వికీపీడియా నుండి
విజయనగరం జిల్లా |
రాష్ట్రము: |
ఆంధ్ర ప్రదేశ్ |
ప్రాంతము: |
కోస్తా |
ముఖ్య పట్టణము: |
విజయనగరం |
విస్తీర్ణము: |
6,539 చ.కి.మీ |
జనాభా (2001 లెక్కలు) |
మొత్తము: |
22.45 లక్షలు |
పురుషులు: |
11.2 లక్షలు |
స్త్రీలు: |
11.24 లక్షలు |
పట్టణ: |
4.12 లక్షలు |
గ్రామీణ: |
18.33 లక్షలు |
జనసాంద్రత: |
343 / చ.కి.మీ |
జనాభా వృద్ధి: |
6.35 % (1991-2001) |
అక్షరాస్యత (2001 లెక్కలు) |
మొత్తము: |
51.82 % |
పురుషులు: |
63.0 % |
స్త్రీలు: |
40.73 % |
చూడండి: ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు |
విజయనగరం జిల్లా భారత దేశము లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈశాన్యాన ఉన్నది. విజయనగరం ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. రాష్ట్రం లోని జిల్లాలన్నిటికంటే, విజయనగరం జిల్లా అత్యంత కొత్తది. 1979 జూన్ 1 న ఈ జిల్లా ఏర్పడింది. దీనితో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 23 కు చేరింది. విజయనగరం బంగాళా ఖాతము నుండి 18 కి.మీ.ల దూరములో, విశాఖపట్నం నకు 40 కి.మీ.లు ఈశాన్యమున ఉన్నది. 2001 జనాభా లెక్కల ప్రకారము విజయనగరం జిల్లా యొక్క జనాభా 22,45,100.
[మార్చు] కొన్ని గణాంకాలు
- లోక్సభ స్థానాలు (2): పార్వతీపురం, బొబ్బిలి
- శాసనసభ స్థానాలు (12): సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, విజయనగరం, బొబ్బిలి, చీపురుపల్లి, తెర్లాం, పార్వతీపురం, సతివాడ, గజపతి నగరం, ఉత్తరపల్లి, నాంగూరు.
- రెవెన్యూ విభాగాలు (2): విజయనగరం, పార్వతీపురం
- నదులు: గోస్తని, చంపావతి, నాగావళి, గోముఖనది, సువర్ణముఖి, వేగావతి. నాగావళిని దిగువ ప్రాంతాల్లో లాంగుల్య నది అని వ్యవహరిస్తారు.
- దర్శనీయప్రదేశాలు: బొర్రాగుహలు, బొబ్బిలి, తాటిపూడి, పుణ్యగిరి, కుమిలి, రామతీర్థం. బొర్రాగుహలు, బొబ్బిలి చారిత్రక ప్రదేశాలు కాగా రామతీర్థం పుణ్యక్షేత్రం. ఇక్కడే బౌద్ధ స్తూపం కూడా ఉంది.
[మార్చు] కొన్ని విశేషాలు
[మార్చు] విజయనగరం మండలాలు
భౌగోళికంగా విజయనగరం జిల్లాను 34 రెవిన్యూ మండలములుగా విభజించినారు.
[మార్చు] బయటి లింకులు
విజయనగరం జిల్లా అధికారిక వెబ్‌సైటు