పాల్వంచ
వికీపీడియా నుండి
పాల్వంచ మండలం | |
---|---|
![]() |
|
జిల్లా: | ఖమ్మం |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | పాల్వంచ |
గ్రామాలు: | 18 |
విస్తీర్ణము: | చ.కి.మీ |
జనాభా (2001 లెక్కలు) | |
మొత్తము: | 99.597 వేలు |
పురుషులు: | 51.267 వేలు |
స్త్రీలు: | 48.33 వేలు |
జనసాంద్రత: | / చ.కి.మీ |
జనాభా వృద్ధి: | % (1991-2001) |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 65.38 % |
పురుషులు: | 74.76 % |
స్త్రీలు: | 55.33 % |
చూడండి: ఖమ్మం జిల్లా మండలాలు |
పాల్వంచ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలము. ఖమ్మంకు దాదాపు 90 కి మీ ల దూరంలో ఉన్న పారిశ్రామిక పట్టణం పాల్వంచ. కొత్తగూడెం - భద్రాచలం రహదారిపై, కొత్తగూడెం కు 8 కి మీ ల దూరంలో ఉన్న పాలంచ కొత్తగూడెం శాసనసభ నియోజక వర్గం పరిధిలోకి, ఖమ్మంలోక్‌సభ నియోజక వర్గ పరిధి లోకి వస్తుంది.
ఎన్నో పరిశ్రమలకు పాల్వంచ కేంద్ర స్థానం. ఇక్కడి పరిసరాల్లో లభించే సహజ వనరుల కారణంగా పట్టణం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి సాధించింది. నల్ల బంగారమని పిలవబడే బొగ్గు ఇక్కడి కొత్తగూడెం, మణుగూరు లలోని సింగరేణిగనులలో పుష్కలంగా దొరుకుతుంది. పట్టణానికి దగ్గరలో ప్రవహించే కిన్నెరసాని నది నుండి నీరు దొరుకుతుంది. వీటిపై ఆధారపడ్డ పరిశ్రమలెన్నో పాల్వంచలో నెలకొన్నాయి. వాటిలో కొన్ని:
- AP Genco వారి కొత్తగూడెం తాప (థెర్మల్) విద్యుత్ కేంద్రం(KTPS)
- స్పాంజి ఐరన్ ఇండియా లిమిటెడ్ (SIIL)
- నవభారత్ ఫెర్రో అల్లాయిస్ లిమిటెడ్ మొదలైనవి.
విషయ సూచిక |
[మార్చు] చూడదగ్గ ప్రదేశాలు
కిన్నెరసాని నది: పాల్వంచకు కేవలం 12 కి మీ ల దూరంలో ప్రవహించే నది కిన్నెరసాని. గోదావరికి ఉపనదియైన కిన్నెరసానిపై ఇక్కడ ఆనకట్టను నిర్మించారు. ప్రకృతి రమణీయత మధ్య అలరారే ఈ అనకట్ట ప్రదేశం పరిసర ప్రాంతాలలోని విహార యాత్రికులను ఆకర్షిస్తూ ఉంటుంది. సింగరేణి సంస్థ ఇక్కడ యాత్రికుల సౌకర్యార్ధం వసతి గృహాలను నిర్మించింది. ఈ ఆనకట్ట ద్వారా, పరిశ్రమలకు నీటి అవసరాలు తీరడమే కాక చుట్టుపక్కల రైతులకు సాగునీటి వసతి కూడా లభ్యమైంది.
వెంకటేశ్వర స్వామి దేవాలయం: నవభారత్ సంస్థచే నవభారత్ కొండపై నిర్మించబడిన ఈ గుడి ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది.
శివాలయం: 1820లో నిర్మించబడ్డ ఈ గుడి ఇస్లామిక్, గోతిక్ నిర్మాణ రీతుల్లో ఉంటుంది.
రాధాకృష్ణ దేవాలయం: KTPS కాలనీలో ఉన్నది. కళ్యాణ మండపం కూడా కలిగిఉంది.
విద్యుత్ కళా భారతి ఆటస్థలం: ఖమ్మం జిల్లలో కెల్లా పెద్దదైన ఈ ఆటస్థలం చరిత్ర పాల్వంచ క్రికెట్ క్లబ్బుతో ముడిపడి ఉంది. ప్రస్తుత కళాభారతి 1964లో ఉనికి లోకి వచ్చింది. ఈ ప్రదేశం ఎవరికి చెందినదో తెలియరాలేదు కానీ, క్రికెట్ క్లబ్బుకు అందాక, క్లబ్బు 1971లో పెవిలియను నిర్మించి ఈ ప్రాంతంలో క్రికెట్ ఆట అభివృద్దికి దోహదం చేసింది. K.T.P.S: పాల్వంచ లో ఉన్న విద్యుత్ ఉత్పాదన కేంద్రం.
[మార్చు] మండలంలోని పట్టణాలు
- పాల్వంచ (m)
[మార్చు] మండలంలోని గ్రామాలు
- చంద్రలగూడెం
- వులవనూరు
- కారెగట్టు
- యానంబైలు
- సారెకల్
- పాండురంగాపురం
- సూరారం
- పాయకారి యానంబైలు
- లక్ష్మిదేవిపల్లి
- సోములగూడెం
- రంగాపురం
- నాగారం
- తోగుగూడెం
- రేపల్లివాడ
- నారాయణరావు పేట
- సంగం
- దంతెలబూర
- గంగదేవిగుప్ప
- సదాగుదమ్
[మార్చు] ఖమ్మం జిల్లా మండలాలు
వాజేడు | వెంకటాపురం | చర్ల | పినపాక | గుండాల | మణుగూరు | అశ్వాపురం | దుమ్ముగూడెం | భద్రాచలం | కూనవరం | చింతూరు | వరరామచంద్రపురం (వి.ఆర్.పురం) | వేలేరుపాడు | కుక్కునూరు | బూర్గంపాడు (బూర్గం పహాడ్) | పాల్వంచ | కొత్తగూడెం | టేకులపల్లి | ఇల్లందు | సింగరేణి | బయ్యారం | గార్ల | కామేపల్లి | జూలూరుపాడు | చంద్రుగొండ | ములకలపల్లి | అశ్వారావుపేట | దమ్మపేట | సత్తుపల్లి | వేంశూరు | పెనుబల్లి | కల్లూరు | తల్లాడ | ఏనుకూరు | కొణిజర్ల | ఖమ్మం (అర్బన్) | ఖమ్మం (రూరల్) | తిరుమలాయపాలెం | కూసుమంచి | నేలకొండపల్లి | ముదిగొండ | చింతకాని | వైరా | బోనకల్లు (బోనకాలు) | మధిర | ఎర్రుపాలెం
పాల్వంచ, మెదక్ జిల్లా, టేక్మల్ మండలానికి చెందిన గ్రామము
ఈ పేజీ ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు అనే ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది. దీనిని బహుశా ఒక బాటు నిర్మించి ఉండవచ్చు. ఇక్కడ ఇదేపేరుతో ఉన్న అనేక గ్రామాల సమాచారము ఉండవచ్చు లేదా ఇదివరకే కొంత సమాచారము ఉండి ఉండవచ్చు. పరిశీలించి అయోమయ నివృత్తి పేజీలు తయారుచేసి లేదా ఇదివరకున్న సమాచారముతో విలీనము చేసి ఈ మూసను తొలగించండి. |