గిద్దలూరు
వికీపీడియా నుండి
గిద్దలూరు మండలం | |
జిల్లా: | ప్రకాశం |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | గిద్దలూరు |
గ్రామాలు: | 18 |
జనాభా (2001 లెక్కలు) | |
---|---|
మొత్తము: | 78.462 వేలు |
పురుషులు: | 40.093 వేలు |
స్త్రీలు: | 38.369 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 64.09 % |
పురుషులు: | 79.59 % |
స్త్రీలు: | 47.98 % |
చూడండి: ప్రకాశం జిల్లా మండలాలు |
గిద్దలూరు ప్రకాశం జిల్లాలోని ఒక ముఖ్య పట్టణము మరియు అదే పేరుగల మండలము. సగిలేరు నది (స్వర్ణబాహు నది) గిద్దలూరికి దక్షిణాన ప్రవహిస్తున్నది.
[మార్చు] చరిత్ర
గిద్దలూరు యొక్క పూర్వ నామము సిద్ధలూరు. సిద్ధలూరు సమీపములోని నాగేశ్వరాలయము దగ్గర ఒక స్థలమును నందన చక్రవర్తి శ్రీవత్స గోత్రజుడు, నందనవారిక వంశమునకు చెందిన కుంచాల శివప్పకు అగ్రహారముగా ఇచ్చెను. కానీ తరువాత ఈ గ్రామము పాడుబడటము వలన, శివప్ప వంశీయుడైన రామచంద్ర నందవరము నకు తరలివెళ్లెను. ఆయన అక్కడి నుండే సిద్ధలూరి యొక్క వ్రిత్తిని అనుభవించెను.
శక యుగములో తొండమారయగుళ్ల స్థాపన జరిగిన తరువాత, కుంచెల రామచంద్ర తొండమారయగుళ్ల నాయకుని నుండి కొత్తగా స్థాపించిన సిద్ధలూరిని అగ్రహారముగా పొంది నందవరము నుండి ఇరవై - ముప్పై బ్రాహ్మణ కుటుంబములు మరియు బారబలావతుల తో (12 మంది గ్రామ సేవకులు) సహా సిద్ధలూరికి తిరిగి వచ్చెను. తొండమారయగుళ్ల నాయకుని మరణానంతరము ఆ ప్రదేశము నిర్జన మయ్యెను. ఆ కాలములో సిద్ధలూరి ప్రాభవము పెరిగి గ్రిద్ధలూరని కొత్త పేరు సంతరించుకొన్నది. కొంత కాలము తర్వాత గ్రిద్దలూరు అగ్రహారీకుడూ, కుంచాల రామచంద్రుని వంశజుడూ అయిన కుంచెల వెంకటాద్రయ్య గ్రామము చుట్టూ అనేక కుగ్రామములు స్థాపన చేయించి గిద్దలూరిని మెరుగు పరచెను. అనతి కాలములోనే ఆ కుగ్రామములు కంచిపల్లె, చట్టిరెడ్డిపల్లె మరియు అక్కలరెడ్డిపల్లె మౌజే లుగా (స్వంతంత్ర గ్రామములు లేదా ఒక మాదిరి పట్టణములు) ఎదిగినవి. దీనితో గిద్దలూరు కస్బా (ప్రధాన కేంద్రము) గా ఎదిగినది.
హరిహర దేవరాయల కాలములో రామచంద్రరాజు ఈ ప్రాంతములను జాగీర్దారుగా పరిపాలించుటకు వచ్చి ఈ గ్రామములను వెంకటాద్రి నుండి వశము చేసుకొనెను. కానీ ఆ తర్వాత కాలములో వెంకటాద్రి నుండి ఆ వంశములో మూడవ తరానికి చెందిన రామచంద్ర, హరిహర రాయలచే పునస్థాపించబడి తన గ్రామాలను తిరిగి పొందెను. ఆయన కరణముగా కూడా నియమించబడెను. ఈ విధముగా ముస్లింలు రాక వరకు రామచంద్రరాజు వంశజులు గిద్దలూరు కస్బాను మరియు దాని గ్రామాలను పరిపాలించినారు. రాయల పాలన ముగించడముతో గిద్దలూరు ముస్లింల ఆక్రమణకు గురైనది. ఆ తరువాత కాలములో బ్రిటిషు పాలన క్రింద ఉన్నది.
[మార్చు] గ్రామాలు
|
[మార్చు] ప్రకాశం జిల్లా మండలాలు
యర్రగొండపాలెం | పుల్లలచెరువు | త్రిపురాంతకము | కురిచేడు | దొనకొండ | పెద్దారవీడు | దోర్నాల | అర్ధవీడు | మార్కాపురం | తర్లుపాడు | కొంకణమిట్ల | పొదిలి | దర్శి | ముండ్లమూరు | తాళ్ళూరు | అద్దంకి | బల్లికురవ | సంతమాగులూరు | యద్దనపూడి | మార్టూరు | పర్చూరు | కారంచేడు | చీరాల | వేటపాలెం | ఇంకొల్లు | జే.పంగులూరు | కొరిసపాడు | మద్దిపాడు | చీమకుర్తి | మర్రిపూడి | కనిగిరి | తిమ్మారెడ్డిపల్లె | బెస్తవారిపేట | కంభం | రాచర్ల | గిద్దలూరు | కొమరోలు | చంద్రశేఖరపురం | వెలిగండ్ల | పెదచెర్లోపల్లి | పొన్నలూరు | కొండపి | సంతనూతలపాడు | ఒంగోలు | నాగులుప్పలపాడు | చినగంజాము | కొత్తపట్నం | టంగుటూరు | జరుగుమిల్లి | కందుకూరు | వోలేటివారిపాలెము | పామూరు | లింగసముద్రము | గుడ్లూరు | ఉలవపాడు | సింగరాయకొండ