చీరాల
వికీపీడియా నుండి
చీరాల మండలం | |
జిల్లా: | ప్రకాశం |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | చీరాల |
గ్రామాలు: | 2 |
జనాభా (2001 లెక్కలు) | |
---|---|
మొత్తము: | 162.897 వేలు |
పురుషులు: | 81.754 వేలు |
స్త్రీలు: | 81.143 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 66.72 % |
పురుషులు: | 76.02 % |
స్త్రీలు: | 57.41 % |
చూడండి: ప్రకాశం జిల్లా మండలాలు |
చీరాల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు గల పట్టణము. చీరాలకి ఈ పేరు దాని పాత పేరు క్షీరపురి నుండి వచ్చింది (ఇక్కడ సముద్రము తెల్లగా కనపడుతుంది. అంచేత ఈ వూరికి ఆ పేరు వచ్చింది.). ఈ పట్టణము ప్రకాశం జిల్లాలోనే ప్రధాన పట్టణము. వస్త్ర ఉత్పత్తి, వ్యాపారంలో సాధించిన ప్రగతి కారణంగా చీరాల చిన్న బొంబాయిగా పేరుగాంచింది. ఈ పట్టణం భారతీయ వాయుసేనకు చెందిన స్థావరం, సూర్యలంకకు దగ్గరగా వున్నది .
నేటి చీరాల పట్టణానికి శంకుస్థాపన 1604 లో ఇద్దరు యాదవ ప్రభువులు - మించాల పాపయ్య, మించాల పేరయ్యలు చేసారు. ఈ పట్టణం పాత చీరాలకు అసలు పేరైన శుద్ధనగరం నుండి ఏర్పడింది. మద్రాసు ప్రాచ్య లిఖిత భాండాగారం లోని రికార్డుల ప్రకారం, శుద్ధనగరాన్ని కాకతి గణపతిదేవ చక్రవర్తి వద్ద మంత్రిగా ఉన్న గోపరాజు రామన్న, చీరాల అనంతరాజుకు క్రీ.శ.1145 లో దానమిచ్చాడు. అతని వారసుడు చీరాల వెంకటకృష్ణుడు ప్రస్తుత చీరాలను కొత్త పట్టణాన్ని నిర్మించేందుకు గాను యాదవులకు కౌలుకిచ్చాడు. ఈ ప్రకారం, విశ్వావసు సంవత్సర వైశాఖ సశుద్ధ సప్తమి నాడు - క్రీ.శ.1604 లో - నేటి చీరాల పట్టణం ఆవిర్భవించింది.
కొత్త పట్టణంలో 1619 లో వేణుగోపాలస్వామి గుడి, 1620 లో మల్లేశ్వరస్వామి గుడి కట్టించారు. మరి కొద్దికాలం తరువాత గంగమ్మ గుడి కట్టించారు. 19వ శతాబ్దపు మధ్య కాలంలో చీరాల రామన్న పంతులు ఈ గుడులకు రథాలు తయారుచేయించాడు.
చెన్నై-కోల్కతా-ఢిల్లీ ప్రధాన రైలుమార్గంలో ఉన్న చీరాలలో రైల్వే స్టేషను ఏర్పాటయ్యాక, వ్యాపారపరంగా చీరాల అభివృద్ధి చెందింది. ఒకప్పుడు మోటుపల్లి రేవు ద్వారా సముద్ర వ్యాపారం చేసిన పాత చీరాల క్రమేణా ప్రాముఖ్యతను కోల్పోయి, ఓ చిన్న గ్రామంగా మిగిలిపోయింది.
12వ శతాబ్దంలో పలనాటిని పాలించిన హైహయ వంశ పాలకుడైన అనుగురాజు, బ్రహ్మనాయుడితో కలిసి పరివార సమేతంగా పాత చీరాలకు వచ్చినపుడు చెన్నకేశవస్వామి విగ్రహాన్ని, స్వామి దేవేరులు, ఆయుధాలతో సహా ఇచ్చి వెళ్ళాడు. 11వ శతాబ్దంలో చోళులు కట్టించిన పురాతన ఆదికేశవస్వామి గుడి, ప్రస్తుతం జీర్ణస్థితికి చేరుకోగా, వాడరేవు లోని శ్రీ లలితానంద ఆశ్రమానికి చెందిన శ్రీ అరుళానందస్వామి ఆధ్వర్యంలో పునర్నిర్మాణం జరుగుతూంది.
బ్రిటిషువారు చీరాలను ఆరోగ్య విడిదిగా భావించేవారు. 1906 లో మొదటగా ఎడ్వర్డు VII పట్టాబిషేక స్మారక ఆసుపత్రి ప్రారంబమైంది. 1912లో డా.బాయరు బాయరు మిషనరీ ఆసుపత్రి ప్రారంభించాడు.
1923 లో ఐరోపా వారు పొగాకు క్యూరింగు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ ప్రాంతంలో ఇది ఎంతో మందికి ఉపాధి కల్పించింది. యాంత్రికీకరణకు ముందు, 6,000 మంది వరకు ఇక్కడ పనిచేసేవారు. చేనేతకు పట్టుగొమ్మైన చీరాల 25,000 నుండి 30,000 వస్త్రకారులకు ఉపాధి కల్పిస్తున్నది. ఈ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే ప్రత్యేక నేత వస్త్రానికి మంచి ఎగుమతి మార్కెట్టు ఉంది. 1959 లో సహకార స్పిన్నింగు మిల్లు కూడా ప్రారంభమైంది.
స్వాతంత్ర్య సమరంలో ప్రత్యేక భూమిక పోషించిన చీరాల 2004, ఏప్రిల్ 27 న (వైశాఖ శుద్ధ సప్తమి) 400 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
[మార్చు] మండలంలోని పట్టణాలు
- చీరాల (m+og) (part)
- చీరాల (m)
[మార్చు] మండలంలోని గ్రామాలు
- ఈపూరుపాలెం (గ్రామీణ)
- గవినివారిపాలెం
- బుర్లవారిపాలెం
- జాండ్రపేట
[మార్చు] ప్రకాశం జిల్లా మండలాలు
యర్రగొండపాలెం | పుల్లలచెరువు | త్రిపురాంతకము | కురిచేడు | దొనకొండ | పెద్దారవీడు | దోర్నాల | అర్ధవీడు | మార్కాపురం | తర్లుపాడు | కొంకణమిట్ల | పొదిలి | దర్శి | ముండ్లమూరు | తాళ్ళూరు | అద్దంకి | బల్లికురవ | సంతమాగులూరు | యద్దనపూడి | మార్టూరు | పర్చూరు | కారంచేడు | చీరాల | వేటపాలెం | ఇంకొల్లు | జే.పంగులూరు | కొరిసపాడు | మద్దిపాడు | చీమకుర్తి | మర్రిపూడి | కనిగిరి | తిమ్మారెడ్డిపల్లె | బెస్తవారిపేట | కంభం | రాచర్ల | గిద్దలూరు | కొమరోలు | చంద్రశేఖరపురం | వెలిగండ్ల | పెదచెర్లోపల్లి | పొన్నలూరు | కొండపి | సంతనూతలపాడు | ఒంగోలు | నాగులుప్పలపాడు | చినగంజాము | కొత్తపట్నం | టంగుటూరు | జరుగుమిల్లి | కందుకూరు | వోలేటివారిపాలెము | పామూరు | లింగసముద్రము | గుడ్లూరు | ఉలవపాడు | సింగరాయకొండ