ద లోటు.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- రాయమాదారం
- తిమ్మారావుపేట
- బురద రాఘవాపురం
- కేసుపల్లి
- నాచారం
- మేడేపల్లి
- ఏనుకూరు
- తూతక లింగంపేట
- ఆరికాయలపాడు
- జన్నారం
- నూకులంపాడు
[మార్చు] ఖమ్మం జిల్లా మండలాలు
వాజేడు | వెంకటాపురం | చర్ల | పినపాక | గుండాల | మణుగూరు | అశ్వాపురం | దుమ్ముగూడెం | భద్రాచలం | కూనవరం | చింతూరు | వరరామచంద్రపురం (వి.ఆర్.పురం) | వేలేరుపాడు | కుక్కునూరు | బూర్గంపాడు (బూర్గం పహాడ్) | పాల్వంచ | కొత్తగూడెం | టేకులపల్లి | ఇల్లందు | సింగరేణి | బయ్యారం | గార్ల | కామేపల్లి | జూలూరుపాడు | చంద్రుగొండ | ములకలపల్లి | అశ్వారావుపేట | దమ్మపేట | సత్తుపల్లి | వేంశూరు | పెనుబల్లి | కల్లూరు | తల్లాడ | ఏనుకూరు | కొణిజర్ల | ఖమ్మం (అర్బన్) | ఖమ్మం (రూరల్) | తిరుమలాయపాలెం | కూసుమంచి | నేలకొండపల్లి | ముదిగొండ | చింతకాని | వైరా | బోనకల్లు (బోనకాలు) | మధిర | ఎర్రుపాలెం