ఖగోళ శాస్త్రము
వికీపీడియా నుండి
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
ఖ అంటే space. గోళం అంటే sphere. కనుక ఖగోళం అంటే celestial sphere. అంటే అకాశంలో మనకి కనిపించే సూర్య, చంద్ర,గ్రహ, నక్షత్రాదుల గురించి చెప్పే శాస్త్రం. దీనినే ఇంగ్లీషులో astronomy అంటారు. ఈ ఖ అన్న ధాతువు నుండి వచ్చినదే ఖ = ఆకాశంలో, గమ = తిరిగేది; పక్షి, లేదా గాలిపటం. అదే విధంగా astro అంటే నక్షత్రం. nomy అంటే లెక్క పెట్టడం, కనుక astronomy అంటే నక్షత్రాలని లెక్కపెట్టడం.
ఖగోళశాస్త్ర్రం అత్యంత ప్రాచీన విజ్ఞాన శాస్త్రాలలో ఒకటి. టెలిస్కోపు కనుక్కున్న తరువాత ఖగోళశాస్త్ర్రం కొత్త సాంకేతిక పరిజ్ఞానం తో అనంతంగా విస్తరించింది. 20వ శతాబ్దంలో ఖగోళశాస్త్రం రెండు ఉపశాస్త్రాలుగా విభజించబడినది.
- Observational Astronomy అనగా టెలిస్కోపులు, కంప్యుటర్ లు వగైరా పరికరాలను నిర్మించడము, వాటి నిర్వహణ, వాటి ఫలితాలను process చెయ్యడము.
- సైద్ధాంతిక ఖగోళభౌతిక శాస్త్రం (Theoretical astrophysics) లో ఈ కంప్యూటర్ మరియు విశ్లేషక నమూనా లను బట్టి విశ్వ రహస్యాలను కనుక్కోవడము.
ఖగోళశాస్త్రానికి ఉన్న ప్రత్యేకత ఏమంటే, ఔత్సాహిక శాస్త్రజ్ఞులు (ఉత్సాహవంతులైన, నూతన, అనుభవము లేని, శాస్త్రజ్ఞులు) కూడా చాలా ముఖ్యమైన విషయాలు కనుక్కున్నారు.(టెలిస్కోపు, ఉత్సాహము ఉంటే చాలు మరి).లక్షల గేలెక్సీ(నక్షత్ర కూటమి) ల తో, కోట్లాది నక్షత్రాలతో ఈ విశ్వము అనంతమైనది కనుక ఇంకా తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
భారతీయ జ్యోతిషశాస్త్రములో ఖగోళశాస్త్రానికి విశేష ప్రాముఖ్యం ఉంది. ఆర్యభట్టు, వరహామిహిరుడు ప్రఖ్యాత ఖగోళ శాస్త్రజ్ఞులు. భారతదేశం తో పాటు ప్రాచీన బాబిలోనియా, పర్షియా, ఈజిప్టు, గ్రీసు మరియి చైనా లలో ఖగోళ అబ్జర్వేటరీ (వేధశాల)లు నిర్మించబడ్డాయి. సూర్య,చంద్ర, నక్షత్రాదు ల గమనము ఆధారంగా ఋతువులు, వర్షాలును నిర్ధారించి వాటి బట్టి పంటలను వేసుకునేపారు. భూమి విశ్వ కేంద్రమని భూమి చుట్టూ నక్షత్రాలు గ్రహాలు పరిభ్రమిస్తున్నాయని నమ్మే వారు (టాలెమీ భూకేంద్ర/జియోసెంట్రిక్ సిద్ధాంతము).
టెలిస్కోపు కనుగొనక ముందు కూడా రోదసి గురించి చాలా ముఖ్యమైన విషయాలు కనుగొనబడ్డాయి. వాటి లో కొన్ని భూమి సూర్యుని చుట్టూ తిరిగే కక్ష్య యొక్క కోణము, సూర్య, చంద్ర గ్రహణాలు వచ్చే కాలాన్ని ముందే అంచనా వెయ్యడము, చంద్రుని వైశాల్యము, భూమికి చంద్రునికి ఉన్న దూరము.
Observational Astronomy 13 వ శతాబ్దపు పర్షియా(పర్షియన్ సామ్రాజ్యము) లో, ఇతర మహ్మదీయ సామ్రాజ్యములలో ఖగోళ శాస్త్రము లో ఎన్నో నూతన విషయాలు కనుగొనబడ్డాయి. మహ్మదీయ ఖగోళశాస్త్రజ్ఞులు పెట్టిన నక్షత్రముల పేర్లు ఇంకా వాడుకలో ఉన్నాయి[1][2].
[మార్చు] విజ్ఞాన శాస్త్ర విప్లవము
రెనసాన్స్)(Renaissance) కాలములో, నికోలస్ కోపర్నికస్ సౌరకుటుంబానికి సౌరకేంద్ర/హీలియోసెంట్రిక్ నమూనా ను ప్రతిపాదించెను. కోపర్నికస్ పరిశోధనలను గెలీలియో గెలీలి మరియు జోహాన్స్ కెప్లర్ లు పరిరక్షించి, సవరించి, విస్తరించారు. గెలీలియో మొదటి సారి పరిశోధనల కోసము టెలీస్కోపులు వాడెను. కెప్లర్ గ్రహ గతులను వాటి కక్ష్య ల ను మొదటిసారి ఖచ్చితముగా కనుగొనెను. కెప్లర్ న్యాయము లను ఋజువు చేసే సిద్ధాంతాలను కనుక్కొవ డానికి మటుకు ఐజాక్ న్యూటన్ చేత కనుగొన బడిన [[ఆకాశ యంత్రశాస్త్రము(celestial dynamics)]] మరియు గురుత్వాకర్షణ శక్తి ఉపయోగపడ్డవి. న్యూటన్ రిఫ్లెక్టింగ్ టెలిస్కోపు ను కనుగొనెను. ఆ తరువాత జరిగిన ఎన్నోపరిశోధనలు టెలిస్కోపు పరిమాణమును, నాణ్యతను పెంచెను. నికోలాస్ లూయీ డి లాకాయె విపులమైన నక్షత్ర సూచీ పట్టీ(కేటలాగు)లను తయారు చేసెను. విలియమ్ హెర్షెల్ విస్తారమైన నెబ్యులా మరియు క్లష్టర్ కేటలాగులను తయారు చేసెను. ఆయన 1781 లో యురేనస్ గ్రహమును కనుగొనెను. 1838 లో ఫ్రెడరిక్ బెస్సెల్ మొదటిసారి ఒక నక్షత్రము కు దూరమును కనుగొనెను.
పందొమ్మిదవ శతాబ్దంలో లియోనార్డ్ ఆయిలర్, అలెక్సిస్ క్లాడ్ క్లైరాట్ మరియు జాన్ లె రాండ్ డిఅలెంబర్ట్ లు గుర్తించిన 3 బాడీ ప్రాబ్లెమ్, చంద్రుడు మరియు గ్రహములు గతులను ఖచ్చితముగా కనుగొనెను. వీరి పరిశోధనలను జోసెఫ్ లూయీ లాగ్రాంజ్ మరియు పియర్ సైమన్ లాప్లాస్లు క్రోడీకరించి గ్రహముల, ఉపగ్రహముల కంపనము(perturbations)బట్టి వాటి బరువులను కనుగొనే విధమును కనుగోనెను.
నూతన సాంకేతిక పరిజ్ఞానము తో పాటు ఖగోళ శాస్త్రములో కూడా విశేషమైన అభివృద్ది సంభవించెను. స్పెక్ట్రోస్కోపు,ఫొటోగ్రాఫీ లు ఖగోళాశాస్త్రానికి బాగా ఉపయోగపడ్డవి.జోసెఫ్ వాన్ ఫ్రాన్ హోఫర్ 1814-15 ల లో సూర్యకాంతి లో 600 పట్టీ(bands)లను కనుగొనెను. ఈ పట్టీలకు కారణము 1859 లో గస్టావ్ కిర్కాఫ్ 'సూర్యుని లో వివిధ మూలకాలు ఉండడము' అని తేల్చెను. ఇతర నక్షత్రములు కూడా సూర్యుని వలే ఉండును కాని వివిధ ఉష్ణోగ్రతలు, బరువులు కలిగి ఉండునని కనుగొన్నారు.
భూమి, సౌర కుటుంబము ఉన్న పాలపుంత నక్షత్రకూటమి(మిల్కీవే గేలెక్సీ)వలే అంతరిసక్షము లో ఇతర నక్షత్రకూటము ఉన్నవని 20వ శతాబ్దములో కనుగొనడము జరిగింది. విశ్వము విస్తరిస్తున్నదని మిగతా గేలెక్సీలు మన గేలెసక్సీకు దూరంగా జరుగుతున్నాయని కనుగొన్నారు. నూతన ఖగోళ శాస్త్రములో క్వాజర్లు,పల్సర్లు,బ్లాజర్లు , రేడియో గేలెక్సీలు వంటి విశేష వస్తువులు కనుగొనబడ్డాయి. ఈ పరిశోధనల నుండి విడుదలైన సిద్ధాంతాల వల్ల బ్లాక్ హోల్లు,న్యూట్రాన్ స్టార్ లను వివరించడము జరిగింది. Physical cosmology 20వ శతాబ్దములో సాధించిన అభివృద్ది తో బిగ్ బ్యాంగ్ వాదము నకు భౌతిక,ఖగోళ శాస్త్రముల నుండి cosmic microwave background radiation, Hubble's law, and cosmological abundances of elements మద్దతు వచ్చెను.
[మార్చు] రోదసి వస్తువులను గమనించడము
బాబిలోనియా ప్ర్రాచీన గ్రీసుదేశము ల లో ఖగోళశాస్త్రము లో చాలా మటుకు ఆస్ట్రోమెట్రీ (ఆకాశంలో నక్షత్రాలు,గ్రహాల ఉనికి ని కనుక్కోవడము) మాత్రమే ఉందేది. ఆ తరువాత జోహాన్స్ కెప్లర్,ఐజాక్ న్యూటన్ వల్ల రోదసి గతి శాస్త్రము అబివృద్ది చెందింది. ఖగోళ శాస్త్రము లో గణితాన్ని ఉపయోగించి రోదసి వస్తువవులకు గురుత్వాకర్షణ బలాలతో గలిగిన గమనాలను అంచనా వేయడము జరిగేది. సౌరమండలము లో గల గ్రహములు, ఉపగ్రహములు, ఆస్టరాయడ్స్ వగైరా మీద దృష్టి కేంద్రీకరించడము జరిగేది. ఈ రొజుల్లో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాము వల్ల రోదసి వస్తువుల స్థితి గతులు కనుక్కోవడము తేలికైంది కనుక, నూతన ఖగోళ శాస్త్రము రోదసి వస్తువుల భౌతిక ధర్మములను అర్థము చేసుకోవడము లో నిమగ్నమై ఉన్నది.
[మార్చు] డేటా సంగ్రహించు విధానములు
- ప్రధాన వ్యాసం: Observational astronomy
ఖగోళ శాస్త్రము లో సమాచారము ను సేకరించడము కాంతి మరియు ఇతర విద్యుదయస్కాంత వికిరణాలను కనుగొనడము మరియు వాటి పరిశీలనల వల్ల సాధ్యమవుతుంది.[3] అయితే న్యూట్రినో డిటెక్టర్ల వల్ల సూర్యుని నుండి వచ్చే న్యూట్రినో లు, సూపర్ నోవా ల నుండి న్యూట్రినోల వల్ల కూడా ఇంకా సమాచారము సేకరించవచ్చు. కాస్మిక్ కిరణాల ప్రభావమును కనుక్కొనే పరికరాలు కూడా ఉన్నాయి. గురుత్వాకర్షణ తరంగములను కనుక్కొనే ప్రయోగములు కూడా జరుగుతున్నయి.[4]
విద్యుదయస్కాంత వర్ణమాల(స్పెక్టృమ్) లో ఉన్న తరంగదైర్ఘ్య (వేవ్ లెంగ్త్) విభజనల వలే ఖగోళ శాస్త్రములో కూడా విభజనలు ఉన్నయి.
- స్పెక్టృమ్ లో తక్కువ పౌనఃపున్యాల వద్ద రేడియో ఖగోళ శాస్త్రము, మిల్లీమీటరు-డెకామీటరు ల మధ్య ఉండే తరంగ దైద్ఘ్యాలను గమనిస్తుంది. ఈ రేడియో టెలీస్కోపు రిసీవరులు మనము రోజూ వినే రేడియో లో వాడే రిసీవరుల లాగే ఉండును కాని చాలా సున్నితముగా ఉండును.
- మైక్రోవేవు లు రేడియో లో మిల్లీమీటరు పరిధి లో పని చేయును. మైక్రోవేవు ల వల్ల కాస్మిక్ మైక్రోవేవు బ్యాక్ గ్రౌండు రేడియేషన్ గురించి తెలుస్తున్నది.
- పరారుణ ఖగోళ శాస్త్రము మరియు అతి పరారుణ ఖగోళ శాస్త్రము లలో పరారుణ కిరణాల (ఎరుపు రంగు కాంతి కంటే ఎక్కువ తరంగదైర్ఘ్యము కల కాంతి] ను కనుగొనడము అధ్యయనము చెయ్యడము జరుగుతాంది. ఈ పరిశోధనలకు ప్రత్యేక టెలిస్కోపు (పరారుణ కిరణాలను ఖచ్చితంగా గుర్తించేది). పరారుణ కిరణాలలు వాతవరణములో ఆవిరి పీల్చుకుంటుంది కనుక, పరారుణ అబ్జర్వేటరీ లను చాలా ఎత్తైన, చాలా పొడిగా ఉన్న (నీటి ఆవిరి లేని) ప్రదేశాలలో కాని, అంతరిక్షము లో (భూమి వాతావరణానికి ఆవతల కాని) ఉంచడము జరుగుతుంది. అంతరిక్ష టెలీస్కోపు ల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాతావరణము లో ఉండే ఉష్ణ ప్రసారాలు,మబ్బులు ఇతర అస్వచ్ఛత, వాతావరణ ప్రభావము లను నిరోధించవచ్చును. పరారుణ కిరణాలు నక్షత్ర కూటముల మధ్య ఉండే ధూళి మరియు ఇతర అణువుల పరిశీలన లో ఉపయోగపడును.
- ఇప్పటి వరకు, చాలా మటుకు డేటా దృశ్య కాంతి/సామాన్య ఖగోళ శాస్త్రము లో సేకరించడము జరిగింది. దర్పణములు, కటకములు,ఛార్జ్-కపుల్డ్ డివైస్ మరియు ఫొటోగ్రాఫిక్ ఫిల్మ్ లు ఉపయోగ పడును. సాధారణ కంటికి కనపడే 1 E-7 m|400 - 700 nm కాంతి తరంగదైర్ఘ్యము ఉపయోగ పడును. సాధారణ టెలీస్కోపు స్పెక్ట్రోగ్రాఫ్లు, ఎలక్ట్ర్రానిక్ ఇమేజర్లు కలిగిన టెలీస్కోపు ను సాధారణంగా వాడెదరు;
- అధిక శక్తి ఖగోళ శాస్త్రము లో ఎక్స్ రే ఖగోళ శాస్త్రము, గామా రే ఖగోళ శాస్త్రము, అతి నీలలోహిత ఖగోళ శాస్త్రము ల ఉపయోగము తో విశ్వము లోని అత్యంత శక్తి కేంద్రాలను అధ్యయనము చెయ్యడము, న్యూట్రినో లు, కాస్మిక్ రే ల ను అధ్యయనము చెయ్యడము జరుగుతున్నది.
రోదసి నౌక (స్పేస్ క్రాఫ్ట్) ల వల్ల గ్రహాల అధ్యయనము ముందంజ వేసింది. వీటి లో గ్రహాల చుట్టూ పరిభ్రమిస్తూ రీడింగులు తీసుకునే కాసినీ హైజెన్స్ వంటి మానవ నిర్మిత ఉపగ్రహాలు, మార్స్ పాత్ ఫైండర్ వంటి ల్యాండింగ్ వెహికిల్ లు(ఇతర గ్రహము మీద కు దిగగలిగే వాహనము) ల వల్ల గ్రహాలు , ఉప గ్రహాల గురించి చాలా సమాచారము గ్రహించబడినది. డిస్కవరీ, కొలంబియా వంటి స్పేస్ షటిల్ (అంతరిక్షము లోకి వెళ్ళి మళ్ళీ ఈ భూమ్మిదకు వెనక్కు రాగలిగే వాహనము) ల వల్ల అంతరిక్షము లో పరిశొధనలు సాధ్యమవుతున్నాయి
[మార్చు] సంబంధిత విజ్ఞానశాస్త్రములు
ఖగోళ శాస్త్రము ఇతర విజ్ఞాన శాస్త్రముల తో చాలా సన్నిహిత సంబంధాలను పెంచుకుంటున్నది. ఆ విధముగా కనుగొన బడ్డ ఉపశాస్త్రములు
[మార్చు] ఇవికూడా చూడండి
[మార్చు] మూలాలు
- ↑ Arthur Berry (1961). A Short History of Astronomy From Earliest Times Through the Nineteenth Century. New York: Dover Publications, Inc..
- ↑ (1999) in Michael Hoskin: The Cambridge Concise History of Astronomy. Cambridge University Press. ISBN 0-521-57600-8.
- ↑ Electromagnetic Spectrum. NASA. Retrieved on 2006-09-08.
- ↑ G. A. Tammann, F. K. Thielemann, D. Trautmann (2003). Opening new windows in observing the Universe. Europhysics News. Retrieved on 2006-08-22.
వర్గాలు: మొలక | ఖగోళ శాస్త్రము | విశ్వము